Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బీ2బీ మార్కెట్ ప్రదేశంలో విద్యా సంస్థలు, నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ (ఎన్ పీఓలు) సౌకర్యవంతంగా నమోదు చేసుకోవడానికి, షాపింగ్ చేయడానికి అదనపు లైసెన్స్ గా బిజినెస్ ప్యాన్ ప్రారంభోత్సవాన్ని అమేజాన్ బిజినెస్ నేడు ప్రకటించింది. అమేజాన్ వ్యాపార కస్టమర్లుగా వారు మార్కెట్ ప్రదేశంలో వేలాది విక్రేతలు అందించే వ్యాపార డీల్స్ మరియు ఆఫర్లు, పోటీయుత ధరల ప్రయోజనాల్ని తీసుకోగలుగుతారు.
ఇప్పటి వరకు, కేవలం జీఎస్టీ రిజిస్ట్రేషన్ తో ఉన్న వ్యాపారాలు మాత్రమే అమేజాన్ బిజినెస్ పై నమోదు చేయగలిగాయి. అన్ని వ్యాపారాలకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు కాబట్టి చాలా వ్యాపారాలు అమేజాన్ బిజినెస్ పై షాపింగ్ యొక్క ప్రయోజనాల్ని పొందలేకపోయాయి. అమేజాన్ బిజినెస్ తమ కస్టమర్లు యొక్క రిజిస్ట్రేషన్ కోసం ఇప్పుడు బిజినెస్ ప్యాన్ ని ఆమోదిస్తోంది. చెల్లుబాటయ్యే బిజినెస్ ప్యాన్ ని కలిగిన వ్యాపారాలు ఇప్పుడు అమేజాన్ బిజినెస్ పై విస్త్రతమైన ఉత్పత్తులు, పోటీయుత ధరలు మరియు వేగవంతమైన డెలివరీ యొక్క సౌకర్యం ప్రయోజనాల్ని పొందగలవు.
ప్రారంభోత్సవం పై వ్యాఖ్యానిస్తూ, పీటర్ జార్జ్, డైరక్టర్, అమేజాన్ బిజినెస్ ఇలా అన్నారు, "రిజిస్ట్రేషన్ కోసం లైసెన్స్ రకంగా బిజినెస్ ప్యాన్ యొక్క ప్రారంభోత్సవంతో, పోటీయుత ధరలు, 80 లక్షలకు పైగా విద్యా సంస్థలు ఎన్జీఓలకు ఉత్పత్తులు ఎంచుకోవడం మరియు భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంచడం మరియు తమ వ్యాపార అవసరాలు అన్నింటిని నెరవేర్చడం వంటి ప్రయోజనాల్ని అమేజాన్ బిజినెస్ ద్వారా అందించడానికి మేము ఆనందిస్తున్నాము. విద్యా సంస్థలు మరియు ఎన్జీఓలకు పెంపొందించబడిన ఖాతా భద్రత, అనుసరణ సాధనాలు మరియు ఆధునిక విశ్లేషణలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇవి వారి వ్యాపార కొనుగోళ్లు, గణనీయంగా వాటి ఖర్చుల్ని తగ్గించడాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడంలో సహాయపడతాయి.”
అమేజాన్ బిజినెస్ ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి, సరైన ధరని పొందడానికి బహుళ వెండర్లు కోసం అన్వేషించవలసిన అవసరాన్ని నిర్మూలించడంలో విద్యా సంస్థలు, అన్ని పరిణామాలకు చెందిన ఎన్ పీఓలకు సహాయం చేస్తుంది. సౌకర్యవంతమైన ఆర్డరింగ్ కోసం, భారీ పరిమాణంలో డిస్కౌంట్లు కోసం వారికి ఇప్పుడు విస్త్రతమైన విక్రేతల నెట్ వర్క్ అందుబాటులో ఉంటుంది, తద్వారా తన నగదు ప్రవాహం నిర్వహించడానికి మరియు తమ ఖర్చుల్ని నియంత్రించుకోవడానికి వారికి సహాయపడుతోంది. తమ సంపాదన అవసరాలు కోసం అమేజాన్ బిజినెస్ ని సమతుల్యం చేస్తున్న కొన్ని ప్రసిద్ధి చెందిన విద్యా సంస్థలు మరియు ఎన్ పీఓలలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) బెంగళూరు, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఢిల్లీ, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, షివ్ నాడర్ యూనివర్శిటీ, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇంటాక్), డాక్టర్. ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్, శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ వంటివి ఇతర సంస్థల్లో భాగంగా ఉన్నాయి.
విద్యా సంస్థలు తమ విద్యార్థుల కోసం నిరంతరంగా ఆన్ లైన్ చదువుని కేటాయించడానికి ప్రత్యేకంగా రూపకల్పన చేసిన virtual classroom store వంటి కోవిడ్ -19 సప్లై స్టోర్, డిస్టెన్స్ లెర్నింగ్ స్టోర్ వంటి స్టోర్స్ నుండి షాపింగ్ చేయవచ్చు. ఈ స్టోర్ లో వివిధ విద్యా అవసరాలైన టాబ్లెట్స్, ల్యాప్ టాప్స్, ప్రింటర్స్, వెబ్ కామ్స్, హెడ్ సెట్స్, స్పీకర్స్, ప్రొజెక్టర్స్, నెట్ వర్కింగ్ డివైజ్ లు, అభ్యాసనా అవసరాలైన స్టేషనరి సరఫరాలు, వైట్ బోర్డ్స్, మార్కర్స్, రాత పనికి సంబంధించినవి, పాఠశాల, కళాశాల పాఠ్య పుస్తకాలు వంటి వివిధ రకాల్ని కలిగి ఉంది.
3.7 లక్షల విక్రేతలు నుండి వివిధ తరగతుల్లో 20 కోట్లకు పైగా జీఎస్టీ సదుపాయం గల ఉత్పత్తులతో, కస్టమర్లు హెచ్ పీ, లెనోవో, శామ్ సంగ్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, జేబీఎల్, లాగిటెక్, డి-లింక్, సెల్లో, లక్సర్, క్రాస్, కోర్స్, ఫేబర్-కాజల్, గోద్రేజ్, ప్రెస్టో, బాష్, పిడిలైట్, ఐబెల్, 3 ఎం, కింబెర్లీ-క్లార్క్, డాబర్, వేదక, ఐటీసీ, నెస్కేఫ్, హెచ్ యూఎల్, టాటా స్కాచ్ బ్రైట్ మరియు ఇంకా ఎన్నో విస్త్రతమైన బ్రాండ్స్ నుండి ఎంచుకోవచ్చు. వ్యాపారాలు తమ అధికారిక ఈమెయిల్, ప్రాథమిక కంపెనీ సమాచారం ఉపయోగించి నమోదు చేయవచ్చు. నమోదు చేసే సమయంలో, వ్యాపార సమాచారం పేజీ పై, కస్టమర్లు తమ బిజినెస్ ప్యాన్ నంబర్, తమ వ్యాపారం చేర్చబడిన తేదీని ఎంటర్ చేయవచ్చు. అమేజాన్ బిజినెస్ తదుపరి బిజినెస్ ప్యాన్ ని ధృవీకరిస్తుంది, కస్టమర్ కోసం ఒక వ్యాపార ఖాతాని సృష్టిస్తుంది.