Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఇన్‌స్టామోజో అందించే విస్తృతస్థాయ విలువ ఆధారిత సేవల ద్వారా భారతీయ ఎంఎస్ఎంఈలు తమ వ్యాపారాలను డిజిటలీకరించడంతో పాటుగా వ్యాప్తి చేసుకునేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుంది. మాస్టర్ కార్డ్ నేడు ఎంఎస్ఎంఈల కోసం భారతదేశపు పూర్తి స్థాయి డిజిటల్ పరిష్కారాల ప్రదాత, ఇన్‌స్టామోజో లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించింది. ఈ పెట్టుబడులను లక్షలాది మంది ఎంఎస్ఎంఈలు మరియు గిగ్ వర్కర్లకు అత్యంత సులభంగా వినియోగించతగిన పెట్టుబడులను అందించేందుకు లక్ష్యంగా చేసుకోవడంతో పాటుగా ఆన్లైన్ స్టోర్లను ఏర్పాటుచేయడం ద్వారా వేగవంతంగా డిజిటలైజ్ చేసుకునేందుకు సైతం సహాయపడనుంది. అంతేకాకుండా డిజిటల్ చెల్లింపుల అంగీకార సామర్థ్యం అందిస్తూనే, మహమ్మారి సమయంలో సైతం వినియోగదారులను చేరుకునేందుకు తోడ్పడుతుంది.
చిన్న,సూక్ష్మ వ్యాపారులకు రెడీ మేడ్ వర్ట్యువల్ ప్లాట్‌ఫామ్‌ను ఇన్‌స్టామోజో అందిస్తుంది. వీటిద్వారా వారు వేగవంతంగా ఈ–కామర్స్ వ్యాపారాలను ఏర్పాటుచేయడంతో పాటుగా డిజిటల్ చెల్లింపులను వేగవంతమైన, అతి సులభంగా ప్రవేశించతగిన ప్రక్రియ ద్వారా ద్వారా అంగీకరించవచ్చు. ఇన్‌స్టామోజో యొక్క వేదిక ఉపయోగించి, వ్యాపారులు పూర్తిగా పనిచేసేటటువంటి ఆన్లైన్ స్టోర్‌ను అంతర్గతంగా నిర్మించిన చెల్లింపులు, రవాణా సామర్థ్యాలు, మార్కెటింగ్ ఉపకరణాలు మరియు ఇతర విలువ ఆధారిత సేవలు అయినటువంటి లాజిస్టిక్స్, క్రెడిట్ సదుపాయాలతో సహా పొందవచ్చు. ఈ పెట్టుబడులు భాగస్వామ్యం ఎలక్ట్రిషియన్లు, వ్యక్తిగత శిక్షకులు, ట్యూటర్లు, చిన్న ఎఫ్ అండ్ బీ ఆపరేటర్లు ఇతరుల కోసం ఈ రెండు కంపెనీలూ ఆరంభించిన కార్యక్రమాలను బలోపేతం చేయడంతో పాటుగా వృద్ధిని కొనసాగించేందుకు, తమ వ్యాపారాలను నిర్వహించేందుకు మద్దతునందిస్తుంది.
సంపద్ స్వైన్, సీఈవో అండ్ కో–ఫౌండర్, ఇన్‌స్టామోజో మాట్లాడుతూ ‘‘ ఆరంభమైన నాటి నుంచి, ఇన్‌స్టామోజో స్థిరంగా ఎంఎస్ఎంఈ రంగంపై దృష్టి సారిస్తుంది. మేము మా ప్రయత్నాలను చిరు వ్యాపారులను ఆన్లైన్లో తీసుకువచ్చేందుకు చేస్తూనే ఉన్నాం. చిరు వ్యాపారాల కోసం చెల్లింపు పరిష్కారాలుగా మేము కార్యకలాపాలను ప్రారంభించినప్పటికీ, అప్పటి నుంచి మా వీక్షణను విస్తరిస్తూనే ఉన్నాం. ఇప్పుడు చిరు వ్యాపార సంస్థలు ఆన్లైన్లో తమ వ్యాపారాలను ఆరంభించడం, నిర్వహించడం మరియు వృద్ధి చెందేలా సహాయపడే వేదికను అందించడం ద్వారా భారీగా విస్తరించడంపై దృష్టి కేంద్రీకరించాం. ఇది ఇక ఎంత మాత్రమూ కేవలం చెల్లింపుల సేకరణ వేదికగా మాత్రమే ఉండటానికి పరిమితం కాదు, తమ సొంత ఆన్లైన్ స్టోర్‌ను ఆరంభించేందుకు సైతం తోడ్పడుతూనే, చెల్లింపుల సేకరణ మరియు తమ ఉత్పత్తులను రవాణా చేసేందుకు సైతం తోడ్పడుతుంది. అందువల్ల, చిరు వ్యాపారసంస్థలు అతి సులభంగా తమ వ్యాపారాలను నిర్వహించుకునేందుకు అనువైన పర్యావరణ వ్యవస్థను సైతం సృష్టించనుంది. మాస్టర్‌కార్డు లాంటి సంస్థలు మాపై విశ్వాసం చూపడం, మేము మరింతగా మా పరిధిని విస్తరించుకోవడంలో సహాయపడుతుంది’’ అని అన్నారు.
