Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: కోవిడ్-19 కారణంగా జీవనోపాధులు పై ప్రభావం చూపించిన తమ అల్పాదాయ వర్గాలకు చెందిన కస్టమర్లు కోసం ఎంప్లాయీ-ఫండెడ్ కార్యక్రమం ' “ఘర్ ఘర్ రేషన్” కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నట్టుగా ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ప్రకటించింది. కోవిడ్ -19 కారణంగా దురదృష్టవశాత్తు తమ జీవితాల్ని కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాల కోసం కూడా ఒక సమగ్రమైన కార్యక్రమాన్ని, వైరస్ వ్యాప్తిని నియంత్రించే లక్ష్యంగా ఇతర సామాజిక ప్రతిస్పందన చొరవల్ని కూడా బ్యాంక్ ప్రకటించింది.
1. ఎంప్లాయీ -ఫండెడ్ కస్టమర్ మద్దతుకు, ‘ఘర్ ఘర్ రేషన్’ కార్యక్రమం
a) “ఘర్ ఘర్ రేషన్” ఒక విలక్షణమైన కార్యక్రమం. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ వారి కోవిడ్ ప్రభావానికి గురైన 50,000 మంది అల్పాదాయ వర్గానికి చెందిన కస్టమర్లు కోసం కస్టమర్ కోవిడ్ కేర్ ఫండ్ ఏర్పాటు చేయడానికి ఉద్యోగులు తమ వ్యక్తిగత ఆదాయం నుండి కొంత మొత్తం అందచేసారు. ఈ లక్ష్యం కోసం బ్యాంక్ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనం నుండి ఒక నెల వేతనం వరకు సొమ్ము అందచేసారు.
b) కార్యక్రమం మహమ్మారి వలన ప్రభావానికి గురైన అలాంటి 50,000 మంది అల్పాదాయ కస్టమర్లకు రేషన్ కిట్స్ సరఫరా చేస్తుంది.
c) 10 కేజీల బియ్యం/గోధుమ పిండి, 2 కేజీల పప్పు, 1 కేజీ చక్కెర, ఉప్పు, 1 కేజీ వంట నూనె, 5 ప్యాకెట్లు వివిధ రకాల మసాలా దినుసులు, టీ పొడి, బిస్కెట్లు మరియు ఒక చిన్న కుటుంబానికి సహాయపడే ఇతర ప్రధానమైన అవసరాలు ఉన్న రేషన్ కిట్స్ ని ఉద్యోగులు సేకరిస్తున్నారు.
d) ఈ రేషన్ కిట్స్ బ్యాంక్ నుండి వ్యక్తిగతంగా కస్టమర్ల ఇళ్లకు ఆత్మీయంగా నేరుగా అందచేయబడతాయి. గ్రామీణ ప్రాంతాల్లో, రేషన్ కిట్స్ ని ఉద్యోగులే స్వయంగా అందచేస్తారు. పట్టణ ప్రాంతాల్లో, ఉద్యోగులు ప్రభావానికి గురైన కస్టమర్లకు రూ. 1800 విలువ గల ప్రీ-పెయిడ్ కార్డ్స్ ని అందచేస్తారు. అలాంటి ప్రధానమైన సరఫరాల్ని కొనుగోలు చేయడానికి వాటిని ఉపయోగించవచ్చు.
e) ప్రభావానికి గురైన కస్టమర్లు ఈ కార్యక్రమం క్రింద సహాయం పొందడానికి నేరుగా తమకు దగ్గరలో ఉన్న శాఖని సంప్రదించవచ్చు. బకాయిపడిన కస్టమర్లు కూడా ఈ కార్యక్రమం క్రింద ప్రయోజనం పొందడానికి అర్హులు.
f) ఈ కార్యక్రమం క్రింద ఉద్యోగులు ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, హర్యానా, కేరళ మరియు ఛత్తీస్‌ఘడ్‌లలో 15000 రేషన్ కిట్స్ పంపిణీ చేసారు.
