Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ డెయిరీ కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్ కొత్తగా రెడీ - టు - ఈట్ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగానే టిక్కా పన్నీర్‌ను అందుబాటులోకి తెచ్చి నట్లు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. పెరు గు, పన్నీరు, మసాల ఈ మిశ్రాన్ని అత్యంత సులభంగా కేవలం 30-60 సెకన్ల పాటు వేడి చేస్తే చాలని పేర్కొంది. తమ కంపెనీ వాల్యూ-యాడెడ్ ఉత్పత్తుల విస్తరణ పోర్టుపోలియేలో భాగంగా రెడీ-టు- ఈట్ విభాగంలోకి ప్రవేశించామని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్ బ్రహ్మణీ పేర్కొన్నారు. ఈ సెగ్మెంట్లో ఇదే తొలి ఉత్పాదన అని తెలిపారు. మరిన్ని ఉత్పత్తులను అందుబాటులోకి తేనున్నామన్నారు.