Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: మింత్రా తన ప్రధాన ఈవెంట్ ఎండ్ ఆఫ్ రీజన్ సేల్ (EORS) 14వ ఎడిషన్‌ను ను జూలై 3 నుంచి 8వరకు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. మెగా ఫ్యాషన్ కార్నివాల్లో అతిపెద్ద ఎడిషన్‌గా నిర్వహిస్తున్న ఇది 3000+ బ్రాండ్ల నుంచి 9 లక్షలకు పైచిలుకు స్టైల్స్ 50 మిలియన్ల మంది సందర్శకుల ఫ్యాషన్ మరియు జీవనశైలి అవసరాలను తీర్చుతుందని అంచనా. ఆరు రోజులు కొనసాగే ఈ కార్యక్రమం ప్లాట్ఫారానికి నిరుడు జూన్‌లో నిర్వహించిన ఎడిషన్ ట్రాఫిక్‌తో పోల్చితే పోలిస్తే ఈ ఏడాది 75%వృద్ధి ఉంటుందని, నిరుటి BAU కన్నా 3X కంటే ఎక్కువ డిమాండ్ ఉంటుందని అంచనా.
గత కొన్ని నెలల్లో, మింత్రా మొదటిసారిగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వినియోగదారులతో గణనీయమైన వృద్ధిని నమోదు చేసుకోగా, ఇది దృఢమైన షాపింగ్ పోకడకు అద్దంపడుతోంది. ఈ పోకడ మెగా ఈవెంట్‌కు ప్రోత్సాహకరమైన, సానుకూలమైన లక్షణాలను చూపిస్తుండగా, దీని దృష్టి అన్ని భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరిస్తూ వినియోగదారులకు ‘నెవర్ బిఫోర్ ఆఫర్స్’ అందుబాటులోకి తీసుకు వస్తోంది. చిన్న మధ్యతరహా సంస్థలకు (SME)లకు ప్రేరణనిస్తూ, జూన్ 2020 ఎడిషన్‌లో 1,800 బ్రాండ్ల నుండి 20,000 స్టైల్స్‌ను అందించిన మెంత్రా ‘మేడ్ ఇన్ ఇండియా’ చేనేత ఎంపిక కొనుగోళ్లను వృద్ధి చేసింది.
మింత్రా తన వినూత్న, ఆకర్షణీయమైన కస్టమర్ ఎంగేజ్మెంట్ కార్యక్రమాలు, ద్వివార్షిక ఫ్యాషన్ ఈవెంట్‌కు ముందు, ‘ప్రైస్ రివీల్’ మరియు ‘ఎర్లీ యాక్సెస్’ వంటివి పలు సంవత్సరాలుగా షాపర్ల అనుభవాన్ని బాగా వృద్ధి చేయగా, తాజా ఎడిషన్‌లోనూ ఇది ఒక భాగం కానుంది. మింత్రా ఇన్సైడర్ల అగ్ర శ్రేణులు (ఎంచుకోండి, ఎలైట్ &ఐకాన్), లేదా మింత్రా లాయల్టీ ప్రోగ్రామ్ సభ్యులు, EORS ప్రారంభం అయ్యేందుకు ఒక రోజు ముందు ఉచిత ప్రారంభ యాక్సెస్‌ను కలిగి ఉంటారు. ఇన్సైడర్ల కోసం ఇతర ప్రయోజనాల్లో ఉచిత షిప్పింగ్, 90 ప్రముఖ బ్రాండ్ల నుంచి ప్రత్యేకమైన అదనపు ఆఫర్లు, రిడీమ్ చేసుకోదగిన వోచర్ పాయింట్లు అందుబాటులో ఉంటాయి. జూలై 2రాత్రి 7నుంచి 11 గంటల మధ్య, EORS ప్రారంభానికి ఒక రోజు ముందు గోల్డ్ పాస్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ నాలుగు గంటల షాపింగ్ విండోకు కోర్కెల జాబితాను కార్ట్‌కు ఉత్పత్తులను జోడించడం ద్వారా లేదా ప్లే &ఎర్న్ ద్వారా పొందవచ్చు. మ్యాచింగ్ లోగోలు, చిత్రాలు మరియు క్విజ్ వంటి ఆటల ద్వారా స్లాట్‌ను బుక్ చేసుకునేందుకు మరియు కూపన్లను సంపాదించుకునేందుకు వినియోగదారులను అనుమతించే ఆన్-యాప్ ఎంగేజ్మెంట్ కార్యకలాపాలు జూన్ 23 న లైవ్‌లో అందుబాటులోకి వస్తాయి.
ప్రత్యేక ఆఫర్లు:
* ప్రీ-బజ్ సమయంలో (23 జూన్ -1 జూలై) 4కన్నా ఎక్కువ వస్తువులను కొనుగోలు చేయాలని కోరుకుంటున్న వినియోగదారులను, ఎంగేజ్మెంట్ డ్రైవ్ సమయంలో EORSలోషాపింగ్ చేయమని వారిని ప్రోత్సహించి మింత్రా సంతృప్తిపరుస్తుంది.
* EORS సమయంలో మధ్యాహ్నం 2-3 గంటల మధ్య ఎర్లీ బర్డ్ షాపర్లకు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ఉత్తేజకరమైన ఆఫర్లు ఉంటాయి.
* మొదటిసారి షాపింగ్ చేసే వారికి మొదటి లావాదేవీకి రూ.500 తగ్గింపు ఉంటుంది మరియు వారికి మొదటి నెల ఉచిత డెలివరీని మింత్రా అందిస్తుంది.
