Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత జూన్ మాసం 1-14వ తేదీల్లో భారత ఎగుమతులు 46.43 శాతం పెరిగి 14.06 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ముఖ్యంగా ఇంజనీరింగ్, రత్నాలు, అభరణాలు, పెట్రోలియం రంగాల ఉత్పత్తులకు మద్దతు లభించింది. ఇదే సమయంలో దిగుమతులు 98.33 శాతం ఎగిసి 19.59 బిలియన్ డాలర్లుగా చోటు చేసుకున్నాయి. కాగా.. ప్రస్తుత ఏడాదిలో ఇప్పటి వరకు రూ.619 కోట్ల విలువ చేసే 1.91 లక్షల టన్నుల అరటిపళ్ల ఎగుమతి జరిగిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.