Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ గురుగ్రామ్: కరోనా మహమ్మారి ప్రజలు జీవితాలను అస్తవ్యస్తం చేసింది. చాలామంది ఉపాధి కోల్పోయారు. కరోనా నుంచి కోలుకునేందుకు భారతదేశం ఎన్నో చర్యలు చేపట్టింది, ఇంకా చేపడుతోంది. మరోవైపు ఉబర్ కూడా తనవంతు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యాక్సిన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నడుం బిగించింది. అందులో భాగంగా కంపెనీ రూ.18.5 కోట్లతో ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమం ద్వారానే దాదాపు 37,000 మంది డ్రైవర్లు ఒక్క డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న కారు, ఆటో, మోటో డ్రైవర్లు అంతా తమ వ్యాక్సిన్ సర్టిఫికేటలను యాప్‌లో అప్లోడ్ చేసేందుకు చాలా సులభతరమైన విధానాన్ని ప్రవేశపెట్టింది ఉబర్. వారు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ ప్రామాణికతను పరిశీలించేందుకు టెక్నాలజీతో పాటు హ్యూమన్ వెరిఫికేషన్ విధానాన్ని కూడా రూపొందించింది. దీనిద్వారా వ్యాక్సిన్ తీసుకున్న డ్రైవర్లకు రూ.400 ప్రోత్సాహక బహుమతి త్వరితగతిన ఇచ్చేందుకు వీలు కుదురుతుంది.
వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టడంతోనే తమ పని పూర్తయిందని ఉబర్ భావించడం లేదు. గత కొన్ని వారాలుగా వ్యాక్సిన్‌పై ఉన్న అపోహల్ని తొలగించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఇందుకోసం వైద్య నిపుణులతో యాప్ మేసేజెస్, ఎడ్యుకేషన్ వీడియోలు, వర్చువల్ సమావేశాలను నిర్వహించింది. డ్రైవర్ ఎడ్యుకేషన్ మరియు వ్యాక్సిన్ కాంపెన్సేషన్ అనేవి రెండు చాలా ముఖ్యమైవని. ఇవి డ్రైవర్లను ఈ మహమ్మారి నుంచి కాపాడడమే కాకుండా ఈ విపత్తును ఎదుర్కునేందుకు దేశానికి కూడా మద్దతు ఇచ్చినట్లు అవుతుంది. అంతేకాకుండా బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, లక్నో, కాన్పూర్, ఆగ్రా, బరేలీ, గోరఖ్‌పూర్, భోపాల్, భువనేశ్వర్ లలో డ్రైవర్లకు ఉచిత టీకాలు వేయడానికి ఉబర్ రాష్ట్ర ప్రభుత్వాలతో సహకరిస్తోంది. భారతదేశం అంతటా ఇలాంటి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి కంపెనీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోంది.
ఈ సందర్భంగా ఉబర్ ఇండియా సౌత్ ఆసియా అధ్యక్షుడు శ్రీ ప్రభుజీత్ సింగ్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... కోవిడ్‌కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో మాస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం అత్యద్భుతం. దీనివల్ల కోవిడ్ చాలా వరకు కట్టడి అవుతుంది. ఇక మా పరంగా మా సేవకు మేము కట్టుబడి ఉన్నాము. రైడర్స్ మరియు డ్రైవర్లు వీలైనంత త్వరగా రెండు డోసులను పొందడానికి సహాయం చేయాలనుకుంటున్నాము. ఈ సందర్భంగా మాకు డ్రైవర్ల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఇలాంటి పరిస్థితుల్లో వారికి మద్దతు ఇస్తూనే ఉంటాము. ఈ ప్రయత్నాలు ఉబర్ ప్లాట్ఫామ్లో భద్రతను పెంచుతాయి మరియు భారతదేశం మళ్లీ మరింతగా ముందుకు వెళ్లేందుకు సహాయపడతాయి అని అన్నారు ఆయన. కేవలం వ్యాక్సినేషన్ కార్యక్రమంతోనే ఉబర్ తన ప్రయత్నాలను ఆపలేదు. టీకాలు తీసుకున్న డ్రైవర్లకు నగదు ప్రోత్సాహకాలను అందించడానికి రూ. 18.5 కోట్ల ప్యాకేజీ మాత్రమే కాకుండా... మే 28, 2021 న, కోవిడ్ -19 తో బాధపడుతున్న డ్రైవర్ల కోసం ఉబర్ ఒక ఆర్థిక సహాయ కార్యక్రమాన్ని ప్రకటించింది, దీని ద్వారా వారు 14 రోజులు పాక్షిక ఆదాయ మద్దతును పొందగలుగుతారు. ఒకవేళ దురదృష్టవశాత్తు.. కోవిడ్-19తో డ్రైవర్ ఎవరైనా మరణిస్తే.. రూ. 75,000 రూపాయల విలువైన వన్-టైమ్ సపోర్ట్ ప్యాకేజీని అందిస్తుంది. ఈ మొత్తం ఆ డ్రైవర్ యొక్క కుటుంబ సభ్యుల తక్షణ అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది.
ఉబర్ వ్యాక్సినేషన్ కార్యక్రమంతో డ్రైవర్లు అంతా చాలా సంతోషంగా ఉన్నారు. 3 ఏళ్లుగా ఉబర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న గిరిరాజ్ గిరికు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తైంది. వ్యాక్సిన్ పూర్తైన తర్వాత ఆయనకు రూ. 800 కూడా వచ్చాయి. ఈ సందర్బంగా గిరిరాజ్ గిరి మాట్లాడుతూ... “ఈ మహమ్మారి ఆర్థికంగా మరియు మానసికంగా చాలా సవాళ్లు విసిరింది. నేను నా కుటుంబాన్ని పోషించాలంటే సంపాదించడం ఆపకూడదు. అయితే అదే సమయంలో వ్యాక్సిన్ కూడా పూర్తి కావాలి. కాని అది అనుకున్నంత సులువు కాదు. కానీ ఈ సమయంలో ఉబర్ మాకు ఉండగా నిలిచింది. ఉబర్ నాకు ఉచితంగా టీకాలు వేయడమే కాకుండా నగదు బహుమతిని కూడా ఇచ్చింది. నేను ఇప్పుడు మరింత నమ్మకంగా రైడ్లు తీసుకుంటున్నాను మరియు నేను పూర్తిగా టీకాలు తీసుకున్నానని తెలుసుకున్నప్పుడు రైడర్స్ కూడా భరోసాగా ఉంటారు. రైడ్‌కు వస్తారు. తద్వారా పరిస్థితి మెరుగుపడుతుంది, సంపాదించే అవకాశం కూడా పెరుగుతుంది. నేను నా తోటి డ్రైవర్లకు చెప్పేది ఒక్కటే.. వ్యాక్సిన్ ఒక్క డోస్ అయినా తీసుకోండి. అది మీకు, మీ కుటుంబానికి భద్రతను ఇస్తుంది అని అన్నారు ఆయన.
మహమ్మారి మొదలైనప్పటి నుంచి కోవిడ్‌పై పోరాటంలో భారతదేశానికి ఉబర్ మద్దతునిస్తూనే ఉంది. ఈ ఏడాది మార్చిలో, ఉబర్ రూ.10 కోట్ల రూపాయల విలువైన ఉచిత రైడ్లు అందించింది. దీనిద్వారా ప్రజలకు తమ సమీప వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్ తీసుకునేందుకు అవకాశం ఏర్పడింది.