Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చీటింగ్ కేసులో ఈడీ అటాచ్
న్యూఢిల్లీ : రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహించే ఆదర్ష్ గ్రూపు ఆఫ్ కంపెనీస్‌కు చెందిన రూ.366 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈడీ చీటింగ్ కేసు నమోదు చేసింది. రాజస్థాన్, హర్యానా, న్యూఢిల్లీ ప్రాంతాల్లోని ఈ కంపెనీకి చెందిన వ్యవసాయ భూములు, నివాస, వాణిజ్య స్థలాల, ఫిక్సుడ్ డిపాజిట్లు, సేవింగ్ బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసింది. ఈ కేసులో ఆదర్ష్ గ్రూప్ ప్రమోటర్లు ముకేశ్ మోడీ, రాహుల్ మోడీలపై ఈడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ముకేశ్ మోడీ తన బంధువులైన వీరేంద్ర మోడీ, రాహుల్ మోడీ, రోహిత్ మోడీ వారి సంబంధింకులకు అక్రమంగా నిధులు మళ్లించారు. వీరి పేరుపై పలు డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారు. ఇంతక్రితం ఆరు రాష్ట్రాల్లోని రూ.1,489.03 కోట్ల స్థిర, చర ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ముకేశ్ మోడీ, ఇతరుల చర్యల వల్ల దాదాపు 20 లక్షల మంది ఆదాయాలు కోల్పోయారని ఈడీ వెల్లడించింది.