Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.4 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే
- 800 నిట్స్ వరకూ అత్యున్నత బ్రైట్నెస్
- 6000 ఎంఏహెచ్ బ్యాటరీ
- 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా
హైదరాబాద్: భారతదేశంలో ఎక్కువ మంది విశ్వసించే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్ నేడు, గెలాక్సీ ఎం32ను విడుదల చేసింది. దీనినే బింగీ మాన్స్టర్గా వ్యవహరిస్తున్నారు. గెలాక్సీ ఎం32ను సినిమాలు, ఆటలు, సోషల్ మీడియాలో లీనమయ్యేలా తీర్చిదిద్దారు. ఈ విభాగంలో అత్యుత్తమమైన 6.4 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే మరియు మృదువైన 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉండటంతో పాటుగా లీనమయ్యే వీక్షణ అనుభవాలను అందిస్తుంది. అదే సమయంలో మోషన్ బ్లర్‌ను సైతం తగ్గిస్తుంది. ప్రకాశవంతమైన కాంతిలో, హై బ్రైట్నెస్ మోడ్ స్వయంచాలికంగా ఆన్ కావడంతో పాటుగా గెలాక్సీ ఎం 32 యొక్క స్ర్కీన్ బ్రైట్నెస్ను 800 నిట్స్‌కు తీసుకువెళ్తుంది. ఇది గెలాక్సీ ఎం32ను ఎం సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లో అత్యం శక్తివంతమైన, పెద్దదైన డిస్ప్లేగా మలుస్తుంది మరియు బింగీ వాచింగ్, వినోదంలో ఖచ్చితమైన ఉపకరణంగా మారుస్తుంది.
గెలాక్సీ ఎం 32ను రెండు మెమరీ వేరియంట్స్
4జీబీ +64జీబీ మరియు 6జీబీ+128 జీబీలో వరుసగా 14,999 రూపాయలు మరియు 16,999 రూపాయలలో అందిస్తున్నారు. గెలాక్సీ ఎం 32 స్మార్ట్‌ఫోన్ , రెండు ఆకర్షణీయమైన రంగులు – నలుపు మరియు లైట్ బ్లూ లో లభిస్తున్నాయి. ఇది అమెజాన్ డాట్ ఇన్, శాంసంగ్ డాట్ కామ్ మరియు అన్ని కీలకమైన రిటైల్ స్టోర్ల ద్వారా లభ్యమవుతుంది. పరిచయ ఆఫర్‌గా వినియోగదారులు తక్షణ క్యాష్‌బ్యాక్ 1250 రూపాయలను ఐసీఐసీఐ కార్డులు ద్వారా చెల్లింపులను చేసిన ఎడల పొందవచ్చు. దీని ద్వారా 4జీబీ +64జీబీ రకపు ప్రభావిత ధర 13,749 రూపాయలు మరియు 6జీబీ+128 జీబీ రకపు స్మార్ట్‌ఫోన్ ధర 15,749 రూపాయలకు రానుంది.
‘‘ఎప్పుడైతే 2019లో గెలాక్సీ ఎం సిరీస్‌ను శాంసంగ్ ఆవిష్కరించిందో, అప్పటి నుంచి ఇది స్థిరంగా మార్కెట్లో తమ ప్రతి నూతన ఆవిష్కరణతోనూ వైవిధ్యతను తీసుకువస్తూనే ఉంది. అలాగే ఈ విభాగంలో అత్యుత్తమ ఫీచర్లను తీసుకువస్తూ, మా జెన్ జెడ్, మిల్లీనియల్ వినియోగదారుల కోసం శక్తి, పనితీరును సైతం పునర్న్విచిస్తుంది. నేడు, మేము ఈ మానెస్టర్ వారసత్వాన్ని మా నూతన బింగీ మానెస్టర్, గెలాక్సీ ఎం32కు విస్తరించాం. ఇది ఈ విభాగంలో మూడు అత్యుత్తమతలతో వస్తుంది . ఎఫ్‌హెచ్‌డీ+ సూపర్ అమోలెడ్ 90 హెర్ట్జ్ డిస్ప్లే, ప్రకాశవంతమైన మరియు అత్యంత శక్తివంతమైన ఎం సిరీస్, మానెస్టర్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ మరియు అసాధారణ డాటా సెక్యూరిటీ, నాక్స్‌తో ప్రైవసీ మరియు ఆల్ట్జ్ లైఫ్‌ను కలిగి ఉంటాయి. గెలాక్సీ ఎం32లో వైవిధ్యమైన 64 మెగా పిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరాతో అద్భుతమైన ఫోటోలు, వీడియోలను ఒడిసిపట్టవచ్చు. ఇవన్నీ కూడా మా యువ వినియోగదారులు, మరీ ముఖ్యంగా వినోదం, సోషల్ మీడియాను అమితంగా అభిమానించే వారికి అత్యుత్తమమైన ఉపకరణాలుగా మారుస్తాయి్ అని ఆదిత్య బబ్బర్, సీనియర్ డైరెక్టర్ అండ్ హెడ్, మొబైల్ మార్కెటింగ్, శాంసంగ్ ఇండియా అన్నారు.
