Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొత్త ఆపరేటింగ్ సిస్టం విండోస్ 11 వర్షన్‌ను ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ యాప్‌లు కూడా ఆపరేట్ అయ్యేలా దీన్ని రూపొందించింది. విండోస్ 10తో పోలిస్తే విండోస్ 11 లుక్ సరికొత్తగా ఉంటుందని ఆ కంపెనీ వెల్లడించింది. విండోస్ 10 నుంచి విండోస్ 11కి ఉచితంగానే అప్‌గ్రేడ్ కావొచ్చని స్పష్టం చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా స్మార్ట్ ఫోన్లు, ఇతర స్మార్ట్ పరికరాలు ప్రజాదరణ పొందడంతో ఆపిల్, గూగుల్ నుంచి గట్టి పోటీని మైక్రోసాఫ్ట్ ఎదుర్కొంటోందని సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. కొత్త విండోస్ చరిత్రలో ఒక మైలురాయిని సూచిస్తుందన్నారు. ఇది కొత్త తరం ఆరంభమని వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు విండోస్ 10 ఓఎస్‌ను 2015లో మైక్రోసాఫ్ట్ విడుదల చేసింది. మళ్లీ ఆరేండ్ల తర్వాత కొత్త ఆపరేటింగ్ సిస్టంను ఆవిష్కరించింది. నూతన ఓఎస్ స్నాప్ లే అవుట్, స్నాప్ గ్రూప్ సహా మల్టీ టాస్కింగ్‌కు ఇందులో వీలు కల్పించినట్టు పేర్కొంది. ఇది ఆండ్రాయిడ్ యాప్స్‌కు కూడా మద్దతు ఇస్తుందని ఆ సంస్థ తెలిపింది.