Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోని ప్రముఖ ఐటి కంపెనీ విప్రో కరోనా కష్ట కాలంలోనూ తన ఉద్యోగుల వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించింది. అసిస్టెంట్ మేనేజర్, అంతకంటే కింది స్థాయి (బ్యాండ్ బి3 వరకు) ఉద్యోగులు వేతన పెంపునకు అర్హులని పేర్కొంది. దీంతో కంపెనీలో కనీసం 80 శాతం ఉద్యోగులకు జీతాలు పెరగనున్నాయి. పెంచిన జీతాలు సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయని వెల్లడించింది. ఈ ఏడాదిలో విప్రో జీతాలు పెంచడం ఇది రెండోసారి. మరో టెక్ దిగ్గజం టిసిఎస్ కూడా ఇప్పటికే రెండు సార్లు జీతాలు పెంచింది.