Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కౌంటర్‌పాయింట్ అధ్యయనం వెల్లడి
హైదరాబాద్: తమ 5జీ వారసత్వాన్ని సంఘటితం చేసుకుంటూ, ఒప్పో ఇండియా యొక్క ఎఫ్19 ప్రో+5జీ ని ఇటీవలనే 25–30 వేల రూపాయల విభాగంలో నెంబర్1గా విక్రయాలు జరుపుకుంటున్న 5జీ స్మార్ట్‌ఫోన్‌గా మార్చి మరియు ఏప్రిల్ నెలల కోసం కౌంటర్ పాయింట్ ప్రకటించింది. అహ్మదాబాద్, బెంగళూరు మరియు ముంబైలు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ప్రాంతాలుగా నిలువడంతో పాటుగా ఈ ఉత్పత్తికి సంబంధించి అత్యధిక విక్రయాలనూ నమోదు చేశాయి.
ఒప్పో యొక్క 5జీ ఉత్పత్తి ఎఫ్19+ ప్రోను మధ్య తరహా స్మార్ట్‌ఫోన్ శ్రేణి విభాగంలో ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరికీ 5జీ సాంకేతికతను ఇది అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆసక్తికరంగా, ఈ ఉపకరణం 230 కోట్ల రూపాయల అమ్మకాలను ఎఫ్19 ప్రో సిరీస్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన మూడు రోజుల్లోనే విజయవంతంగా నమోదు చేసింది.
ఈ విజయం గురించి దమయంత్ ఖనోరియా, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, ఒప్పో ఇండియా మాట్లాడుతూ ‘‘ఎఫ్19 ప్రో +5జీకు అందుకున్న స్పందన పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఈ సిరీస్‌లోని ఉపకరణాలను ప్రజలు అంగీకరించడానికి నిదర్శనంగా ఈ విజయం నిలుస్తుంది. శక్తివంతమైన ప్రమాణాలకు ఈ ఉత్పత్తి నిలువడంతో పాటుగా లక్షలాది మంది భారతీయుల ప్రేమనూ సొంతం చేసుకుంది. ఆవిష్కరణల పరంగా హద్దులను అధిగమించేందుకు మేము కృషి చేస్తున్నాము. అదే సమయంలో మా వినియోగదారులకు మహోన్నత అనుభవాలను అందించడం ద్వారా ఈ వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే కన్స్యూమర్ టచ్ పాయింట్లను సృష్టించనున్నాం’’ అని అన్నారు.
ఈ బ్రాండ్ ఇప్పుడు పలు ఆఫర్లను వినియోగదారుల కోసం ప్రత్యేకంగా జూన్ నెలలో పరిచయం చేసింది. కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడాలతో ఒప్పో ఒప్పందం చేసుకుని వినియోగదారులకు ఫ్లాట్ 7.5% క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. దీనితో పాటుగా జీరోడౌన్పేమెంట్ ఋణ పథకం, పేటీఎం వినియోగించిన ఎడల 11% ఇన్స్టెంట్ క్యాష్‌బ్యాక్‌ను సైతం అందిస్తుంది.
ఎఫ్సిరీస్ ఎప్పుడూ కూడా వివేకవంతులైన యువ ట్రెండ్ సెట్టర్స్ అభిమాన సిరీస్‌గా నిలుస్తుంటుంది. ఈ సిరీస్‌లోని ట్రెండ్ సెట్టింగ్ ఫీచర్లు, వినియోగదారులు తమ జీవితాన్ని మరింతగా ఆస్వాదించే అవకాశం అందిస్తాయి. వినూత్నమైన ఫీచర్లు అయినటువంటి ఏఐ హైలెట్ పోట్రెయిట్ వీడియో, స్మార్ట్ 5జీ, డ్యూయల్ వీడియో మోడ్, సుపీరియర్ బ్యాటరీ, లీనమయ్యే గేమింగ్ అనుభవాలు మరియు మరెన్నో ఫీచర్లు కలిగిన ఎఫ్19 ప్రో సిరీస్ యువ ట్రెండ్ సెట్టర్ల నడుమ అద్భుతాలను సృష్టిస్తుంది.