వీ.వైద్యనాథన్, ఎండీ అండ్ సీఈఓ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఇలా అన్నారు, "సంక్షోభం తీవ్రతని పరిగణించి అన్ని సమస్యల్ని మేము పరిష్కరించలేము, మేము సాధ్యమైనంత వరకు మా కస్టమర్లకు సహాయం చేయాలని కోరుకుంటున్నాము, కాబట్టి మా “ఘర్ ఘర్ రేషన్” కార్యక్రమం ఉద్భవించింది. ఈ కార్యక్రమం ద్వారా, మా ఉద్యోగులు వివిధ మొత్తాల్లో అనగా ఒక రోజు జీతం నుండి నెల రోజుల జీతం వరకు అందచేసి కోవిడ్ కస్టమర్ కేర్ ఫండ్ ఏర్పాటు చేసారు. కోవిడ్-19 వలన జీవనోపాధులు ప్రభావానికి గురైన మా కస్టమర్లకు నేరుగా మద్దతు ఇవ్వడానికి మేము ఈ నిధిని ఉపయోగించాలని నిర్ణయించాము. మా ఉద్యోగులు వ్యక్తిగతంగా ప్రధానమైన రేషన్ ని మా ప్రభావానికి గురైన కస్టమర్లకు వ్యక్తిగతంగా సరఫరా చేస్తారు. మా బ్యాంక్ లో మేము “కస్టమర్ ప్రథమం” లక్ష్యాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఈ లక్ష్యాన్ని ఉద్యోగుల్లో కలిగించడానికి మా ప్రభావానికి గురైన కస్టమర్ల సంక్షేమానికి నేరుగా మా ఉద్యోగులు తోడ్పడటం కంటే మెరుగైన విధానం మరొకటి లేదని మేము భావించాము.”
2. ఎంప్లాయీ కోవిడ్ కేర్ స్కీం 2021: మహమ్మారి ప్రారంభమైన నాటి నుండి కోవిడ్-19 వలన తమ జీవితాల్ని కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు మద్దతు చేయడానికి బ్యాంక్ ఒక సమగ్రమైన ఎంప్లాయీ కోవిడ్ కేర్ స్కీం 2021ని కూడా ఆరంభించింది. స్కీంలో ఇవి ఉంటాయి:
a. మొత్తం నిర్ణయించిన చెల్లింపు 4 రెట్లు యొక్క గ్రూప్ టెర్మ్ లైఫ్ లేదా రూ. 30 లక్షలు, ఏది ఎక్కువైతే దాని ప్రకారం.
b. నామినీకి 2 సంవత్సరాల వరకు జీతం అందచేయబడుతుంది.
c. 2021, జూన్ 30 వరకు ఉద్యోగులు తీసుకున్న ఎంప్లాయీ లోన్స్ రద్దు చేయడం.
d. 2021 జూన్ 30కి ముందు ఏదైనా ప్రాణాపాయం సంభవించితే హోం లోన్ రద్దు పరిమితి రూ. 25 లక్షల వరకు అమలు చేయబడుతుంది. ఈ తేదీ తరువాత, ఉద్యోగులు తమ రుణాలను బీమా చేసుకోవాలని భావిస్తున్నారు.
e. ఉద్యోగి కుటుంబానికి 24 నెలలు మెడిక్లెయిమ్ బీమా పొడిగింపు.
f. 2 పిల్లలకు గ్రాడ్యుయేషన్ వరకు నెలకు రూ. 10,000 వరకు ఉపకార వేతనం.
g. ప్రతిభ ఆధారంగా ఉద్యోగి భార్యకు ఉపాధి కల్పించడం.
h. ఉపాధి అవకాశాన్ని పొందని లేదా అర్హురాలు కాని ఉద్యోగి భార్య కోసం రూ. 2 లక్షలు నైపుణ్య శిక్షణ పొందడానికి అర్హురాలు.
i. రూ. 30,000 వరకు అంతిమ సంస్కారాల ఖర్చులు.
j. రూ. 50,000 కుటుంబానికి తరలింపు సహాయం (రిలొకేషన్ అసిస్టెన్స్).
k. ఈ సంవత్సరం వరకు సేవలు చేసిన సమయానికి ప్రో-రేటా బోనస్ చెల్లింపు.
l. ప్రభావానికి గురైన కుటుంబానికి వ్యక్తిగత ఆర్థిక సలహా.
m. తమ కుటుంబంలో ఎవరైనా ప్రభావానికి గురైనట్లయితే ఊహించని ఖర్చుల్ని భరించడానికి ఉద్యోగులు కోసం 24 నెలలు కోసం అడ్వాన్స్ గా జీతం రూ. 3 లక్షల వరకు ఆర్ఓఐ 0% చొప్పున.
