Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనా సంక్షోభ కాలంలో 29 క్రీడల్లోని 3500 మంది క్రీడా నిపుణులకు సాయం అందించినట్లు డ్రీమ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ వెల్లడించింది. ఇందులో ప్రస్తుతం కొనసాగుతున్న, పదవీ విరమణ చేసిన అథ్లెట్లు, కోచ్‌లు, క్రీడాకారులు ఉన్నారని ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 70 మందికి క్రీడా నిపుణులకు సహాయం అందించినట్లు డ్రీమ్ స్పోర్ట్స్‌కు చెందిన ఈ సంస్థ వెల్లడించింది. గతేడాది ఆగస్టు నుంచి ఆర్థిక సహాయం, శిక్షణ, క్రీడా సామగ్రి మద్దతు, కోచింగ్, సక్రమమైన ఆహారం, పోషకాలు కేటాయించడం, నెలవారీ వేతనం, హైజీన్ కిట్స్ తదితర సాయమందించినట్లు పేర్కొంది.