Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అమెజాన్ పే లేటర్ క్రింద తమ వద్ద సైన్ అప్ చేసిన యూజర్ల సంఖ్య 2 మిలియన్లకు చేరుకుందని అమెజాన్ పే టుడే ఈ రోజు ప్రకటించింది. గత ఏడాది మహమ్మారి ప్రకోపం నేపథ్యంలో, అత్యవసరాల మరియు అధిక విలువ కలిగిన వస్తుసామాగ్రుల కొనుగోళ్ళను సుసాధ్యం చేసేందుకు, కస్టమర్లు అప్పుడే కొనుక్కుని తదుపరి నెలలో చెల్లించగలిగేట్లు లేదా వాయిదాల్లో (EMIలు) చెల్లించగలిగేందుకు దీనిని ప్రారంభించటం జరిగింది.
సులువైన డిజిటల్ సైన్-అప్ ప్రక్రియ ద్వారా కస్టమర్లకు బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు తక్షణ ఋణాన్ని ఆఫర్ చేసే చెల్లింపు పద్ధతి ఈ అమెజాన్ పే లేటర్. 99.9 శాతం పేమెంట్ సక్సెస్ రేట్‌తో 10 మిలియన్లకు పైగా లావాదేవీలను ఇది నమోదు చేసుకుంది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, వికాస్ బన్సల్, డైరెక్టర్ – అమెజాన్ పే ఇండియా ఇలా అన్నారు, “అమెజాన్ పే లేటర్ పై లక్షలాది మంది కస్టమర్లకు సేవలను అందించటం మరియు Amazon.in పై షాపింగ్ చేసే కస్టమర్లకు వర్చువల్ ఋణ శ్రేణిని అందించటం మాకు హర్షదాయకం. అంతర్నిర్మితమైన సెక్యూరిటీ ఫీచర్లతో అసమానమైన చెల్లింపు అనుభవాన్ని అమెజాన్ పే లేటర్ అందించటమే కాక, మా కస్టమర్లు వారి నెల ఖర్చులను సరిగా నిర్వహించుకునేందుకు ఉపకరిస్తుంది. అమెజాన్ పే సౌకర్యాన్ని కస్టమర్లు అందిపుచ్చుకోవటానికి మరియు దాని పట్ల వారికి ఉన్న విశ్వాసానికి, కస్టమర్లు చేసిన 2 మిలియన్ల సైన్-అప్లే గీటురాయిగా నిలుస్తాయి.”
డిజిటల్ చెల్లింపులు, దానితో పాటే బ్యాంకులు, ఆర్ధిక సంస్థల నుండి సత్వరం అందుబాటులో ఉండి, సౌకర్యాన్ని, సురక్షతను మాత్రమే కాక విలక్షణమైన రివార్డులను మరియు లబ్దులను అందించే ఋణ శ్రేణి పట్ల అమెజాన్ కస్టమర్లకు పెరుగుతున్న మక్కువకు ఈ మైలురాయి అద్దం పడుతుంది. కస్టమర్లు తమ బడ్జెట్లను, అధిక ధర కలిగిన ఉత్పత్తులైన హోమ్ అప్లయెన్సులు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, నిత్యావసరాలు, కిరాణా సామాగ్రి వంటి వాటిని కొనుగోలు చేయటం కోసం మాత్రమే కాక, విద్యుత్తు, మొబైల్ రీచార్జ్, డిజిహెచ్ మరియు ఇంకా మరెన్నో రకాల తమ నెల వారి బిల్లులను చెల్లించగలిగేందుకు కస్టమర్లకు సహాయపడటం అమెజాన్ పే లేటర్ యొక్క లక్ష్యం. ఎటువంటి అదనపు ధర లేకుండా తదుపరి నెల నాటికి తిరిగి చెల్లించే ఆప్షన్‌ను కస్టమర్లు ఉపయోగించుకోవచ్చు, లేదా సామాన్యమైన వడ్డీ రేట్లకు తమ బ్యాంకు ఖాతాల ద్వారా 12 నెలల వరకు సులభ నెలసరి వాయిదాలలో చెల్లించే సౌకర్యాన్ని కూడా కస్టమర్లు ఉపయోగించుకోవచ్చు.