Authorization
Mon Jan 19, 2015 06:51 pm
· కేవలం ఐదేళ్ల వరకు ప్రీమియం చెల్లించి, 15 ఏళ్ల వరకు దీర్ఘావధి లక్ష్యాలను పూర్తి చేసుకోండి
· బోనస్ నుంచి పొదుపు పెంచుకునేందుకు వార్షిక సౌకర్యాల అనుకూలత
· ఒక ఏడాది పూర్తిగా ప్రీమియం చెల్లించకపోయినా, కొనసాగే జీవిత బీమా రక్షణ
· ప్లాన్ కాలపరిమితి చివరిలో క్రోఢీకృత అన్ని బోనస్లు, మెచ్యూరిటీ అనుకూలతను పొందండి
· ఈ ప్లాన్ రెండు ఎంపికల్లో వస్తుంది- లైఫ్ మరియు ఎక్స్ట్రా లైఫ్ ఆప్షన్
· మరణం, ప్రమాదాలతో శాశ్వత అంగవైకల్యం లేదా ఏదైనా పేర్కొన్న తీవ్రమైన అనారోగ్యం బారిన పడితే ప్రీమియం రైడర్ మినహాయింపును కలుపుకునే అవకాశంఈ ప్లాన్ ఇస్తుంది.
· ఒకసారి చెల్లింపుగా డెత్ బెనిఫిట్ లేదా 5 ఏళ్లలో కంతుల రూపంలో అందుకునే ఎంపిక చేసుకోసువడం ద్వారా సమగ్ర సురక్షత పొందవచ్చు.
· చెల్లించిన ప్రీమియాలకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.
నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్, లిమిటెడ్ పే మరియు చౌకగా మైక్రో-లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీతో గరిష్ఠ రక్షణ, సురక్షత, జీవన గమనంలో ఎదురయ్యే అనిశ్చితుల నుంచి రక్షణ అందిస్తూ, కచ్చితమైన రాబడి అందిస్తుంది.
ఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రమోషన్లో అందుబాటులోకి వచ్చిన ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (IndiaFirst Life) ఫస్ట్ లైఫ్ మైక్రో బచత్ ప్లాన్ను పరిచయం చేసింది. ఈ నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్, పరిమిత కాలపు మైక్రో-బీమా పాలసీని, ప్రజల జీవితాల్లో అనిశ్చితుల నుంచి భద్రత, క్రమశిక్షణతో కూడిన పొదుపు చేసుకునేలా డిజైన్ చేసింది. సరసమైన ధరతో, తక్కువ ప్రీమియం పరిమాణంలో అందుబాటులోకి తీసుకు వచ్చిన ఈ ప్లాన్ను భద్రత మరియు పొదుపు చేసుకునేందుకు సరైన ఎంపికను చేసింది. ఏదైనా అనిరీక్షిత ఘటనలకు బీమా తీసుకున్న కుటుంబాలకు ఆర్థిక మద్ధతు ఇచ్చే ఈ ప్లాన్లో ప్రీమియం చెల్లింపు మిస్ అయినప్పటికీ జీవిత బీమా రక్షణ కొనసాగేలా చేస్తుంది. అదనంగా నగదు అవసరాలను పరిష్కరించేందుకు 5 ఏళ్ల అల్పావధిలో ఈ పాలసీపై రుణ సౌలభ్యాన్ని కూడా పొందవచ్చు.
ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ డిప్యూటీ సీఈఓ రుషబ్ గాంధి మాట్లాడుతూ ‘కుగ్రామాల్లోని అనియమిత, ఆవర్తక ఆదాయం ఉన్న వినియోగదారులకు చిరు బీమా పరిష్కారాలను అందించే ఉద్దేశంతో మేము ఇండియాఫస్ట్ లైఫ్ మైక్రో బచత్ ప్లాన్ను దాని నూతన అవతారంలో పరిచయం చేసేందుకు చాలా సంతోషిస్తున్నాము. భద్రత, రక్షణ, క్రమశిక్షణతో కూడుకున్న పొదుపులు పరిపూర్ణమైన సమ్మేళనంగా ఈ సరళమైన అందుబాటు ధరలోని ప్లాన్ మా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBs) , కామన్ సర్వీస్ సెంటర్లు (CSCs) ద్వారా అందుబాటులో ఉంటుంది. మేము దేశంలో 98% పిన్ కోడ్లకు మా విస్తృత శ్రేణి పంపిణీ నెట్వర్క్ ద్వారా అందిస్తున్నాము మరియు ఈ నూతన ప్లాన్ మాకు ‘అందరికీ బీమా’ అనే మా ఉద్దేశాన్ని నెరవేరుస్తుందని’’ వివరించారు.
ఇండియాఫస్ట్ లైఫ్ మైక్రో బచత్ ప్లాన్ బీమా తీసుకున్న వారి నగదు అవసరాలను దాని రుణ సౌలభ్యాలతో అందిస్తుంది. ఈ పాలసీని అనుకూలతకు తగినట్లు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కొనుగోలు చేసుకోవచ్చు. ఈ పరిమిత ప్రీమియం చెల్లింపు మరియు ప్లాన్ తీసుకునే వారు 5 ఏళ్ల తక్కువ సమయంలో నిబద్ధతను మరియు 15 ఏళ్ల వరకు పొదుపు, రక్షణను ఒకే పాలసీలో అందిస్తుంది.
కంపెనీ విలక్షణమైన 44 అవసరాల ఆధారిత ఆఫర్లను (ఉత్పత్తులు మరియు రైడర్లు) అందిస్తుండగా, దేశ వ్యాప్తంగా విస్తృత వినియోగదారుల వలయానికి తన సేవలు అందిస్తుంది.