Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ‘ఇండియన్ కిచెన్ కా డిష్ వాషర్’ ఇప్పుడు మరింత సౌకర్యవంతం
ఢిల్లీ: బిఎస్హెచ్ ఇండియా నేడు తన డిష్వాషర్ల శ్రేణిని కొత్తగా మరియు అధునాతనంగా విడుదల చేసింది. ఈ నూతన శ్రేణి కలెక్షన్లో బాష్, సిమెన్స్ బ్రాండ్ల పేరిట భారతీయ వినియోగదారుల సౌలభ్యానికి అనుగుణంగా, సాంకేతికంగా 19 కొత్త మోడళ్లను కంపెనీ అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ నూతన శ్రేణి ఉత్పత్తులు భారతదేశ వ్యాప్తంగా వినియోగదారులకు అన్ని కీలకమైన ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ వాణిజ్య భాగస్వాముల వద్ద రూ.35,000/- ప్రారంభ ధరలో లభిస్తాయి.
తాజా డిష్ వాషర్ ఉత్పత్తుల శ్రేణిలో హోమ్ కనెక్ట్, 3 వే రాక్మాటిక్, డోసేజ్ అసిస్ట్, టచ్ ప్యానెల్, జియోలిత్, స్పీడ్ ఆప్షన్, గ్లాస్ జోన్, ఇంటెన్సివ్ కడి, మరియు ఓపెన్ అండ్ డ్రై అసిస్ట్ తదితర సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఫీచర్లు ఉన్నాయి. నూనత శ్రేణి ఉత్పత్తుల్లో ఇన్-బిల్ట్ హోమ్ కనెక్ట్ టెక్నాలజీ ఉండగా, ఇవి మీ సౌకర్యానికి అనుగుణంగా మీ స్మార్ట్ఫోన్ నుంచి మీ బాష్ డిష్వాషర్కు దూరంగా ఉంటూనే పర్యవేక్షించేందుకు మరియు నియంత్రించేందుకు మీకు అవకాశం కల్పిస్తుంది. అన్ని మోడళ్లు ఎక్కువ సభ్యులు ఉన్న భారతీయ కుటుంబాల కోసం 14, 15-ప్లేస్ సెట్టింగుల్లో లభిస్తుండగా ఇవి, జర్మన్-ఇంజనీరింగ్ సాంకేతికతతో తయారు చేయబడ్డాయి. ప్రతిసారీ వినియోగదారులకు ఇబ్బంది లేని మరియు పరిశుభ్రమైన శుభ్రపరిచే అనుభవాన్ని అందించేందుకు, భారతీయ వంటశాలల కోసం వీటిని పరిపూర్ణంగా తయారు చేశారు. బిఎస్హెచ్ కస్టమర్ సెంట్రిక్ విధానానికి అనుగుణంగా, ఈ కొత్త శ్రేణిని అభివృద్ధి చేసేటప్పుడు ఉన్నతమైన వినియోగదారుని సౌలభ్యం మరియు లక్షణాలకు ప్రాధాన్యత ఇచ్చారు.
నూతన శ్రేణి డిష్వాషర్లను అందుబాటులోకి తీసుకు వస్తున్న నేపథ్యంలో బిఎస్హెచ్ హోమ్ అప్లియెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ &సీఈఓ నీరజ్ భాల్మాట్లాడుతూ “భారతీయ వినియోగదారుల అవసరాలకు, వారి వంటగది అలవాట్లకు అనుగుణంగా, సాంకేతికతంగా అభివృద్ధి చేసిన డిష్వాషర్లను అందుబాటులోకి తీసుకు రావడం మాకు సంతోషంగా ఉంది. ఈ శ్రేణి డిష్వాషర్లు వినియోగదారులకు సౌకర్యానికి భరోసా ఇస్తూ, హైజనిక్ వంటలకు అవకాశం కల్పిస్తాయని మేము విశ్వసిస్తున్నాము. మేము ఈ విభాగంలో పరిశ్రమ నాయకులుగా కొనసాగుతున్న నేపథ్యంలో, పరిశ్రమకు సరి కొత్త ఆవిష్కరణలు, సాంకేతికతలను పరిచయం చేయడం మా కర్తవ్యమని భావిస్తున్నాము. భారతదేశంలో డిష్వాషర్లను విస్తృత స్థాయిలో అందుబాటులోకి తీసుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది మరియు రానున్న సమయాల్లో ఇది ‘కొనదగిన అగ్ర ఉపకరణం’ జాబితాలో ఉంటుందని మేము విశ్వసిస్తున్నాము. నూతన ఫీచర్లతో అందుబాటులోకి తీసుకు వచ్చిన ఈ ఉత్పత్తుల శ్రేణి వినియోగదారులకు రోజువారీ పనులలో మరింత సౌకర్యాన్ని ఇస్తాయని మేము విశ్వసిస్తున్నాము, ఈ శ్రేణిని మరింత సందర్భోచితంగా చేసేందుకు, ఎక్కువ మందిని చేరుకునేందుకు అవవకాశం సుగమం అవుతుందని’’ ధీమా వ్యక్తం చేశారు.
ఇటీవల, బాష్ గృహోపకరణాల సంస్థ వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు, డిష్వాషర్ల వినియోగం గురించి ఉన్న సాధారణ అపోహలను దూరం చేసేందుకు మరియు వాటిని అత్యంత సమర్థవంతంగా ఎలా వినియోగివచ్చో ప్రత్యేక అవగాహన కల్పించేందుకు భారతదేశంలో తన మార్కెటింగ్ ప్రచారాన్ని ‘ఇండియన్ కిచెన్ కా డిష్వాషర్’ను ప్రారంభించింది.