* మింత్రా ప్రత్యేకమైన షౌట్ &ఎర్న్ ఫీచర్లో భాగంగా వినియోగదారులు తమ స్నేహితులను EORSకు ఆహ్వానించి, వారు EORS పేజీని సందర్శించేలా చేస్తే రూ.150 లభిస్తుంది. వినియోగదారులు HDFC డెబిట్ + క్రెడిట్ కార్డులపై 10%తగ్గింపు మరియు EMI ఎంపిక చేసుకునే వినియోగదారులకు అదనంగా 2%తగ్గింపు ఆఫర్ ఉంటుంది.
షాపర్లు తమ అభిరుచికి అనుగుణంగా ఫ్యాషన్ దుస్తులు, ఉపకరణాలు, సౌందర్య ఉత్పత్తులు, గృహాలంకరణ తదితరాలను దేశీయ మరియు అంతర్జాతీయ బ్రాండ్ల నుండి 50%, 80% మధ్య విలువైన ఆఫర్లతో ఎంచుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్లాట్ఫారంలో అత్యంత ట్రెండింగ్ వర్గాలలో ఒకటైన లాంజ్‌వేర్ మరియు లోదుస్తులు 180+ బ్రాండ్ల నుంచి 20,000స్టైళ్లలో వివిధ ఆఫర్లలో అందుబాటులోకి వస్తుండగా, పిల్లల తల్లిదండ్రులు 500 పిల్లల దుస్తుల బ్రాండ్ల నుంచి 90,000 స్టైల్ ఎంపికల కోసం వేచి చూడవచ్చు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ మరియు వెస్ట్రన్‌వేర్ విభాగంలో 2500+ బ్రాండ్లు మరియు బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ విభాగాలలో దాదాపు 500 బ్రాండ్లు అందుబాటులో ఉంటాయి. మింత్రా ఫ్యాషన్ బ్రాండ్స్ దుస్తులు, సౌందర్య సాధనాలు, ఉపకరణాలు మరియు పాదరక్షల విభాగంలో 75,000+ స్టైల్స్‌ను హోస్ట్ చేస్తుంది.
ఈ EORS సమయంలో ఎథినిక్ వేర్,పిల్లల దుస్తులు, అందం & వ్యక్తిగత సంరక్షణ, క్యాజువల్ వేర్ విభాగాల్లో మొత్తం డిమాండ్‌లో 50% ఉంటాయని మింత్రా అంచనా వేస్తుండగా, ఇతర ముఖ్యమైన కేటగిరీల్లో పాశ్చాత్య దుస్తులు, పాదరక్షలు, క్రీడలు, ఉపకరణాలు ఉండనున్నాయి. మింత్రా తన హోమ్ అండ్ లివింగ్ ఉత్పత్తుల క్యూరేటెడ్ ఎంపికకు పెరుగుతున్న ప్రజాదరణను పరిష్కరించేందుకు జూన్ 2020 ఎడిషన్‌తో పోల్చితే ఈ కేటగిరీ 2.5X ఈ EORS సమయంలో వృద్ధి చెందుతుందని అంచనా వేసింది.
ఈ ఏడాది EORS గురించి మింత్రా సిఇఒ అమర్ నగరం మాట్లాడుతూ, “బ్రాండ్లు, పంపణీదారులు, చేతి వృత్తులవారు, చిన్న, మధ్యతరహా సంస్థలు (SME) మరియు డెలివరీ భాగస్వాములతో కలిసి ఫ్యాషన్ పర్యావరణ వ్యవస్థ సానుకూల వ్యాపార వేగం కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ EORS ఎడిషన్ ఇక్కడ నెలకొల్పవలసిన విశ్వాసం మరియు వృద్ధికి ఉత్ప్రేరకంగా పని చేస్తుందని, దీని ఆధారంగానే పరిశ్రమ వృద్ధి చెందుతుందని మేము భావిస్తున్నాము. చిన్న, మధ్య తరహా మరియు పెద్ద బ్రాండ్ల డిమాండ్‌ను పునరుద్ధరించడం ద్వారా, కిరాణా (MENSA) నెట్‌వర్క్‌తో పాటు డెలివరీ భాగస్వాములకు ఆదాయ అవకాశాన్ని పెంచడం ద్వారా, వినియోగదారులకు షాపింగ్ ఆనందాన్ని అందిస్తూ, ఈ కార్యక్రమం ఆశా కిరణంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. మేము ఛారిటీ ఎట్ చెక్అవుట్ ఫీచర్‌ను కూడా పరిచయం చేస్తూ,మా EORS షాపర్లు అందరూ సమాజంలోని ప్రస్తుత ఆరోగ్య అవసరాలకు కొంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చేందుకు వీలు కల్పిస్తున్నామని” ఆయన వివరించారు.
చివరి మైలు డెలివరీ అవసరాలను తీర్చడానికి, మింత్రా MENSAనెట్‌వర్క్‌ను 4Xపెంచుకోవడం ద్వారా వృద్ధి చేసింది మరియు 17,700 కిరానా (MENSA) భాగస్వాములతో కలిసి పని చేస్తుండగా, .వీరు మొత్తం 600 నగరాలలో 80% డెలివరీలను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. వీరి ద్వారా 15 మిలియన్లకు పైగా వస్తువులను రవాణా చేయాలని కంపెనీ భావిస్తుండగా, వీటిలో 40%టయర్ 2నగరాలకు మరియు ఆపై స్థాయి ఉన్న నగరాలకు పంపిణీ చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం స్థాయికి అనుగుణంగా నిర్వహించేందుకు సంస్థ తన సాంకేతిక సామర్థ్యాలను కూడా వృద్ధి చేసుకుంది, గరిష్టంగా 8 లక్షల విక్రయాలను ఏకకాలంలో నిర్వహించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది.