Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : ద్విచక్ర వాహన కంపెనీ యమహా ఇండియా కొత్తగా ఎఫ్‌జడ్ సీరిస్‌లో నియో రెట్రో కమ్యూటర్ను ఆవిష్కరించింది. 149సీసీ సామర్థ్యం కలిగిన ఈ బైకును రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఎక్స్‌షోరూం వద్ద ప్రారంభ ధర రూ.1,16,800గా ఉండగా, స్మార్ట్‌ఫోన్ సాయంతో కనెక్ట్ చేయగలిగే ఫీచర్ బైక్ ధర రూ.1,19,800గా కంపెనీ నిర్ణయిం చింది. ఇది 'వై కనెక్ట్' యాప్ ద్వారా ఇన్ కమింగ్ కాల్ నోటిఫికేషన్, ఎస్ఎంస్ అలెర్ట్, బ్యాటరీ ఛార్జింగ్, ఇంధన వినియోగం, పనిచేయని పక్షంలో నోటిఫికేషన్స్ ఫీచర్ దీని ప్రత్యేకతని ఆ కంపెనీ తెలిపింది.