Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : మైక్రో సాఫ్ట్ సీఈఓగా సత్య నాదేళ్ల బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ కంపెనీ షేరు పరు గులు పెడుతోంది. అదే విధంగా కంపెనీ విలువ అమాంతం పెరుగుతోంది. మంగళవారం న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజిలో కంపెనీ షేరు ధర 1.2 శాతం పెరగడంతో మైక్రోసాఫ్ట్ క్యాపిటలైజేషన్ విలువ రెండు ట్రిలియన్ డాలర్ల (దాదాపు రూ.150 లక్షల కోట్లు)కు చేరింది. ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్ వ్యాపారంలో అద్భుతమైన పురోభివద్ధి సాధించడంతో కంపెనీ విలువ ఇటీవల గణనీయంగా పెరిగింది. 2014లో సత్య నాదేళ్ల బాధ్యతలు చేపట్టే నాటికి కంపెనీ విలువ 310 బిలియన్ డాలర్లుగా ఉండగా.. 2019 నాటికి ట్రిలియన్ డాలర్లకు (రూ.75 లక్షల కోట్లు)కు చేర్చారు. ఆ తర్వాత రెండేండ్లలోనే మరో ట్రిలియన్ డాలర్ల సంపదను జోడించారు. గతేడాది 24 శాతం వృద్థిని నమోదు చేసింది.