Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ_హైదరాబాద్
రుణాలకు సంబంధించి భారతదేశంలోనే అతి పెద్ద మార్కెట్‌ప్లేస్ అలాగే క్రెడిట్ స్కోర్ ప్లాట్‌ఫామ్ అయిన paisabazaar.com మరియు సరికొత్తగా ఏర్పాటైన యూనివర్సల్ బ్యాంక్ ఎస్ బీఎం బ్యాంక్ ఇండియా నేడు స్టెప్ అప్ క్రెడిట్ కార్డ్‌ను ఆవిష్కరించాయి. క్రెడిట్ స్కోర్ సరిగ్గా లేకపోవడం వల్ల అధికారికంగా రుణాలు అంతగా అందుబాటులో ఉండని వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని, వారి రుణపరపతిని పెంచే విధంగా ఈ కార్డును రూపొందించడం జరిగింది.
ఎస్బీఎం బ్యాంక్ ఇండియా రిటైల్ డ కన్జూమర్ బ్యాంకింగ్ విభాగం హెడ్ నీరజ్ సిన్హా మాట్లాడుతూ తాము నిర్వహించిన పైలట్ ప్రోగ్రామ్ అద్భుతమైన ఫలితాలు ఇచ్చిందని ఈ కార్డును అందరికీ అందుబాటులోకి తెచ్చేలా నేడు దీన్ని ఆవిష్కరిస్తున్నామన్నారు.పూర్తిగా డిజిటల్ మరియు పేపర్‌లెస్ ప్రక్రియతో, తక్షణ జారీ మరియు యాక్టివేషన్ సౌలభ్యంతో వినియోగదారులు పైసాబజార్ ప్లాట్‌ఫామ్‌పై స్టెప్ అప్ క్రెడిట్ కార్డ్ పొందవచ్చన్నారు.భారతదేశంలో అధికారిక రుణాల వినియోగం అత్యంత తక్కువగా ఉండటాన్ని దేశ జీడీపీ, కుటుంబాల రుణ నిష్పత్తిలో ప్రతిఫలిస్తోందన్నారు. తమ నియో-లెండింగ్ వ్యూహం కింద వివిధ వినియోగదారుల వర్గాల నిర్దిష్ట అవసరాలకు అనుగుణమైన వినూత్న ఉత్పత్తులను ఇతర సంస్థల భాగస్వామ్యంతో రూపొందించి, అందుబాటులోకి తేవాలని పైసాబజార్ భావిస్తోందన్నారు.
అధికారిక రుణ సదుపాయం అందుబాటులో లేని వర్గాల అవసరాలను తీర్చడంతో పాటు ఆయా ప్రక్రియలు, ఉత్పత్తులపై యాజమాన్య హక్కులు మాకు ఉండటం వల్ల వినియోగదారులకు మరింత మెరుగ్గా సేవలు అందించేందుకు తమకు వీలవుతుందన్నారు. అలాగే, వినియోగ ధోరణి, ప్రవర్తన వంటి అంశాలకు సంబంధించిన డేటా అందుబాటులో ఉండటం వల్ల వినియోగదారు అవసరాలను మరింత కచ్చితత్వంతో గుర్తించేందుకు, మరిన్ని కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించేందుకు అవసరమైన కీలక సమాచారం, పరిజ్ఞానం లభించగలదుు అని పైసాబజార్.కామ్ సీనియర్ డైరెక్టర్ గౌరవ్ అగర్వాల్ తెలిపారు.