రాజీవ్ కుమార్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మార్కెట్ డెవలప్మెంట్, దక్షిణాసియా –మాస్టర్ కార్డ్ మాట్లాడుతూ ‘‘మన భారతీయ ఆర్థిక వ్యవస్థలో ఎంఎస్ఎంఈలు, గిగ్ వర్కర్లు అత్యంత కీలకమైన భాగం. కంపెనీ యొక్క వ్యూహాత్మక పెట్టుబడులు మరియు భాగస్వామ్యాల ద్వారా వారికి తగిన మద్దతుందించేందుకు మాస్టర్ కార్డ్ కట్టుబడి ఉంది మరియు డిజిటల్ ఈ–కామర్స్ శక్తి, సామర్థ్యం తెరువడంలోనూ తోడ్పడనుంది. ఇన్‌స్టామోజోలో మాస్టర్ కార్డ్ యొక్క భాగస్వామ్యాల, పెట్టుబడులు ఈ దిశగా ఓ ముందడుగు, లక్షలాది చిరు వ్యాపారాలు తమ డిజిటల్ ఉనికికి బలోపేతం చేసుకోవడంతో పాటుగా చెల్లింపుల అంగీకార సామర్థ్యం సైతం బలోపేతం చేసుకోవడం ద్వారా వృద్ధి చెందేందుకు సైతం తోడ్పడనున్నాం’’ అని అన్నారు. గత సంవత్సరం చిరు వ్యాపారాలకు మద్దతునందించేందుకు 250 కోట్ల రూపాయలను అందించడానికి మాస్టర్ కార్టు కట్టుబడింది. దీనిలో భాగంగా కంపెనీ పలు కార్యక్రమాలైనటువంటి డిజిటల్ చెల్లింపుల అవగాహన వృద్ధి చేయడం, అతి తక్కువ ఖర్చు కలిగిన డిజిటల్ మరియు భౌతిక అంగీకార పరిష్కారాలను అందించడం, ఋణావకాశాలను అందించడం ద్వారా చిరు వ్యాపారులు, కిరాణా స్టోర్లు సైతం సమ్మిళిత వృద్ధిలో భాగమయ్యేలా తోడ్పాటునందిస్తూనే, మహిళా వ్యాపారవేత్తలకు తమ వ్యాపార చతురతను సైతం వృద్ధి చేస్తుంది.
మాస్టర్ కార్డ్ తమ ప్రతిష్టాత్మక కార్యక్రమం , టీమ్ క్యాష్‌లెస్ ఇండియాను సైతం ప్రారంభించడం ద్వారా డిజిటల్ చెల్లింపులను అంగీకరించడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు ప్రాక్టికాలిటీల పట్ల చిరు వ్యాపారులకు అవగాహన కల్పిస్తూనే, వాటి పట్ల వారికి తగిన నైపుణ్యమూ అందిస్తుంది. ఎంఎస్ఎంఈల కోసం ఆరంభించిన ఈ పరిష్కారాలలో సాఫ్ట్ పీఓఎస్, కార్డు పై క్యుఆర్ వంటివి వారి డిజిటైజేషన్‌ను వేగవంతం చేశాయి. ఇన్‌స్టామోజోలో వారి పెట్టుబడులు, భాగస్వామ్యాలు ఆర్ధిక సమ్మిళిత పరంగా మాస్టర్ కార్డ్ యొక్క అంతర్జాతీయ నిబద్ధతకు విస్తరణగా ఉంటుంది. ఇది 2025 నాటికి డిజిటల్ ఆర్థిక వ్యవస్ధపైకి నూరు కోట్ల మంది ప్రజలు, 5కోట్ల మంది సూక్ష్మ, చిరు వ్యాపారాలను తీసుకువస్తామని ప్రతిజ్ఞ చేసింది. ఉద్యం రిజిస్ట్రేషన్ లేదా ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ అనేది ప్రభుత్వ రిజిస్ట్రేషన్. వినూత్నమైన నెంబర్‌ను ఇది అందించడంతో పాటుగా గుర్తింపు ధృవీకరణను సైతంఅందిస్తుంది. అన్ని చిన్న మధ్యతరహా వ్యాపార సంస్థలు తమంతట తాముగా https://udyamregistration.gov.in/ వద్దనమోదుచేసుకోవచ్చు.