Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50 లక్షలకు ఖాతాదారులు
ముంబయి : ఫిన్టెక్ బ్రోకర్ ఏంజెల్ బ్రోకింగ్ ఖాతాదారుల జోడింపులో నూతన మైలురాయిని నమోదు చేసినట్టు ప్రకటించింది. వేగవంతమైన నెలవారీ క్లయింట్ చేరిక రేటుతో 50 లక్షల ఖాతాదారులను దాటినట్లు వెల్లడించింది. గడిచిన మే మాసంలో కొత్తగా 4.3 లక్షల కొత్త క్లయంట్లతో ఈ స్థాయికి చేరువయినట్టు పేర్కొంది. గతేడాది నమోదైన నెలవారీ సగటు కంటే రెండింతలు ఎక్కువని తెలిపింది. తమ సమిష్టి ప్రయత్నాలు, కష్టం వల్ల ఆశించిన ఫలితాలను సాధించగలుగుతున్నామని ఏంజెల్ బ్రోకింగ్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ ప్రభాకర్ తివారీ పేర్కొన్నారు.