Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)ల కోసం దేశంలో పూర్తి స్థాయి డిజిటల్ పరిష్కారాలను అందించే ఇన్‌స్టా మోజోలో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టినట్లు మాస్టర్‌కార్డ్ వెల్లడించింది. ఈ నిధుల ద్వారా వేగవంతంగా ఈ-కామర్స్ వ్యాపారాలను ఏర్పాటు చేయడంతో పాటుగా డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేసుకోవడానికి ఉపయోగపడనున్నాయని ఇన్‌స్టామోజో పేర్కొంది. కాగా.. మాస్టర్ కార్డ్ ఎంత మొత్తం పెట్టుబడులు పెట్టింది వెల్లడించలేదు.