Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: చర్మానికి ఎలాంటి హాని చేయని అద్భుతమైన శానిటైజర్లు అందిస్తూ పర్సనల్ కేర్ బ్రాండ్‌గా గుర్తింపుతెచ్చుకుంది నిర్వాణ. అలాంటి నిర్వాణ సంస్థ.. కృష్ణా, గుంటూరు మరియు హైదరాబాద్ జిల్లాల్లో ఉన్న పేదవారికి సాయం చేసేందుకు ముందుకొచ్చింది. వారికి కోవిడ్ పైటింగ్ టూల్స్‌ని ఉచితంగా అందించనుంది. తమ తాతగారైన డాక్టర్ కృష్ణయ్య చౌదరి చదలవాడ జ్ఞాపకార్థం ఈ సాయాన్ని అందించేందుకు ముందుకువచ్చారు నిర్వాణ సంస్థ వ్యవస్థాపకురాలు శ్రీమతి సుశి కృష్ణ. డాక్టర్ చదలవాడ కృష్ణయ్య చౌదరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పేరు పొందిన తొలితరం సర్జన్. రోగులకు ఉచితంగా వైద్యం అందించి చాలామంది డాక్టర్లకు ఆదర్శప్రాయంగా మారారు. తన జీవితకాలంలో సుమారు లక్షకు పైగా కేటరాక్ట్, థైరాయిడ్, సీ సెక్షన్స్ ఆపరేషన్లు చేసిన ఏకైక సర్జన్.. తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ చదలవాడ కృష్ణయ్య చౌదరి మాత్రమే. డాక్టర్ చదలవాడ కృష్ణయ్య చౌదరిని ఆదర్శంగా తీసుకుని ఆయన మనవరాలు శ్రీమతి సుశి కృష్ణ పేదలకు సాయం చేస్తున్నారు. సమాజానికి ఎంతోకొంత తిరిగి ఇవ్వాలన్న సదుద్దేశంతో 500 కోవిడ్ ప్రొటెక్షన్ కిట్స్‌ని అందిస్తున్నారు. ఈ కోవిడ్ ప్రొటెక్షన్ కిట్స్‌లో హ్యాండ్ వాష్ మరియు హ్యాండ్ శానిటైజర్లు ఉంటాయి. దీనిద్వారా పేదప్రజలను ఆదుకునేందుకు నిర్వాణ సంస్థ ఎప్పుడూ ముందు ఉంటుందని మరోసారి రుజువైంది. అంతేకాకుండా కోవిడ్ 19 మహమ్మారి పరిస్థితిని అర్థం చేసుకుని, ఆ పరిస్థితికి తగ్గట్లు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. దీంతోపాటు… వ్యక్తిగత పరిశుభ్రత మరియు సంక్షేమంతోనే సమాజం బావుంటుందని బలంగా నమ్ముతోంది నిర్వాణ.
ఈ సందర్భంగా నిర్వాణ వ్యవస్థాపకురాలు సుశి తన్నీరు మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ… ఈ మహమ్మారి మనల్ని చాలా ప్రభావితం చేసింది. ఇలాంటి సమయంలో పరిస్థితులకు భయపడకుండా ఉండడం, మనకు చేతనైన సాయం చేయడం చాలా అవసరం. అందుకే సమాజానికి సాయం చేయాలనే భావనతోనే మా ఈ ప్రయత్నాలను ప్రారంభించాం. హైజీన్ బ్రాండ్‌గా మా ప్రాధాన్యత ఒక్కటే.. ఈ మహమ్మారి సమయంలో ప్రజలంతా క్షేమంగా మరియు పరిశుభ్రంగా ఉండేలా మార్గనిర్దేశం చేయడం అని అన్నారు శ్రీమతి సుశి తన్నీరు. సమాజానికి తనవంతు సాయం చేసేందుకు నిర్వాణ సంస్థ ఎప్పుడూ ముందుంటుంది. అందుకే.. కోవిడ్-19 పేషంట్స్‌కు భోజనం మరియు శానిటైజర్లు ఉచితంగా అందించేందుకు బిస్సిబిస్సి ఊటాతో చేతులు కలిపింది. మరోవైపు… ఇలాంటి సామాజిక కార్యక్రమాలలో భాగం కావాలనుకునే ఎవరైనా సరే నిర్వాణను సంప్రదించవచ్చు. అంతేకాదు అవసరంలో ఉన్నవారికి మరియు దాతలకు మధ్య వారధిగా కూడా తన సేవలు అందిస్తోంది నిర్వాణ.