Authorization
Mon Jan 19, 2015 06:51 pm
· ఆరోగ్యం, భద్రతలు ప్రాధాన్యతగా శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్ల వద్ద నూతన షాపింగ్ అనుభవాలు
· వినియోగదారులు ‘బుక్’ 9870–494949 నెంబర్‌కు వాట్సాప్ చేయడంద్వారా అతి సులభంగా సేవలను పొందడంతో పాటుగా ప్రత్యేక ప్రయోజనాలను
ఢిల్లీ: భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్ నేడు నూతన వినియోగదారుల కార్యక్రమాన్ని తమ ‘వుయ్ కేర్ ఫర్ యు’ కార్యక్రమం కింద ఆరంభించింది. ఈ నూతన కార్యక్రమాలు భద్రత, ఆరోగ్యం మరియు సౌకర్యంను శాంసంగ్ ఉత్పత్తులు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు అందిస్తాయి. వినియోగదారులు ఇప్పుడు నూతన ఫీచర్ ‘షాప్ బై అపాయింట్మెంట్’ ను వినియోగించుకోవచ్చు. దీనిలో భాగంగా వాట్సాప్ ద్వారా సౌకర్యవంతంగా తమ దగ్గరలోని ఎక్స్‌క్లూజివ్ స్టోర్ వద్ద ఆన్లైన్ షాపింగ్ అపాయింట్మెంట్ను తీసుకునే స్వేచ్ఛ లభిస్తుంది. దీనితో పాటుగా వినియోగదారులు అదనపు ప్రయోజనాలు అయినటువంటి శాంసంగ్ స్టూడెంట్ అడ్వాంటేజ్ ప్రోగ్రామ్, శాంసంగ్ రిఫరల్ అడ్వాంటేజ్ ప్రోగ్రామ్ మరియు శాంసంగ్ స్మార్ట్ క్లబ్ సభ్యత్వంను శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్ల వద్ద షాపింగ్ చేసిన ఎడల పొంవదచ్చు.
‘‘శాంసంగ్ వద్ద, వినియోగ దారుల భద్రత మరియు ఆరోగ్యం అత్యున్నత ప్రాధాన్యతాంశాలుగా ఉంటాయి. ఈ కారణం చేతనే మేము ‘వుయ్ కేర్ ఫర్ యు’ కార్యక్రమాన్ని ఆరంభించాము. వినియోగదారులకు అత్యున్నత శ్రేణి ఉత్పత్తులు మరియు సేవలను ఎలాంటి అసౌకర్యం లేని, సురక్షిత షాపింగ్ అనుభవాలను అందించడంపై తద్వారా దృష్టి కేంద్రీకరించాము. నూతనంగా ఆరంభించిన ‘షాప్ బై అపాయింట్మెంట్’ సేవలు ద్వారా వినియోగదారుల వ్యక్తిగత షాపింగ్ అపాయింట్మెంట్ను తమ దగ్గరలోని శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్ దగ్గర బుక్ చేసుకోవచ్చు. వినియోగదారులు హోమ్ డెమో లేదా హోమ్ డెలివరీ సర్వీస్‌ను బుక్ చేసుకోవడంతో పాటుగా తమ ఇంటి నుంచే సౌకర్యవంతంగా గెలాక్సీ ఉపకరణాల అనుభవాలను పొందవచ్చు. ఈ సేవలను వాట్సాప్ ద్వారా ‘బుక్’ అని 9870–494949కు పంపడం ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడంతో పాటుగా ప్రత్యేక ప్రయోజనాలనూ పొందవచ్చు. ఈ సేవలను మా వినియోగదారులు వినియోగించుకోవడంతో పాటుగా ప్రయోజనాలనూ పొందగలరు. సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండగలరు’’ అని మోహన్‌దీప్ సింగ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మొబైల్ బిజినెస్, శాంసంగ్ ఇండియా అన్నారు.
వుయ్ కేర్ ఫర్ యు కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన వినియోగదారుల లక్ష్యిత కార్యక్రమాల జాబితాః
· అపాయింట్మెంట్ షాపింగ్ సర్వీస్ – వినియోగదారులు ఆన్లైన్ అపాయింట్మెంట్ను షాప్ బై అపాయింట్మెంట్ పోర్టల్ వద్ద బుక్ చేసుకోవడం ద్వారా తమ దగ్గరలోని శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్ల వద్ద కొనుగోళ్లు జరుపవచ్చు. ఒకసారి అపాయింట్మెంట్ నిర్ధారించబడిన తరువాత, వినియోగదారులు తమకు అందించిన అపాయింట్మెంట్ స్లాట్‌కు అనుగుణంగా ముఖాముఖి సంభాషణను స్టోర్ ఎగ్జిక్యూటివ్‌తో జరుపవచ్చు. శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు అన్ని భద్రతా మార్గదర్శకాలను అనుసరిస్తాయి. దీనిలో ప్రతి రోజూ స్టోర్ వద్ద డిస్ఇన్ఫెక్షన్ చేయడం, ఉపకరణాల శానిటైజేషన్, సిబ్బందికి ఉష్ణోగ్రత పరీక్షలు మరియు వినియోగదారులకు సైతం పరీక్షలు చేయడం చేస్తున్నారు.
