Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత ఐదు ఏళ్లుగా, ఆయా ఆపరేటింగ్ సిస్టమ్స్‌ను వినియోగించుకుంటున్న వారందరూ పరిమితంగా ఉండే తమ ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్, డేటా బ్యాకప్‌ను సురక్షితంగా ఉంచుకునేందుకు ఉచితంగా అందుబాటులో ఉన్న క్లౌడ్ స్టోరేజ్‌పై ఆధారపడ్డారు. ఇది ఉచితంగా ఉన్నంత వరకు మాత్రమే, భారతీయ వినియోగదారులకు ఆసక్తికరమైన ప్రతిపాదన. ఇప్పుడు, వినియోగదారులు తమ నెలవారీ సభ్యత్వాలను వదిలించుకుని డబ్ల్యుడి (WD), శాన్డిస్క్ వంటి బ్రాండ్ స్టోరేజ్‌ను ప్రత్నామ్నాయంగా భావిస్తున్నారు. మంత్లీ సబ్స్క్రిప్షన్ బదులుగా ఒకసారి పెట్టే పెట్టుబడి వినియోగదారులను వారు క్రమం తప్పకుండా చేయవలసిన ఖర్చులను ఆదా చేసుకునేందుకు సహాయపడుతుంది మరియు వారు ఇష్టపడే చోటుకు తమ డేటాతో ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తుంది. దీనికి సంబంధించి ఇక్కడ కొన్ని సిఫార్సులు ఉన్నాయి
ఆపిల్ పరికరాలకు శాన్డిస్క్ iXpand ఫ్లాష్ డ్రైవ్ లక్స్
ఆపిల్ వినియోగదారులు తమ ఐఫోన్ వినియోగించడం ప్రారంభించిన కొద్ది నెలల్లోనే స్టోరేజ్ గరిష్ఠ సామర్థ్యానికి చేరుకోవడంతో, తమ వ్యక్తిగత డేటాను బ్యాకప్ చేసుకునే సమయంలో చాలాసార్లు తికమక పడుతూ సమస్యను ఎదుర్కొంటారు. వీరి కోసం ఒన్ స్టాప్ చికాకు రహిత పరిష్కరణగా SanDisk iXpand Flash Drive Luxeను ఇటీవలే విడుదల చేశారు. వినియోగదారులు ఎటువంటి చికాకు లేకుండా తమ బ్యాకప్‌ను సేవ్ చేసుకునేందుకు లైటెనింగ్ మరియు యుఎస్బి టైప్-సి కనెక్టర్‌తో వెస్ట్రన్ డిజిటల్ విడుదల చేసిన మొట్టమొదటి ఫ్లాష్ డ్రైవ్ ఇది. ఇది ఆపిల్™పరికరాలు, ఆండ్రాయిడ్™స్మార్ట్ఫోన్లతో పాటు యుఎస్బి టైప్-సి పరికరాల మధ్య ఫైళ్లను సరళంగా యాక్సెస్ చేసేందుకు, బదిలీ చేసేందుకు ఒక సొగసైన అనుభవాన్ని అందిస్తుంది. బలహీనమైన ఇంటర్నెట్ ఉన్నప్పుడు తలనొప్పి లేకుండా మీరు మీ స్టోరేజ్‌ను ఖాళీ చేయాలనుకుంటే మరియు/లేదా ఆటోమేటిక్‌గా మీ కంటెంట్‌ను బ్యాకప్ చేయాలనుకుంటే, ఈ డ్రైవ్‌ను మీరు తప్పనిసరిగా కలిగి ఉండాలి.
ధర - 64GB, 128GB మరియు 256GB స్టోరేజ్ వేరియంట్లు | అమెజాన్ ఇండియాలో వరుసగా రూ.4,449, రూ .5,919, మరియురూ .8,999
టైప్ సి ఆండ్రాయిడ్™స్మార్ట్ఫోన్లకు శాన్డిస్క్ అల్ట్రా డ్యూయల్ డ్రైవ్ లక్స్ కంటెంట్ క్రియేటర్లు, ముఖ్యంగా తమ స్మార్ట్ఫోన్లను ఉపయోగించి క్రియేట్ చేసేవారు తమ పాత ఆర్కైవ్లను స్టోర్ చేసుకునేందుకు ఇష్టపడతారు. అంతే కాకుండా నేడు అందుబాటులో ఉన్న స్మార్ట్ఫోన్లలో అధిక మెగాపిక్సెల్ కెమెరాలు మరియు అల్ట్రా హెచ్డి ఎక్స్‌పీరియన్స్‌తో, సృష్టించిన కంటెంట్‌కు భారీ స్టోరేజ్ సామర్థ్యాలు అత్యవసరం. మీరు టైప్-సి పరికరాన్ని కలిగి ఉంటే, కంటెంట్‌ను సృష్టించే వారయితే శాన్డిస్క్ అల్ట్రా డ్యూయల్ డ్రైవ్ లక్స్ (SanDisk Ultra Dual Drive Luxe) మీకు సరిగ్గా సరిపోతుంది.
