Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ఆవిష్కరణతో PhonePe దేశంలోనే అత్యంత సౌలభ్యవంతమైన డిజిటల్ వాలెట్‌గా అవతరణ
హైదరాబాద్: భారతదేశంలో అతిపెద్ద డిజిటల్ పేమెంట్ సంస్థ PhonePe తమ వినియోగదారుల కోసం UPI ఇ- మేండేట్స్ను ఉపయోగించి భారతదేశపు మొట్టమొదటి వాలెట్ ఆటో టాప్అప్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ PhonePe వినియోగదారులకు ఒకసారి UPI ఇ-మేండేట్ సెటప్ చేసేందుకు అనుమతిస్తుంది, ఆ తర్వాత వారి వాలెట్ బ్యాలెన్స్ కనిష్ట స్థాయికి పడిపోయినప్పుడల్లా PhonePe తనంతతానుగా టాప్అప్ చేస్తుంది. అంటే, PhonePe వినియోగదారులు ప్రతిసారీ వారి వాలెట్ బ్యాలెన్స్‌ను మాన్యువల్‌గా టాప్అప్ చేయాల్సిన అవసరం లేకుండా, తమ వాలెట్‌ను ఉపయోగించి అనేక పేమెంట్లు చేయవచ్చు. ఇది PhonePe వాలెట్ వినియోగదారుల సమయాన్ని, శ్రమను ఆదా చేయడమే కాక లావాదేవీల సక్సెస్ రేటు ఎక్కువగా (~99.99%) ఉండేలా చూస్తుంది. UPI ఇ-మేండేట్‌ను సెటప్ చేసిన తర్వాత, వినియోగదారులు తమ వాలెట్లను లోడ్ చేయాలనుకుంటున్న ప్రతిసారీ లేదా పేమెంట్ చేసేందుకు పిన్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏర్పడదు.. అలాగే OTP కోసం వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.
వాలెట్ ఆటో టాప్అప్ ఉపయోగించడం వల్ల లభించే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి:
1) బ్యాలెన్స్ కనీస మొత్తం కన్నా తక్కువ స్థాయికి పడిపోయినప్పుడు PhonePe వాలెట్ తనంతటతానుగా టాప్అప్ చేస్తుంది
2) బ్యాలెన్స్ సున్నాకి పడిపోయిన ప్రతిసారీ వారి వాలెట్‌ను వినియోగదారులు లోడ్ చేయాల్సిన అవసరం లేనందున లావాదేవీల సక్సెస్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది.
UPI విషయంలో ఇ-మేండేట్‌ను ఒక పెద్ద ముందడుగు అని చెప్పవచ్చు. ఇది వ్యాపారాలలో పెద్ద సంఖ్యలో వినియోగ పరిస్థితులకు ద్వారాలు తెరిచేలా భారీ స్థాయిలో పేమెంట్లు చేసే తదుపరి స్థితికి తీసుకువెళ్లడంలో సహాయపడుతుంది. PhonePe వినియోగదారుల కోసం వాలెట్ ఆటో టాప్అప్ ప్రవేశపెట్టడంతో మేము ఈ ఫీచర్‌ను అన్ని కోణాల్లోనూ పరీక్షిస్తున్నాము. త్వరలో దీనిని వ్యాపారులు, చెల్లింపు అగ్రిగేటర్లు మరియు ఇతర యాప్‌లకు అందుబాటులో ఉంచడానికి కృషి చేస్తున్నాము. డిజిటల్ పేమెంట్ల వాతావరణానికి UPI ఇ-మేండేట్ ముఖ్యమైనది. ఎందుకంటే ఇది వినియోగదారులకు నిరంతరాయమైన క్రమబద్ధమైన పేమెంట్ అనుభవాన్ని అందించాలన్న RBI దార్శనికతను ముందుకు తీసుకువెళుతోంది.
PhonePe వినియోగదారులు కొన్ని సులభమైన దశలను అనుసరించడం ద్వారా వాలెట్ ఆటో టాప్అప్ను ఎనేబుల్ చేసుకోవచ్చు. వారు చేయాల్సిందల్లా PhonePe యాప్ హోమ్‌పేజీలోని వాలెట్ విభాగంలో ఉన్న ‘టాప్అప్’ ఐకాన్‌పై క్లిక్ చేయడమే. వినియోగదారులు ఆ తర్వాత తాము టాప్అప్ చేయాలనుకుంటున్న మొత్తాన్ని ప్రవేశపెట్టాలి. దాంతో ఆటో టాప్అప్ను ఎనేబుల్ చేయడానికి వినియోగదారులకు ఓ పాప్అప్ తనంతతానుగా చూపబడుతుంది. వినియోగదారులు 1,000 నుండి INR 5,000 వరకు ఆటో టాప్అప్ మొత్తాన్ని ప్రవేశపెట్టి, స్క్రీన్ కింది భాగంలో ఉన్న ‘టాప్అప్ & సెట్ ఆటో టాప్అప్’ వాలెట్ ఆప్షన్‌ను క్లిక్ చేసి UPI పిన్ను ప్రవేశపెట్టాలి. వినియోగదారుల బ్యాంకు నుండి నిర్థారణ విజయవంతమైనట్టు సందేశం వచ్చిన తర్వాత, ఎంచుకున్న మొత్తానికి వాలెట్ వెంటనే రీఛార్జ్ చేయబడుతుంది. దాంతో పాటు ఆటో టాప్అప్ మేండేట్ తయారుచేయబడుతుంది.