Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్త డిజిటల్ ఉత్పత్తులు మరియు సేవల పరిచయం డ ఐటి మౌలిక సదుపాయాలకు శక్తి
వచ్చే రెండేండ్లలో డిజిటల్ డ ఎంటర్ప్రైజ్ ఫ్యాక్టరీకి 500 మందిని నియమించుకునే యోజన
నవతెలంగాణ హైదరాబాద్
భారతదేశపు రెండో అత్యంత పెద్ద ప్రయివేటు వలయపు బ్యాంకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు నేడు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తన కొత్త డిజిటల్ ఉత్పత్తులు, సేవలను ప్రారంభించేందుకు తన ఐటి మౌలిక సదుపాయాలను వృద్ధి చేసేందుకు డిజిటల్ ఫ్యాక్టరీ, ఎంటర్ప్రైజ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. డిజిటల్ ఫ్యాక్టరీని ఎంటర్ప్రైజెస్ ఫ్యాక్టరీతో నిర్మాణం చేసే ద్విగుణ విధానం బ్యాంకును నిర్వహించేందుకు, మార్చేందుకు సాంకేతికత మార్పు కార్యసూచికలో భాగంగా ఉంది. బ్యాంకు డిజిటల్ మరియు ఎంటర్ప్రైజ్ ఫ్యాక్టరీల సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు వచ్చే రెండేళ్లలో 500 మందిని నియమించుకునేందుకు ప్రణాళిక రూపొందించుకోగా, అందులో డేటా అనలిటిక్స్, ఏఐ, ఎంఎల్, డిజైన్ థింకింగ్, క్లౌడ్ మరియు డెవలప్మెంట్ ఆపరేటర్లు తదితర విస్తృత నేపథ్యం కలిగి ఉన్నవారు ఉంటారు.
డిజిటల్ ఫ్యాక్టరీ కొత్త సాంకేతిత సేకరణ/ అప్లికేషన్స్ మరియు ఉన్నత స్థితిస్థాపకత, పర్యవేక్షణ సామర్థ్యాలకు లావాదేవీలు మరియు నూతన పరిష్కరణలు అందించనుంది. ఇది పెద్ద ప్రమాణపు ప్రగతికి మద్ధతు ఇచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది. బ్యాంకు భవిష్యత్తు అవసరాలకు ఐపి సాంకేతికతను కూడా అభివృద్ధి చేస్తోంది. సరైన సాంకేతిక కంపెనీలు, ఫిన్‌టెక్ మరియు పెద్ద ఐటి కంపెనీల భాగస్వామ్యంలో నేటివ్ క్లౌడ్ ఆర్కిటెక్చర్‌కు చలిస్తుంది. విశ్వాసార్హత, అందుబాటు, స్కేలబిలిటీ మరియు భద్రత ధృవీకరణ డిజిటల్ ఫ్యాక్టరీ ప్రయత్నాల కేంద్రంలో ఉన్నాయి.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పేమెంట్స్, కన్సూమర్ ఫైనాన్స్, డిజిటల్ బ్యాంకింగ్, ఐటి గ్రూప్ హెడ్ పరాగ్ రావు మాట్లాడుతూ తమ ప్రయత్నాలు తమ వినియోగదారులకు మా సదృఢమైన మౌలిక సదుపాయాల మద్ధతుతో అడ్డంకులు లేని అనుభవాన్ని అందిస్తున్నాము. మొదటి నుంచి మేము భారతదేశపు ఆర్థిక సేవా వలయంలోని డిజిటల్ మార్పుకు నేతృత్వాన్ని వహించామన్నారు. వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచే సాంకేతికత్లో పెట్టుబడులు పెట్టడాన్ని కొనసాగిస్తున్నాము మరియు దక్షతను వృద్ధి చేసుకున్నాము. ఇది ఆర్థిక సేవలకు సరికొత్తగా వ్యాఖ్యానించే మరియు వినియోగదారులను కేంద్ర స్థానంలో ఉంచే ఉత్పత్తులు మరియు సేవలను డిజైన్ చేయడంలో దృష్టికోణాన్ని మార్చనుందని వివరించారు.