Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఈఏ కృష్ణమూర్తి సుబ్రమణ్యన్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిర్దేశించుకున్న పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని తప్పకుండా చేరతామని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ పేర్కొన్నారు. 2021-22లో డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమకూ ర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఓ వర్చువల్ సమావేశంలో కృష్ణమూర్తి మాట్లాడుతూ పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన ప్రక్రియ అనుకున్న విధంగానే సాగుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎల్ఐసీ, బీపీసీఎల్ పిఎస్యుల్లో వాటా విక్రయం ద్వారా అధిక భాగం సమకూరనుందన్నారు. కరోనాతో ఆర్థిక రంగానికి ఎవరూ ఊహించని నష్టం జరిగిందని చెప్పారు. గడిచిన 150 సంవత్సరాల్లో ప్రపంచవ్యా ప్తంగా జీడీపీ ఇంత భారీస్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి అన్నారు. ముఖ్యంగా సూక్ష్మ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పారు.