Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సోలన్: వినూత్నమైన కార్యక్రమంలో భాగంగా ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ (ఐడీఎస్ఏ) మరియు షూలిని యూనివర్శిటీలు భాగస్వామ్యం చేసుకుని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ అకడమిక్స్ (సీఈడీఎస్ఏ)ను ప్రారంభించాయి. 2021–22 విద్యాసంవత్సరం ఆరంభం నుంచి డైరెక్ట్ సేల్స్‌లో ఒక సంవత్సరం వ్యవధి కలిగిన పీజీ డిప్లొమోను ఇది అందిస్తుంది. ప్రత్యక్ష అమ్మకాల కోసం భారతదేశంలో మొట్టమొదటి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ గా సీఈడీఎస్ఏ నిలుస్తుంది. ఈ కేంద్రాన్ని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖామాత్యులు గోవింద్ సింగ్ ఠాకూర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌర సరఫరా వినియోగదారుల వ్యవహారాల శాఖామాత్యుల రాజిందర్ గార్గ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా షూలిని యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అతుల్ ఖోస్లా మాట్లాడుతూ పరిశ్రమ, విద్యా సంస్థలు ఒకే దరికి వచ్చేందుకు చేస్తోన్న ప్రయత్నం అద్భుతమన్నారు. ఐడీఎస్ఏ ఛైర్పర్సన్ రిని సన్యాల్ మాట్లాడుతూ ‘‘దేశంలో ప్రత్యక్ష విక్రయ వ్యవస్ధలో నూతన అధ్యాయాన్ని సీఈడీఎస్ఏ తెరువనుంది. ఇతర విద్యాసంస్థలు సైతం ప్రత్యక్ష విక్రయ వ్యాపార నమూనాలో అవసరమైన విద్యను అందించడానికి ముందుకు వస్తాయని ఆశిస్తున్నాము. భారతదేశంలో ప్రత్యక్ష విక్రయాలకు సంబంధించి పరిశోధనా ఇన్‌క్యుబేటర్‌గా సీఈడీఎస్ఏ సేవలనందించనుంది’’ అని అన్నారు.
సోలన్‌లో అత్యంత అందమైన యూనివర్శిటీ క్యాంపస్ ఆధారంగా, ప్రపంచంలో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌కు అంకితమైన రెండవ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇది. మొదటిది యుఎస్‌లో ఉన్నటువంటి డీఎస్ఈఎఫ్. అలాగే సీఈడీఎస్ఏ, ఐడీఎస్ఏ ఆవిష్కరణ తరువాత ప్రపంచంలో రెండవ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్గానూ నిలువడంతో పాటుగా డిప్లొమో కోర్సులను అందిస్తున్న రెండవ సంస్థగానూ నిలిచింది. తొలుత ఫ్రాన్స్‌లోని డీఎస్ఏ డైరెక్ట్ సెల్లింగ్‌లో డిప్లొమో అందించింది. ‘‘ప్రత్యక్ష విక్రయాలలో మెరుగైన భవిష్యత్ దిశగా విద్యార్థులు ఆలోచించేలా షూలిని యూనివర్శిటీ తోడ్పడుతుంది. ఐడీఎస్ఏతో ఈ శక్తివంతమైన పరిశ్రమ అవసరాలను తీర్చే కరిక్యులమ్ అందించగలమని నమ్ముతున్నాము’’ అని షూలిని యూనివర్శిటీ ఫౌండర్ అండ్ ప్రొ ఛాన్స్లర్ విశాల్ ఆనంద్ అన్నారు.