Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ లోని సలోరీ మురుగునీటి శుద్ధి కర్మాగారానికి జపాన్ కన్ స్ట్రక్షన్ అంతర్జాతీయ అవార్డు లభించినట్లు తోషీబా వాటర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టిడబ్ల్యుఎస్) పేర్కొంది. జపాన్ భూమి, మౌలిక సదుపాయాల కల్పన, రవాణా మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ (ఎమ్ఎల్ఐటి) ఈ అవార్డును ప్రకటించినట్లు టిడబ్ల్యుఎస్ తెలిపింది. తోషీబా ఇన్ ఫ్రాస్టక్చర్ సిస్టమ్స్ మరియు సొల్యూషన్స్ కార్పొరేషన్ (టిఐఎస్ఎస్) అధీనంలో, పూర్తిస్థాయి అనుబంధ సంస్థగా టిడబ్ల్యుఎస్ పనిచేస్తోంది. సలోరీ ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణం, అమలు, నిర్వహణ మరియు ప్రాజెక్టు బదలాయింపువంటి బాధ్యతలను టిడబ్య్లుఎస్ చేపట్టింది. ఇండియాలోని ఉత్తరప్రదేశ్ లో సలోరీ మురుగునీటి శుద్ధి కర్మాగారం రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ, అమలు, ప్రాజెక్టు బదలాయింపుతోపాటు సంబంధిత సౌకర్యాల కల్పనలో టిడబ్ల్యుఎస్ సాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది.
ఎమ్ఎల్ఐటి జపాన్ కన్ స్ట్రక్షన్ అంతర్జాతీయ అవార్డును 2017లో నెలకొల్పింది. ఈ అవార్డు ద్వారా, జపాన్ కంపెనీల పోటీతత్వంపై అంతర్జాతీయంగా అవగాహనను పెంపొందించడం, జపాన్ కంపెనీలకు మరిన్ని ప్రాజెక్టులు లభించేలా చేయడం ఎమ్ఎల్ఐటి లక్ష్యం. నినాణ్యతతో కూడిన మౌలిక సదుపాయాల కల్పనుకు జపాన్ కన్ స్ట్రక్షన్ అంతర్జాతీయ అవార్డు ఒక చిహ్నంగా మారింది. (1) విదేశాల్లో జపాన్ ఘనతను చాటి చెప్పే నిర్మాణ కంపెనీలకు మరియు (2) విదేశాల్లో చురుకుగా వ్యవహరిస్తూ, కీలక పాత్ర పోషించే చిన్న మరియు మధ్య తరహా నిర్మాణ కంపెనీలకు ఈ అవార్డు వెన్నుదన్నుగా నిలుస్తోంది. తోషిబా గ్రూపునకు ఈ అవార్డు లభించడం ఇది మొదటిసారి.
గంగానదీ జలాల శుద్ధి కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు కోసం, ఉత్తరప్రదేశ్ జల్ నిగమ్ (యుపిజెఎన్)తో టిడబ్ల్యుఎస్ 2014లో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఉత్తరప్రదేశ్ లోని సలోరీలో ప్రధాన పంప్ స్టేషన్ తో సహా ఒక మురుగు నీటి శుద్ధి కర్మాగారానికి రూపకల్పన చేసి, నిర్మించి, 10 సంవత్సరాల పాటు కర్మాగారం అమలు మరియు నిర్వహణ బాధ్యతలు చేపట్టడం ఈ ప్రాజెక్టులో భాగం.
మురుగు నీటి వ్యవస్థ అభివృద్ధికోసం అనేక చర్యలు చేపట్టడం ద్వారా, గంగానదీ జలాల శుద్ధితోపాటు ప్రభుత్వ ప్రాజెక్టులలో నిరంతరం పాలు పంచుకునేందుకు పునాది వేయడం ద్వారా టిడబ్ల్యుఎస్ ప్రజల మన్ననలు చూరగొంది.
ఈ ప్రాజెక్టుకోసం, టిడబ్ల్యుఎస్ సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ (ఎస్ బిఆర్) అనే క్రియాశీలకమైన మురుగు నీటి శుద్ధి ప్రక్రియ(లి1)ను చేపట్టింది. ప్రాజెక్టుకు అవసరమైన భూమి, నిర్మాణ కాల వ్యవధి, నిర్వహణా ఖర్చులు తగ్గేందుకు ఈ ప్రక్రియ దోహదపడటమే కాకుండా భారత ప్రభుత్వం ఆశించిన మురుగు నీటి శుద్ధి నాణ్యతా ప్రమాణాలను అందుకునేందుకు కూడా ఈ ప్రక్రియ తోడ్పడుతుంది. ఈ కర్మాగారం రూపకల్పన మరియు నిర్మాణం కోసం, అందుబాటులో ఉండే సులభతరమైన, తేలికగా నిర్వహణ చేపట్టగలిగిన పరికరాలను వినియోగించడం ద్వారా జీవిత కాల నిర్వహణా వ్యయాన్ని తగ్గించవచ్చని టిడబ్ల్యుఎస్ స్పష్టం చేసింది.
దీంతోపాటు, టిఐఎస్ఎస్ మరియు టిడబ్ల్యుఎస్ క్రియాశీల దృక్పథంతో స్థానిక ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చాయి. భారత ఇంజనీర్లు, జపాన్ ఇంజనీర్లు చేయీ చేయీ కలిపి ఈ ప్రక్రియలోనూ మరియు వ్యయ నిర్వహణలోనూ పాలుపంచుకుని, సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేశారు. 2016లో ఈ కర్మాగారం ప్రారంభమైనప్పటినుంచీ, చక్కగా నడుస్తోంది.
ఈ అవార్డు ద్వారా లభించిన ప్రోత్సాహంతో, ఇండియాలోనూ, ఇతర దేశాల్లోనూ నీటి శుద్ధీకరణ వ్యాపారాన్ని విస్తరించి, మరిన్ని నీటి రీసైక్లింగ్ వ్యవస్థలను నెలకొల్పేందుకు, తద్వారా పర్యావరణహిత సమాజాలను ఏర్పాటు చేసేందుకు తొషీబా కృషి చేస్తుంది.