బింగీ ఆన్ ఫ్లిక్స్
గెలాక్సీ ఎం32 స్మార్ట్‌ఫోన్, అత్యద్భుతమైన 6.4 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ యు స్ర్కీన్‌ను 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో కంటెంట్ స్ట్రీమింగ్ , వీడియో కాల్స్, ఆన్లైన్ కోర్సులకు హాజరుకావడం వంటి వాటికి ఉపయోగించవచ్చు. ఈ అత్యున్నత బ్రైట్నెస్ మోడ్ 800 నిట్స్ మరింతగా లీనమయ్యే వీక్షణ అనుభవాలను ప్రకాశవంతమైన సూర్యకాంతిలో సైతం అందిస్తుంది. 90 హెర్ట్జ్ డైనమిక్ రిఫ్రెష్ రేట్, స్వల్పకాలపు మోషన్ బ్లర్‌ను అందించడంతో పాటుగా డిస్ప్లే మార్పులో ఆఫ్టర్ ఇమేజ్ను సైతం తగ్గిస్తుంది మరియు స్వల్ప ఎంపీఆర్టీ(మోషన్ పిక్చర్ రెస్పాన్స్ టైమ్)ను సైతం అందిస్తుంది. ఇది వేగవంతమైన మృదువైన డిస్ప్లేను అందిస్తుంది. అంతేనా, ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో రక్షించబడుతుంది. ఇది గీతలు నివారించడంతో పాటుగా డిస్ప్లే పగుళ్లనూ అడ్డుకుంటుంది. గెలాక్సీ ఎం32 స్మార్ట్‌ఫోన్ డాల్బీ అట్మాస్ మద్దతుతో వస్తుంది. సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్ కోసం ఇయర్‌ఫోన్స్‌ను వినియోగించవచ్చు.
గెలాక్సీ ఎం32లో భారీ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. పగలు, రాత్రి తేడా లేకుండా రోజంతా మీరు మీ స్మార్ట్‌ఫోన్ వినియోగంలో లీనం కావడానికి దోహదపడుతుంది. దీనికి 25 వాట్ల చార్జింగ్ మద్దతునందిస్తుంది మరియు బాక్స్‌తో పాటుగా 15 వాట్ల ఫాస్ట్ చార్జర్ వస్తుంది. ఇది మిమ్మల్ని తరచుగా చార్జ్ చేయాల్సిన బాధ పడకుండా ముందుకు తీసుకువెళ్తుంది. ఈ ఫోన్ 130 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 40 గంటల టాక్‌టైమ్ మరియు 25 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. అత్యాధునిక ఆక్టా కోర్ మీడియా టెక్ హెలియో జీ80 ప్రాసెసర్ శక్తివంతమైన గెలాక్సీ ఎం32 అద్భుతమైన పనితీరును అందిస్తుంది మరియు బ్రౌజింగ్ లేదా బహుళ యాప్‌ల వినియోగం వేళ కూడా మృదువైన మల్టీటాస్కింగ్‌ను సైతం అందిస్తుంది.