· వాట్సాప్ ద్వారా ఈజీ కనెక్ట్ – భద్రత మరియు సౌకర్యం నిర్ధారించుకుంటూ వినియోగదారులు అతి సులభంగా శాంసంగ్ స్మార్ట్ కేఫ్ వద్ద అపాయింట్మెంట్ సేవలను వాట్సాప్ మార్గంలో బుక్ చేసుకోవచ్చు. వినియోగదారులు వాట్సాప్ లో బుక్ అని 9870–494949 నెంబర్‌కు వాట్సాప్ పంపడంతో పాటుగా అతి సులభమైన స్టెప్స్ అనుసరిస్తూ శాంసంగ్ స్మార్ట్ కేఫ్ వద్ద అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడంతో పాటుగా హోమ్ డెలివరీ మరియు హోమ్ డెమో సేవలనూ పొందవచ్చు. వాట్సాప్ చాట్‌బోట్ సైతం శాంసంగ్ ఉపకరణాలు, తాజా ఆఫర్లుకు సంబంధించిన సమాచారం, దగ్గరలోని స్టోర్ల వివరాలు వంటివి పొందవచ్చు.
· 1000 రూపాయల వరకూ అదనపు రివార్డ్ పాయింట్లు – గతంలో శాంసంగ్ ఉపకరణాలను శాంసంగ్ స్మార్ట్కేఫ్ లేదా శాంసంగ్ స్మార్ట్ ప్లాజా వద్ద లేదా వాట్సాప్ ద్వారా సేవలను బుక్ చేసుకున్న వినియోగదారులకు ప్రత్యేక రివార్డ్ పాయింట్లను అందుకుంటారు. ఆసక్తి కల కొనుగోలుదారులు దగ్గరలోని శాంసంగ్ ప్రత్యేక స్టోర్‌ను సందర్శించడంతో పాటుగా అర్హత కలిగిన ఉపకరణాలు అయినటువంటి గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2, గెలాక్సీ ఎస్ 21 అలా్ట్ర 5జీ, గెలాక్సీ ఎస్ 21+, గెలాక్సీ ఎస్ 21, గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ వంటి ఉపకరణాలపై ప్రయోజనాలను పొందవచ్చు. తమ శాంసంగ్ స్మార్ట్ క్లబ్ వాలెట్ ద్వారా బోనస్ పాయింట్లను పొందవచ్చు.
· శాంసంగ్ స్టూడెంట్అడ్వాంటేజ్: స్టూడెంట్ అడ్వాంటేజ్ కార్యక్రమం క్రింద, విద్యార్థులు ప్రత్యేక రాయితీలను గెలాక్సీ ట్యాబ్‌లు, గెలాక్సీ స్మార్ట్‌వాచెస్, గెలాక్సీ బడ్స్ పై మార్కెట్ ఆఫర్ల కన్నా ఎక్కువగా శాంసంగ్ స్మార్ట్కేఫ్ మరియు శాంసంగ్ స్మార్ట్ ప్లాజా వద్ద పొందవచ్చు.
· హోమ్ డెలివరీ మరియు హోమ్ డెమో: ఎక్స్పీరియన్స్ శాంసంగ్ ఎట్ హోమ్ పోర్టల్ వద్ద తమ అభిమాన శాంసంగ్ ఉపకరణాలను తమ ఇంటి నుంచి సౌకర్యవంతంగా కొనుగోలు చేసి వాటిని హోమ్డెలివరీ పొందడం లేదా హోమ్ డెమో కోసం బుక్ చేయడం ద్వారా వినియోగదారులు వినూత్న అనుభవాలను పొందవచ్చు. గృహ సందర్శనల సమయంలో కూడా అన్ని భద్రతా మార్గదర్శకాలను అనుసరించడంతో పాటుగా లావాదేవీలన్నీ కూడా డిజిటల్ మార్గాల ద్వారా చేయవచ్చు.
· ఇ–ఇన్వాయిస్ వాట్సాప్: వర్ట్యువల్ మరియు కాంటాక్ట్‌లెస్ లావాదేవీలన్నీ కూడా జరిపేందుకు భరోసా అందిస్తూ వినియోగదారులు తమ ఇన్వాయిస్లను వాట్సాప్‌లో సైతం పొందగలరు.
· శాంసంగ్ రిఫరల్ అడ్వాంటేజ్ ప్రోగ్రామ్: శాంసంగ్ స్మార్ట్ కేఫ్ మరియు శాంసంగ్ స్మార్ట్ ప్లాజా వినియోగదారులు అదనపు స్మార్ట్ క్లబ్ ప్రయోజనాలను 7500 రూపాయల వరకూ తమ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు ఎంపిక చేసిన గెలాక్సీ స్మార్ట్‌ఫోన్స్‌పై శాంసంగ్ ప్రత్యేక స్టోర్ల వద్ద పొందవచ్చు. ఒకసారి నమోదు చేసుకుంటే, వినియోగదారులతో పాటుగా వారి స్నేహితులు సైతం రివార్డ్ పాయింట్లును గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2, గెలాక్సీ ఎస్ 21 అలా్ట్ర 5జీ, గెలాక్సీ ఎస్ 21+, గెలాక్సీ ఎస్ 21, గెలాక్సీ ఎస్ 20 ఎఫ్ఈ 5జీ వంటి ఇతర అర్హత కలిగిన ఉపకరణాల కొనుగోలుపై పొందగలరు.
· శాంసంగ్ స్మార్ట్ క్లబ్ లాయల్టీ ప్రోగ్రామ్: వినియోగదారులు 7వేల రూపాయల వరకూ విలువ కలిగిన మూడు అదనపు ఓచర్లను పొందవచ్చు మరియు ఎంపిక చేసిన ఉత్పత్తులుపై ఫాస్ట్రాక్ అప్‌గ్రేడ్స్ సైతం అందిస్తుంది. ఇది సాధారణ కార్యక్రమ నిర్మాణంతో పోలిస్తే అత్యధిక సభ్యత్వ విభాగంలోకి నేరుగా ప్రవేశించే అవకాశం అందిస్తుంది.