సిఎంఆర్ నివేదిక ప్రకారం స్మార్ట్‌ఫోన్ దిగుమతి ట్రాకింగ్ 20201 ఏడాది మొదటి ఆర్థిక త్రైమాసికం (Q1)లో వినియోగదారులు కొనుగోలు చేసుకున్న 55% స్మార్ట్ఫోన్లు 55% యుఎస్బి టైప్-సి ఇంటర్ఫేస్ను కలిగి ఉన్నాయి. ఈ అధిక-సామర్థ్యపు స్టోరేజ్ పరిష్కరణ యుఎస్బి టైప్-సి పరికరాల మధ్య సజావుగా కంటెంట్ బదిలీ చేసుకునేందుకు అనుమతిస్తుంది. అధిక-పనితీరు చూపించే యుఎస్బి ఒక సొగసైన ఆల్-మెటల్ కేసింగ్‌లో వస్తుంది మరియు 150MB/ల వరకు రీడ్ స్పీడ్ కలిగి ఉంటుంది. మీరు ఇప్పుడు మరిన్ని చిత్రాలను కలెక్ట్ చేసుకోవచ్చు మరియు వాటిని మీ అన్ని పరికరాల్లో చూడవచ్చు!
ధర - 32GB, 64GB, 128GB, 256GB, 512GB, మరియు 1TB సామర్థ్యాలు; 32GBవెర్షన్‌కు రూ.856 మరియు 1TBవెర్షన్‌కు రూ.11,813
షేర్డ్ స్టోరేజ్‌కు WD మై క్లౌడ్ హోమ్
మన డేటా ఆయా పరికరాలు మరియు స్టోరేజ్ పరిష్కరణల్లో తరచుగా చెల్లాచెదురుగా ఉంటుంది. క్లౌడ్ సేవలు అందుకునేందుకు వినియోగదారులు నగదు చెల్లిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వారు తమ డేటా కోసం ఏకీకృత పరిష్కారం కోసం చూస్తారు మరియు WD మై క్లౌడ్ హోమ్ మీకుబ్యాపక్ అందించేందుకు అందుబాటులోకి వచ్చింది!
ఇది మీ వ్యక్తిగత పరికరాల నుంచి డేటాను ఆటోమేటిక్‌గా బ్యాకప్ చేసే సామర్థ్యం ఉన్న గొప్ప పర్సనల్ క్లౌడ్ స్టోరేజ్ పరికరం - మీ హోమ్ నెట్‌వర్క్‌లోకి వైర్ చేయబడిన వాటితో పాటు, ఇంటర్నెట్ నుంచి కూడా బ్యాకప్ తీసుకుంటుంది. మీరు అదనంగా మీ కుటుంబ సభ్యులకు యాక్సెస్ ఇవ్వవచ్చు మరియు గోప్యతను కొనసాగిస్తూ భాగస్వామ్య కేంద్ర రిపోజిటరీగా ఉపయోగించుకోవచ్చు. ఇది క్లౌడ్ స్టోరేజ్ సేవ లాంటిది మరియు ఇది మీ ఇంట్లో ఉంటే ఒక ఫిజికల్ బాక్సు మాత్రమే. మీరు దీన్ని ఒకసారి కొనుగోలు చేసుకుని నెలవారీ సబ్స్క్రిప్షన్ ధర చెల్లించే బదులుగా ఎప్పటికీ మీతోనే ఉంచుకోండి. అదనంగా, మీరు మై క్లౌడ్ హోమ్ మొబైల్ యాప్‌ను ఉపయోగించి ఏ సమయంలోనైనా తేలికగా సేవ్ చేసుకునేందుకు అనువైన ప్రతిదాన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు.
