Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) 2021 జనవరి నుంచి మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.6,734 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.3,214 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఆర్థిక సంవత్సరం 2020-21లో 16 శాతం తగ్గుదలతో మొత్తంగా రూ.11,246 కోట్ల లాభాలు ప్రకటించింది. ఇంతక్రితం 2019-20లో రూ.13,464 కోట్ల నికర లాభాలు ఆర్జించింది. ఇదే సమయంలో రూ.96,214 కోట్ల రెవెన్యూ నమోదు చేయగా.. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 29 శాతం తగ్గుదలతో రూ.68,141 కోట్ల రెవెన్యూతో సరిపెట్టుకున్నది.