లైక్స్‌పై అమితం
గెలాక్సీ ఎం32లో వైవిధ్యమైన 64 మెగా పిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇది 20 మెగాపిక్సెల్ కెమెరా సైతం కలిగి ఉండడం వల్ల ప్రకాశవంతమైన, స్పష్టమైన సెల్ఫీలను తీసుకోవచ్చు. వెనుక వైపు, గెలాక్సీ ఎం32 లో 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగా పిక్సెల్ అలాట్రా వైడ్ కెమెరా ఉంటాయి. ఇది వినియోగదారులు అత్యద్భుతమైన ల్యాండ్‌స్కేప్స్‌ను ఒడిసిపట్టేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ కెమెరాతో 123 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూను మానవ నేత్రాలతో వీక్షించిన రీతిలోనే వీక్షించవచ్చు. 2 మెగా పిక్సెల్ మ్యాక్రోలెన్స్లు లోతైన క్లోజప్ షాట్స్‌ను టెక్చర్‌కు తగినట్లుగా తీసుకోవడంలో తోడ్పడుతుంది. మీరు డెప్త్ మోడ్‌లోకి వెళ్లినప్పుడు ఈ 2 మెగా పిక్సెల్ కెమెరా అద్భుతమైన పోట్రెయిట్ షాట్స్‌ను లైవ్ ఫోకస్‌తో అందిస్తుంది. గెలాక్సీ ఎం32లో పలు కెమెరా మోడ్స్ అయినటువంటి హైపర్‌ల్యాప్స్, స్లో మోషన్, ఫుడ్ మోడ్, ప్రో మోడ్ మరియు ఏఆర్ జోన్ వంటివి ఉన్నాయి. ఇవి వినియోగదారులు గతంలో ఎన్నడూ లేని రీతిలో తమను తాము వ్యక్తీకరించుకునేందుకు తోడ్పడతాయి.
శక్తివంతమైన, సహజమైన సాఫ్ట్వేర్
గెలాక్సీ ఎం 32 స్మార్ట్ఫోన్లు శాంసంగ్ నాక్స్ 3.7తో వస్తున్నాయి. ఇవి అసాధారణ ప్రైవసీ, మెరుగైన భద్రతను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్11 మరియు ఒన్ యుఐ 3.1 ఔట్ ఆఫ్ ద బాక్స్‌కు మద్దతునందిస్తుంది. ఇది వినియోగదారుల అనుభవాలను తరువాత దశకు మెరుగైన డిజైన్, వృద్ధి చేసిన అనుకూలీకరణలు, అసాధారణ నియంత్రణ ఫీచర్లతో అందిస్తుంది. ఇవి మరింతగా చేసేందుకు తోడ్పడతాయి.
వినియోగదారులు ఆల్ట్జ్ లైఫ్ ఫీచర్‌ను గెలాక్సీ ఎం 32పై ఆస్వాదించవచ్చు. ఇది మీరు వేగంగా, అతి సులభంగా నార్మల్ మోడ్ మరియు ప్రైవేట్ మోడ్ (సెక్యూర్ ఫోల్డర్)లో మారేందుకు తోడ్పడుతుంది. శాంసంగ్ పే మినీ కి సైతం ఈ ఫోన్ మద్దతునందిస్తుంది.
మెమరీ వేరియంట్స్, ధర, ఆఫర్లు
గెలాక్సీ ఎం 32ను రెండు మెమరీ వేరియంట్స్ ః 4జీబీ +64జీబీ మరియు 6జీబీ+128 జీబీలో వరుసగా 14,999 రూపాయలు మరియు 16999 రూపాయలలో అందిస్తున్నారు. గెలాక్సీ ఎం 32 స్మార్ట్‌ఫోన్ , రెండు ఆకర్షణీయమైన రంగులు – నలుపు మరియు లైట్ బ్లూ లో లభిస్తున్నాయి. ఇది అమెజాన్ డాట్ ఇన్, శాంసంగ్ డాట్ కామ్ మరియు అన్ని కీలకమైన రిటైల్ స్టోర్ల ద్వారా లభ్యమవుతుంది.
పరిచయ ఆఫర్‌గా వినియోగదారులు తక్షణ క్యాష్‌బ్యాక్ 1250 రూపాయలను ఐసీఐసీఐ కార్డులు ద్వారా చెల్లింపులను చేసిన ఎడల పొందవచ్చు. దీని ద్వారా 4జీబీ +64జీబీ రకపు ప్రభావిత ధర 13,749 రూపాయలు మరియు 6జీబీ+128 జీబీ రకపు స్మార్ట్‌ఫోన్ ధర 15,749 రూపాయలకు రానుంది.