Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: ఒప్పందాన్ని కుదర్చుకునేందుకు షార్క్స్ మీ పట్టణానికి వస్తున్నాయి. మీకు కావలసిందల్లా చక్కని బిజినెస్ పిచ్! సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా తన సోనీ ఎంటర్టెయిన్మెంట్ టెలివిజన్‌లో ప్రసారం కానున్న, ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన బిజినెస్ రియాలిటీ ఫార్మాట్ - షార్క్ ట్యాంక్ భారతీయ పోకడలకు అనుగుణంగా ప్రసారం చేసే హక్కులను సొంతం చేసుకుంది. ఈ ఫార్మాట్ 2001లో ప్రారంభించినప్పటి నుంచి 40కు పైచిలుకు దేశాల్లో బిజినెస్‌లను సరికొత్త జీవితాన్ని ఇచ్చింది. ఇప్పటికే 180కు పైగా సీజన్లతో; ప్రపంచవ్యాప్తంగా 30 అవార్డులను గెలుచుకున్న షార్క్ ట్యాంక్ ప్రపంచంలోనే నంబర్.1 బిజినెస్ రియాలిటీ షో. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మరియు ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ అయిన షార్క్ ట్యాంక్ ఇండియాను స్టూడియోనెక్స్ట్ప్రొడ్యూస్ చేస్తుంది. షార్క్ ట్యాంక్ ఇండియా మొదటి సీజన్ సోనీలైవ్‌లో మాత్రమే యాక్టివ్‌గా ఉంటుంది మరియు ఆన్లైన్లో పేర్లు నమోదుకు అవకాశం ఉంటుంది.
కొత్త ఆలోచనలు, ఉత్సాహంతో విస్తృతం అవుతున్న భారతీయ పారిశ్రామికవేత్తలు చురుకైన పెట్టుబడులను ఆకర్షించడంలో గొప్ప సామర్థ్యాన్ని చూపిస్తున్నారు. మరిన్ని ఎక్కువ భారతీయ కంపెనీలు యునికార్న్ హోదాను సాధించడంతో, దేశంలో కొత్త-తరపు అభివృద్ధి చెందుతున్న వ్యాపారాలు వెలుగులోకి వస్తున్నాయి. అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులు, వ్యాపార నిపుణులతో సరికొత్త వ్యాపార ఆలోచనలు, వ్యాపార నమూనాలు లేదా క్రియాశీలక వ్యాపారాలకు వాస్తవ రూపాన్ని ఇచ్చే ‘షార్క్ ట్యాంక్’ వంటి ప్రత్యేకమైన భావనలకు భారతదేశం అనుకూలమైన మార్కెట్ అని చెప్పవచ్చు. షార్క్ ట్యాంక్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారా? మీ వ్యాపార ఆలోచన, వ్యాపార నమూనా లేదా క్రియాశీలకమైన వ్యాపారాన్ని విజయవంతమైన రియాలిటీగా మార్చడంలో మీ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సరళమైన, నాలుగు-దశల విధానాన్ని అనుసరించండి!
ఆన్లైన్ దరఖాస్తు
సోనీలైవ్ యాప్‌ను డౌన్లోడ్ చేయండి లేదా అప్‌గ్రేడ్ చేయండి. యాప్‌లో పేర్కొన్న సూచనలను అనుసరించి షార్క్ ట్యాంక్ ఇండియా రిజిస్ట్రేషన్ ఫారాన్ని భర్తీ చేయండి మరియు నిబంధనలు, షరతులను అంగీకరించండి. మీ వ్యాపార ఆలోచనను అందులో పేర్కొనండి. మీరు మీ ఆలోచనతో షార్క్ ట్యాంక్ బృందాన్ని ఆకట్టుకుంటే, మీరు తదుపరి దశకు వెళతారు.
పిచ్
ఈ దశలో, షార్క్ ట్యాంక్ బృందం దరఖాస్తుదారులను, వారి వ్యాపార ఆలోచనల గురించి బాగా తెలుసుకుంటారు. దరఖాస్తుదారులు తమ వ్యాపార ఆలోచనను ఎంతటి అసాధారణమైనదో మరియు పెట్టుబడి పెట్టడం ఎందుకు విలువైనదో ఆ బృందానికి చెప్పాలి! దీన్ని తప్పనిసరిగా వీడియో పిచ్ (3 నిముషాల నిడివి) రూపంలో చేయవలసి ఉంటుంది. ఇది షార్క్ ట్యాంక్ ఇండియాపై కట్ చేయడం అంత విలువైనదా కాదా అని నిర్ణయిస్తుంది.
ఆడిషన్
ఎంపికైన దరఖాస్తుదారులు షార్క్ ట్యాంక్ బృందంతో ఒక రౌండ్ ఆడిషన్స్‌కు వెళతారు. ఇది షార్క్ ట్యాంక్ ఇండియా మొట్టమొదటి సీజన్లో అడుగు పెట్టేందుకు చివరి స్టెప్‌గా ఉంటుంది.
షార్క్ ట్యాంక్
పట్టుదలకు ఇది అంతిమ పరీక్ష. ఈ దశకు ఎంపికైన దరఖాస్తుదారులు లేదా ‘పిచ్చర్స్’ తమను ‘షార్క్స్’ లేదా పెట్టుబడిదారులతో ముఖాముఖి అయ్యేందుకు అవకాశం దక్కించుకుంటారు. వారు దరఖాస్తుదారుడి చివరి ‘పిచ్’ ఆధారంగా ఆఫర్‌ను అర్థం చేసుకుంటారు, అంచనా వేస్తారు, ఆమోదిస్తారు.
ఇది 2001లో మొట్టమొదటిసారిగా, నిప్పన్ టివి చేత సృష్టించబడిన టైగర్స్ ఆఫ్ మనీ ఇన్ జపాన్‌గా, అనంతరం 2005లో యూకేలో డ్రాగన్స్ డెన్‌గా మార్చబడింది మరియు ఈ షో 2009లో షార్క్ ట్యాంక్‌గా యుఎస్ లో ప్రదర్శించబడింది.