Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్
వెడ్డింగ్స్ బై కెనాన్ పేరిట కెనాన్ ఇండియా తన వాణిజ్య చిత్రాన్ని మొదటి దశ ప్రచారంలో భాగంగా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కీలక మార్కెట్ల కోసం నేడు విడుదల చేసింది. స్వయంగా కెనాన్‌ను వినియోగించుకునే ప్రముఖ నటుడు మమ్ముట్టి, ఈ టెలివిజన్ వాణిజ్య చిత్రాన్ని విడుదల చేయగా, వివాహ ఫోటోగ్రఫీ విభాగంలో బ్రాండ్ అంకితభావానికి ఇది మరింత మద్ధతు ఇస్తోంది. దేశంలో ప్రతి ఒక్కరూ వెడ్డింగ్ డెస్టినేషన్లలో ఒకటిగా భావించే కేరళలో ఈ వాణిజ్య ప్రచార చిత్రాన్ని చిత్రీకరించగా, పొగ మంచుతో కూడిన పర్వతాలు, అందమైన బీచ్‌లు మరియు నిర్మలమైన బ్యాక్ వాటర్లు ఇక్కడ ఉన్నాయి.
ఈ క్యాంపెయిన్ గురించి కెనాన్ ఇండియా అధ్యక్షుడు డ సీఈఓ మనాబు యమజాకి మాట్లాడుతూ, నిభారతదేశం శక్తివంతమైన సంస్కృతులతో విభిన్నమైన దేశం కాగా, వివాహాలు దాని కచ్చితమైన సారాంశంగాబీ సంబరాలు విలువైనవిగా మరియు ఆ క్షణాలను సేకరించుకుని ఉంచుకోవడం అత్యవసరంగా ఉన్నాయి. కెనాన్ ఇండియాలో, వారు తమ ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకాలను జీవితకాలం వారి కాపాడుకునేలా వినియోగదారులను ప్రోత్సహించేందుకు మరియు వాటిని వారికి అందుబాటులో ఉంచేందుకు మేము నిరంతరం ప్రయత్నిస్తూ వస్తున్నామన్నారు. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, క్యాంపెయిన్ ప్రచారం గురించి కెనాన్ కన్స్యూమర్ సిస్టమ్స్ ప్రొడక్ట్స్ అండ్ ఇమేజింగ్ కమ్యూనికేషన్ ప్రొడక్ట్స్ డైరెక్టర్ సి. సుకుమారన్ మరింత వివరిస్తూ, మాట్లాడుతూ, నిభారతదేశంలోని వినియోగదారులకు అన్ని ప్రత్యేక సందర్భాలలో, ముఖ్యంగా వివాహాల సందర్భంలో ఎల్లప్పుడూ ఒక బ్రాండ్‌గా కెనన్ నిలిచినందుకు మేము గర్విస్తున్నామన్నారు. త్వరలో పెండ్లి చేసుకునే జంటలకు వెడ్డింగ్ ఫొటోగ్రఫీ పరికరాలకు సంబంధించిన విషయాలను తెలియజేయాలని భావిస్తున్నామని వివరించారు. దక్షిణాది ప్రాంతం కెనాన్ ఇండియాకు 35 నుంచి 40 శాతం వ్యాపారాన్ని అందిస్తుందన్నారు.