https://www.linkedin.com/posts/idfcfirstbank_idfc-first-employee-covid-care-scheme-2021-activity-6801451169748144128-FIuG
అదనంగా, బ్యాంక్ తమ ఉద్యోగుల కోసం కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్స్ నిర్వహిస్తోంది మరియు వేరొక చోట నుండి వ్యాక్సినేషన్ పొందినట్లయితే వ్యాక్సినేషన్ ఖరీదు సొమ్ము వాపసు చెల్లిస్తోంది. ఉద్యోగులకు ఇతర సదుపాయాల్లో భాగంగా కోవిడ్-19 కోసం ఉచితంగా 24x7 డాక్టర్ హెల్ప్ లైన్, అతి తక్కువ ఛార్జీలతో పరీక్షలు కోసం సహాయం, హోం ఐసోలేషన్ ప్యాకేజీలు కోసం డిస్కౌంట్ ధరలు మరియు ఉత్తమమైన ప్రయత్నాలు ఆధారంగా ఉద్యోగులు మరియు వారి కుటుంబానికి హాస్పిటలైజేషన్ సహాయం ఉన్నాయి.
3. జాన్‌కారీ-మే-సమజ్ధారీ కార్యక్రమం: కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం అత్యవసర పరిస్థితి గురించి హెచ్చరించడానికి, వ్యాక్సినేషన్ కి సంబంధించిన తప్పుడు భావనల్ని తొలగించడానికి, బ్యాంక్ డిజిటల్ మార్గాల ద్వారా పాక్షిక-పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో అయిదు మిలియన్లకు పైగా తమ కస్టమర్లను బ్యాంక్ చేరుకుంటోంది మరియు కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా, హర్యాణా మరియు రాజస్థాన్ లలో తొమ్మిది వేర్వేరు భాషల్లో ఎస్ఎంఎస్ లింక్స్ ద్వారా యానిమేటెడ్ ఫిల్మ్స్ పంపిణీ చేయబడుతున్నాయి.
కోవిడ్-19 వ్యాక్సినేషన్ గురించి చైతన్యం పై ఫిల్మ్ చూడటానికి https://youtu.be/XvM6nxbhPRc ఇక్కడ క్లిక్ చేయండి.
4. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ విరాళం కార్యక్రమం: గ్రామీణ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ కొరతని తీర్చడానికి 42 గ్రామీణ శాఖల్లో ఆసుపత్రుల్లో బ్యాంక్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని ఏర్పాటు చేసింది.
5. గాఁవ్-గాఁవ్ మాస్క్ కార్యక్రమం: బ్యాంక్ 64 గ్రామ సఖీస్ (గ్రామ స్థాయి మహిళా ఔత్సాహికులు) ని ప్రారంభించింది. స్థానిక గ్రామ బృందాలు 1,00,000 మాస్క్ లు కుట్టడంలో ప్రోత్సహించడానికి వీరు మధ్యప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంక్ వారి ఫ్లాగ్ షిప్ శ్వేతసశధారా కార్యక్రమంతో పని చేస్తారు. ఇది మహిళా ఔత్సాహికులు కోసం జీవనోపాధులు కలిగిస్తుంది మరియు వారు కుట్టిన మాస్క్ లు, హానులకు గురైన గ్రామీణ వర్గాలకు పంపిణీ చేయబడతాయి, తద్వారా వైరస్ వ్యాప్తి పరిమితం చేయబడుతుంది.
6. మాస్క్ పంపిణీ కార్యక్రమం: అదనంగా, బ్యాంక్ కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని నివారించడానికి 11 రాష్ట్రాల్లో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో 4 లక్షలకు పైగా మాస్క్ లని పంపిణీ చేస్తోంది.
7. క్యాష్ రిలీఫ్ సపోర్ట్ (నగదు సహాయ మద్దతు): కోవిడ్-19 వలన తమ కుటుంబంలో సంపాదించే సభ్యుడ్ని కోల్పోయిన 250 కుటుంబాలకు గివ్ ఇండియా భాగస్వామ్యంతో రూ. 10,000 నగదు సహాయ మద్దతుతో బ్యాంక్ సహాయం చేస్తోంది.