Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సుప్రసిద్ధ రియల్ ఎస్టేట్ టెక్నాలజీ కంపెనీ కంపాస్, భారతదేశంలో తమ ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయనున్నట్లు నేడు వెల్లడించింది. రాబోయే కొద్ది నెలల్లో తమ ఇండియా డెవలప్మెంట్ కేంద్రం (ఐడీసీ) కోసం ఈ నియామకాలను చేపట్టనుంది. యుఎస్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన కంపాస్, రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు , తమ విక్రేతలు మరియు కొనుగోలుదారులకు అసాధారణ సేవలను అందించేందుకు తోడ్పడుతుంది. ఈ కంపాస్ ప్లాట్ఫామ్లో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, క్లయింట్ సేవలు మరియు ఇతర కీలకమైన అంశాల కోసం క్లౌడ్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను అందిస్తుంది. ఈ కంపెనీ యొక్క ఐడీసీ, హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వద్ద ఉంది. యుఎస్‌కు వెలుపల సంస్థకు ఉన్న ఒకే ఒక్క సాంకేతిక కేంద్రం ఇది. కంపాస్ ఐడీసీలో 200 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. అత్యంత నైపుణ్యం కలిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ప్రొడక్ట్ టీమ్స్ ఇక్కడ పలు క్లౌడ్ ఆధారిత సేవలను 2020 తొలి త్రైమాసంలో ఈ కేంద్రం ఆరంభించిన నాటి నుంచి అభివృద్ధి చేస్తూనే ఉన్నారు. ఐడీసీకోసం ప్రతిభావంతులను నియమించుకోవడమన్నది భావి తరపు సాంకేతికతలైనటువంటి కృత్రిమ మేథస్సు (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), క్లౌడ్ కంప్యూటింగ్, డాటా ఎనలిటిక్స్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్పీఏ) మరియు ఐఓఎస్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ లలో కొనసాగిస్తుంది.
‘‘వ్యాపార ఆలోచనలు కలిగిన అత్యున్నత సాంకేతిక ప్రతిభ భారతదేశంలో ఉంది మరియు పరిశ్రమలను సమూలంగా మార్చేందుకు ఇది అత్యంత కీలకం. అత్యంత వేగంగా మారుతున్న పని వాతావరణానికి తగినట్లుగా శక్తివంతమైన సాంకేతిక నైపుణ్యాలు ఉన్నప్పుడు మాత్రమే తమ లాంటి సంస్థలకు ఖచ్చితమైన అభ్యర్థులు నిలుస్తారు’’ అని జోసెఫ్ సిరోష్, కంపాస్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అన్నారు.
‘‘ప్రపంచశ్రేణి ప్రతిభావంతులను ఉద్యోగాలలో నియమించుకోవడంతో పాటుగా వారిని నిలుపుకోవడంలో కంపాస్ ఐడీసీకి అసాధారణ ట్రాక్ రికార్డ్ ఉంది. మహమ్మారి సమయంలో కూడా దానిని కొనసాగించాం. సాంకేతిక ఆవిష్కర్తలకు స్వతంత్య్రంగా పనిచేసే అవకాశం అందించడంతో పాటుగా ఈ సంక్షోభ సమయంలో కూడా అసాధారణ ప్రజ్ఞావంతులతో కూడిన బృందాన్ని నిర్మించాము. ఎవరైతే పెద్ద కలలుకంటూ, తమ సొంత కెరీర్స్‌కు ఓ ఆకృతి ఇవ్వాలని తపించడంతో పాటుగా విప్లవాత్మక ఆవిష్కరణలతో భావిరియల్ ఎస్టేట్‌కు ఓ సైతం ఓ ఆకృతినివ్వాలని తపించే వారి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని జోసెఫ్ అన్నారు. కంపాస్ ఐడీసీ ప్రస్తుతం విభిన్న స్థానాల కోసం ఉద్యోగులను నియమించుకుంటుంది. మరింత సమాచారం https://www.compass.com/careers/jobs.వద్ద లభ్యమవుతుంది.