ధర - 2 టిబి వెర్షన్ ధర రూ.12,899ఉండగా, 12 టిబి వరకు లభిస్తుంది
శాన్డిస్క్ ఎక్స్ట్రీమ్ మైక్రో SDXC™యుహెచ్‌ఎస్- I కార్డ్
వృత్తిపరమైన మరియు వ్యక్తిగత వినియోగానికి భారీ స్టోరేజ్‌ను అందించేందుకు ఎస్డి కార్డులు మీకు ఒన్-స్టాప్ పరిష్కారంగా, కాంపాక్ట్ పరిమాణంలో మీకు అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా, అధిక వేగంతో డేటా బదిలీ సౌలభ్యం ఉండడంతో, మైక్రో ఎస్డి కార్డులు మీకు ఆదర్శ భాగస్వామిగా ఉంటాయి.
అటువంటి పరిస్థితుల్లో శాన్డిస్క్ ఎక్స్ట్రీమ్ మైక్రో SDXC™UHS-I CARD మీకు వేగంగా డేటాను వేగంగా బదిలీ చేస్తూ,మీ ఆండ్రాయిడ్™స్మార్ట్‌ఫోన్- యాప్ పనితీరుకు, యాక్షన్ కెమెరాలు లేదా డ్రోన్లకు అనువైనదిగా ఉంటుంది. ఈ అధిక-పనితీరు చూపించే మైక్రో ఎస్డి కార్డు 4K UHD వీడియో రికార్డింగ్, ఫుల్ హెచ్డి వీడియో మరియు హై-రిజల్యూషన్ ఫోటోలను స్టోర్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. అదనంగా, ఇది A2- రేటెడ్, కనుక మీరు అసాధారణమైన స్మార్ట్‌ఫోన్ అనుభవానికి అనుగుణంగా వేగవంతమైన అప్లికేషన్ పనితీరును పొందవచ్చు.
ధర- అమెజాన్‌లో 1 టిబి సామర్థ్యం వరకు రూ.18,702, 64 జిబికి రూ.1,590కు లభిస్తుంది. శాన్డిస్క్ ఎక్స్ట్రీమ్ పోర్టబుల్ ఎస్ఎస్డి పోర్ట్‌ఫోలియో ఎస్ఎస్డిలు అనేవి వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా స్టోరేజ్ భవిష్యత్తులో వేగవంతమైన మార్పులు తీసుకు వస్తున్నాయి. మీ ఇంటర్నెట్ కనెక్టివిటీతో సంబంధం లేకుండా మీ డేటాను ఎల్లప్పుడూ సురక్షితంగా రక్షించడం మరియు యాక్సెస్ చేయవలసిన అవసరం ఉంటుంది. తగ్గించుకునేందుకు ఇష్టపడని పర్యాటక ఔత్సాహికులు, ఫొటోగ్రాఫర్లు మరియు వీడియోగ్రాఫర్ల కోసం శాన్డిస్క్ ఎక్స్ట్రీమ్ పోర్టబుల్ ఎస్ఎస్డిలనుప్రత్యేకంగా రూపొందించారు.
ఈ ఎస్ఎస్డిలు మెరుగైన పనితీరును చూపిస్తూ, వినియోగదారుల ఫైళ్లను వేగంగా బదిలీ చేసేందుకు మరియు డ్రైవ్‌లోనే ఎడిట్ చేసుకునేందుకు అనుమతిస్తాయి. శాన్డిస్క్ ఎక్స్ట్రీమ్ ఎస్ఎస్డిలు కఠినమైన రబ్బరైజ్డ్ పూతను కలిగి, వేర్వరు ఇంప్యాక్ట్లను తట్టుకుంటాయి మరియు నీరు, ధూళి నుంచి రక్షించే ఐపి 55 రేటింగ్‌తో పాటు షాక్‌ల నుంచి అదనపు రక్షణ ఉంటుంది. చాలా పోర్టబుల్ బాడీతో, ఈ స్టోరేజ్ పరికరాలు కష్టపడి పని చేసేవారికి సరైన తోడుగా ఉంటాయి. ధర- 500 జిబికి రూ.7,999, 1టిబికి రూ.12,999 మరియు 2టిబి +4 టిబి మోడల్ రూ.27,499. ప్రో వెర్షన్-1టిబి రూ.19,999, 2 టిబి రూ.34,999కు లభిస్తుంది.