Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణాలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్, పీపీఈ కిట్స్ విరాళం
- విస్త్రతమైన సహాయ ప్రయత్నాల్లో భాగంగా 1000 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్, మొబైల్ ఆక్సిజన్ ట్రక్స్
- 1.2 మిలియన్ పీపీఈ కిట్స్ అందచేసిన ప్రాట్ &విట్నీ, రేథియాన్ టెక్నాలజీస్ కంపెనీస్
- ఉద్యోగుల విరాళాలకి సరిపోలే విధంగా కొనసాగించబడతాయి.
- 2021 సంవత్సరం అంతా సహాయ-కార్యక్రమాలకు ప్రోత్సాహం
హైదరాబాద్: భారతదేశపు కోవిడ్-19 ప్రతిస్పందన సహాయానికి వేగంగా మద్దతు ఇచ్చే విస్త్రతమైన ప్రయత్నాల్లో భాగంగా -ప్రాట్ &విట్నీ (పీ &డబ్ల్యూ), రేథియాన్ టెక్నాలజీస్ కార్పొరేషన్ యూనిట్(ఎన్ వైఎస్ఈ: ఆర్ టీఎక్స్), మార్పల్లిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు మరియు తెలంగాణా, కొహీర్ లో ప్రభుత్వ సివిల్ ఆసుపత్రికి నేడు ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ మరియు పర్శనల్ ప్రొటక్టివ్ కిట్స్ (పీపీఈ) విరాళంగా ఇచ్చింది.
ఎంతో అవసరమైన ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్, పీపీఈ కిట్స్ ఆసుపత్రి ఆక్సిజన్ సరఫరా లైన్లని పెంపొందిస్తాయి. భవిష్యత్తులో కలిగే అత్యవసరాలు కోసం సన్నాహాలు చేయడంలో సహాయపడతాయి. సామగ్రి తెలంగాణా ప్రభుత్వం మరియు యునైటెడ్ వే ఇండియా భాగస్వామంతో పంపిణీ చేయబడింది.
“ప్రాట్ &విట్నీ భారతదేశం కోవిడ్ -19 సెకండ్ వేవ్ నుండి కోలుకోవడంలో మద్దతు చేయడానికి పలు రకాలుగా కట్టుబడ్డాయని”అస్మిత సేథీ, ప్రెసిడెంట్ &కంట్రీ హెడ్, ప్రాట్ &విట్నీ అన్నారు. “తీవ్రతని తగ్గించే ముఖ్యంగా మా ఉద్యోగులు, వారి కుటుంబాలు ఉన్న చోట ప్రయత్నాల్ని విస్త్రతం చేయడానికి తెలంగాణా ప్రభుత్వంలో భాగస్వామం చెందినందుకు మేము గర్విస్తున్నాం- భారతదేశపు ప్రభుత్వం, ఆరోగ్య సంరక్షణ సంస్థలు, చారిటబుల్ ఏజెన్సీలతో పాటు మా పెద్ద వ్యాక్సిన్ డ్రైవ్, సీఎస్ఆర్ ప్రయత్నాలు వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయబడ్డాయి.”
“ప్రాట్ &విట్నీ అందించిన మద్దతుని తెలంగాణా ప్రభుత్వం ప్రశంశించింది. ప్రభావానికి గురైన వారికి ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్, పీపీఈ కిట్స్ తక్షణ సహాయం అందిస్తాయి మరియు మా ఫ్రంట్ లైన్ ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల భద్రతని నిర్వహించడంలో సహాయపడతాయని”జేయేష్ రంజన్, ప్రధాన కార్యదర్శి, ఇండస్ట్రీస్ మరియు కామర్స్ (ఐ అండ్ సీ) మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) విభాగాలు, తెలంగాణా ప్రభుత్వం అన్నారు.
తెలంగాణాలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు ఇచ్చే విరాళం ప్రాట్ &విట్నీ మరియు భారతదేశంలో ఇతర రేథియాన్ టెక్నాలజీస్ కంపెనీలు వారిచే కోవిడ్ -19 యొక్క విస్త్రతమైన సహాయ ప్రయత్నాలతో అనుసంధానం చెందింది. సహాయంలో మొదటి విడతగా -కంపెనీలు 1000 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్, 1.2 మిలియన్ పీపీఈ కిట్స్ మరియు 270,000 లీటర్ల ఆక్సిజన్ ని రవాణా చేయగలిగే రెట్రోఫిట్ చేయబడిన మొబైల్ ఆక్సిజన్ ట్రక్స్ ని విరాళంగా అందించాయి. ఈ మొబైల్ ఆక్సిజన్ ట్రక్స్ ని ప్రాట్ &విట్నీ మద్దతుతో నడిచే బోయింగ్ సీ-17 గ్లోబ్ మాస్టర్ 3 విమానం ద్వారా దేశానికి తెచ్చారు.
“హైదరాబాద్ లో ఆధునిక శిక్షణా కేంద్రంతో, స్థానిక విశ్వవిద్యాలయాలతో ఏరోస్పేస్ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, హైదరాబాద్ -టీ-హబ్ తో కొనసాగుతున్న నవీన ప్రాజెక్ట్స్ - ప్రాట్ &విట్నీకి తెలంగాణా రాష్ట్రంతో బలమైన, దీర్ఘకాల భాగస్వామం ఉంది. మన స్థానిక కమ్యూనిటీల ఆరోగ్యం, భద్రతని నిర్థారించడంలో మేము పెట్టుబడి పెట్టాము మరియు ఇక్కడ ఉన్న కీలకమైన భాగస్వాములతో సహకరించడాన్ని కొనసాగిస్తాము”అని అమిత్ పాఠక్ , జనరల్ మేనేజర్ , ప్రాట్ &విట్నీ ఇండియా అన్నారు.
కోవిడ్-19 సహాయ ప్రయత్నాలకు మద్దతునిచ్చే పలు స్వచ్ఛంద సంస్థలకు కంపెనీ ఉద్యోగుల విరాళాలు అందిస్తోంది మరియు దాని స్థానిక బృందాలు 2021 సంవత్సరం అంతా భారతదేశంలో సహాయ-కార్యక్రమాల్ని కొనసాగిస్తాయి. వాణిజ్య, మిలిటరీ, వ్యాపారం, హెలికాప్టర్, సాధారణ, ప్రాంతీయ పౌర విమానయానంలో 680కి పైగా విమానాల్లో 1500కి పైగా ఇంజన్లు మరియు ఏపీయూలతో - ప్రాట్ &విట్నీకి భారతదేశంలో ఏరోస్పేస్ ఇంజన్ ఓఈఎంలలో అతి పెద్ద ఇన్ స్టాల్ చేయబడిన బేస్ లు ఉన్నాయి. హైదరాబాద్ లో ఉన్న ప్రాట్ &విట్నీ వారి ఆధునిక శిక్షణా కేంద్రం భారతదేశం మరియు ప్రపంచాలు నుండి ఇంజన్ ని నిర్వహించే ఇంజనీర్లు మరియు టెక్నీషియన్స్ యొక్క దృఢమైన ప్రతిభ కలిగిన వారిని రూపొందిస్తోంది.