Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్
హిందుస్తాన్ యునిలీవర్ గ్రూప్‌కు చెందిన రిన్ డిటర్జెంట్ తమ తాజా ప్రచార కార్యక్రమాన్ని టోక్యో ఒలింపిక్స్ 2021 కోసం అర్హత సాధించిన భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫెన్సింగ్ చాంఫియన్ సీ.ఏ. భవానీ దేవి. జీవితాన్ని వేడుక చేస్తూ రూపొందించింది. ఎలాంటి సౌకర్యాలు లేనప్పటికీ ప్రయత్నం ఆరంభించి, విజయాన్ని సాధించేందుకు తోడ్పడే రీతిలో కథనం తీర్చిదిద్దారు.
ఈ ప్రచారం ఆరంభించడం గురించి హిందుస్తాన్ యునిలీవర్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ వీపీఉ హోమ్ కేర్ ప్రభ నరసింహన్ మాట్లాడుతూ ఐదు దశాబ్దాలుగా ప్రతి భారతీయ గృహంలోనూ అంతర్భాగంగా రిన్ నిలుస్తోందన్నారు. వృద్ధిని కాంక్షించే, తమ కలలను సాకారం చేసుకోవాలనుకునే వ్యక్తులు, తమ అదృష్టాన్ని మార్చుకోవడానికి చూపే ధైర్యానికి మద్దతునందించడానికి ఈ బ్రాండ్ ప్రతీకగా నిలుస్తుందన్నారు. తాజా ప్రచారం అబ్ వక్త్ చమక్ నే కా్ణ ద్వారా భవానీదేవి అత్యద్భుతమైన ప్రయాణం, ఆమె తల్లి త్యాగాలు, సమ్మిళిత విజయం, తమ కలలను సాకారం చేసుకోవడంలో స్ఫూర్తిని ప్రదర్శించామన్నారు. సామాన్యం నుంచి అసామాన్యంగా ఎదిగిన అలాంటి అసాధారణ స్టార్స్‌తో తమ బ్రాండ్ మరింత ఉన్నతంగా మారుతుందన్నారు. భవానీ అంకిత భావానికి తాము వందనాలు తెలుపుతున్నామని చెప్పారు. 2021 ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమవుతున్న భవానీ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.