Authorization
Mon Jan 19, 2015 06:51 pm
• సెన్సార్లు, డిటెక్టర్లు, స్మార్ట్ బల్బ్‌లు, స్మార్ట్ ప్లగ్స్ ఆన్లైన్లో లభ్యం
హైదరాబాద్: సుప్రసిద్ధ కన్స్యూమర్ డ్యూరబల్స్ సంస్ధ లైఫ్‌లాంగ్, భారతీయ గృహాల కోసం సమగ్రమైన ఐఓటీ పరిష్కారాలతో స్మార్ట్ హోమ్‌ను విడుదల చేసింది. సంస్థ వెబ్‌సైట్‌తో పాటుగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి పలు ఈ–కామర్స్ వెబ్సైట్లలో కూడా ఇది లభ్యమవుతుంది. దశల వారీగా, తమ విస్తృతశ్రేణి ఐఓటీ పరిష్కారాలను లైఫ్‌లాంగ్ అందుబాటులో ఉంచనుంది. వీటిలో గాడ్జెట్లు, అప్లయెన్సెస్, సెక్యూరిటీ పరిష్కారాలు సైతం ఉన్నాయి. ప్రస్తుతం స్మార్ట్ బల్బ్‌లు, స్మార్ట్ స్మోక్ డిటెక్టర్లు, స్మార్ట్ ప్లగ్‌లు మొదలైనవి సంస్ధ అందిస్తుంది. ఐఓటీ కనెక్టివిటీతో అత్యాధునిక విశ్లేషణలు మిళితం చేయబడిన ఈ స్మార్ట్ హోమ్ పరిష్కారాలు లైఫ్‌లాంగ్ యొక్క స్టెల్లార్ నాణ్యత వాగ్ధానం చేస్తుంది. దేశవ్యాప్తంగా ఈ ఉత్పత్తులు లభ్యమవుతున్నాయి.
ఈ శ్రేణి గురించి లైఫ్‌లాంగ్ ఆన్లైన్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ కో–ఫౌండర్ వరుణ్ గ్రోవర్ మాట్లాడుతూ ‘‘ఐఓటీ క్రింద సమగ్రమైన స్మార్ట్‌హోమ్ పరిష్కారాలను ఆవిష్కరించడానికి మేము ప్రణాళిక చేశాం. దీనిలో భాగంగానే వినియోగదారులు ఒకే యాప్ ద్వారా తమ ఇళ్లను నిర్వహించే సౌకర్యం అందిస్తున్నాం. వారు తమ ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్‌ను నిర్వహించడంతో పాటుగా అత్యంత ఆప్రమప్తతతో విద్యుత్‌నూ వినియోగించుకోవచ్చు మరియు తమ ఇంటిని మరింత సురక్షితంగా సమగ్రశ్రేణి భద్రతా పరిష్కారాలతో మలుచుకోవచ్చు. భారతీయ స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఈ ఉత్పత్తులను తీర్చిదిద్దాం. టియర్ 1 , 2 నగరాల్లో ఈ ఉత్పత్తులకు డిమాండ్ అధికంగా ఉందని మా అధ్యయనం చెబుతుంది కానీ నిజాయితీతో కూడిన ధరలతో టియర్3, 4 నగరాలకు కూడా చేరగలమని భావిస్తున్నాం’’ అని అన్నారు.
ఈ స్మార్ట్‌హోమ్ శ్రేణి సెన్సార్ అండ్ డిటెక్టర్స్ లైట్స్ అండ్ ఫ్యాన్స్, గాడ్జెట్స్ అండ్ అప్లయెన్సెస్ అంటూ మూడు ప్రధాన విభాగాలుగా లభిస్తుంది. ఈ శ్రేణి https://www.lifelongindiaonline.com/collections/smart-home. వద్ద లభ్యమవుతుంది.