Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశంలో అతిపెద్ద మరియు అత్యంత విశ్వసనీయమైన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్, శాంసంగ్ తమ కాంటాక్ట్‌లెస్ ఆఫరింగ్‌ను వినియోగదారులకు మరింతగా విస్తరిస్తూ సరికొత్త అగుమెంటెడ్ రియాల్టీ (ఏఆర్) ఆధారిత డెమోను తమ ప్రతిష్టాత్మక రిఫ్రిజిరేటర్ మరియు టీవీ కోసం తీసుకువచ్చింది. దీనిద్వారా వినియోగదారులు తమ అభిమాన శాంసంగ్ ఉత్పత్తులు తమ ఇంటిలో ఏ విధంగా కనిపిస్తాయో వర్ట్యువల్‌గా వీక్షించి వినూత్న అనుభవాలను సొంతం చేసుకోగలరు. వినియోగదారులు ఏఆర్ డెమోను వినియోగించుకుని, వర్ట్యువల్‌గా శాంసంగ్ లైఫ్‌స్టైల్ టీవీ ద సెరిఫ్ను వారి లివింగ్ రూమ్ లేదా అత్యాధునిక స్పేస్మ్యాక్స్ ఫ్యామిలీ హబ్ రిఫ్రిజిరేటర్ తమ కిచెన్లోఏ విధంగా ఉంటుందో సంపూర్ణ వీక్షణనూ చేయవచ్చు. అంతేకాదు, వారు ఆ ఉత్పత్తులకు సంబంధించి సవివరమైన ఫీచర్లను సైతం అన్వేషించవచ్చు. వినియోగదారులు ఆ ఉత్పత్తులకు సంబంధించిన ప్రమాణాలను సైతం పరీక్షించడంతో పాటుగా తమ ఇంటి డెకార్, ప్రదేశంతో వాటిని మ్యాచ్ చేసుకోనూ వచ్చు.
ఈ ఏఆర్ డెమోతో వినియోగదారులు సౌకర్యవంతంగా తమ ఇళ్ల నుంచి శాంసంగ్ ఉత్పత్తులను అన్వేషించడంతో పాటుగా కనుగొనడమూ అతి సులభంగా చేయవచ్చు మరియు పూర్తి సమాచార యుక్త నిర్ణయాలను తమ ఇళ్ల నుంచి బయటకు రాకుండానే తీసుకోవచ్చు. శాంసంగ్ ఇప్పుడు ఈ ఏఆర్ డెమోను ద సెరిఫ్ లైఫ్‌స్టైల్ టీవీలు మరియు స్పేస్మ్యాక్స్ ఫ్యామిలీ హబ్ రిఫ్రిజిరేటర్లతో విడుదల చేసింది. త్వరలోనే ఇతర ఉత్పత్తులకు సైతం దీనిని పొడిగించనుంది.
‘‘వినియోగదారులు ఇప్పుడు అధిక సమయం ఇళ్ల వద్దనే గడుపుతున్నారు మరియు స్మార్టర్ లైఫ్‌స్టైల్ ఎంపికల కోసమూ వెదుకుతున్నారు. సౌకర్యవంతంగా తమ ఇళ్ల నుంచి తమ అభిమాన శాంసంగ్ ఉత్పత్తుల అనుభవాలను వినియోగదారులు పొందాలని మరియు అడుగు బయటపెట్టకుండానే లావాదేవీలను వారు పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ నూతన ఏఆర్ డెమో మా వినియోగదారులకు సాంకేతిక సౌకర్యం అందిస్తుంది. అందువల్ల వారు అనుభవపూర్వకంగా, సమాచారయుక్త నిర్ణయాలను వారు తీసుకోగలరు’’ అని రాజుపుల్లన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్, శాంసంగ్ ఇండియా అన్నారు.
ఏఆర్ డెమో ఏ విధంగా పనిచేస్తుంది?
ఓ ఉత్పత్తి పట్ల ఆసక్తి కలిగిన వినియోగదారులకు ఏఆర్ డెమో లింక్‌ను శాంసంగ్ ఎక్స్‌పీరియెన్స్ కన్సల్టెంట్లు షేర్ చేస్తారు. వినియోగదారులు ఈ లింక్‌ను శాంసంగ్ ఫేస్బుక్ పేజీ ద్వారా కూడా పొందవచ్చు. ఒకసారి ఆ లింక్ క్లిక్ చేస్తే, ఏఆర్ డెమో వారి స్మార్ట్ఫోన్లపై యాక్టివేట్ అవుతుంది. వినియోగదారులు అప్పుడు తమ ఇంటి వాతావరణంలో ఆ ఉత్పత్తిని చూడవచ్చు. టీవీ లేదంటే రిఫ్రిజిరేటర్‌ను తమ స్మార్ట్‌ఫోన్ కెమెరా వినియోగించి కోరుకున్న ప్రాంతంలో ఆ ఉత్పత్తిని అమర్చడం ద్వారా ప్రత్యక్ష అనుభవాలను పొందవచ్చు. ఈ కెమెరా వినియోగదారుల ఇళ్లలోని ప్రాంగణాన్ని స్కాన్ చేయడంతో పాటుగా ఆ ఉత్పత్తిని అందుకు తగినట్లుగా ఉంచుతుంది మరియు ఆ ఉత్పత్తి వారి ఇళ్లలో ఎంత ఆకర్షణీయంగా ఉంటుందనే అంశంపై కూడా స్పష్టతనిస్తుంది. ఒకవేళ వినియోగదారులు ఎంచుకున్న ఉత్పత్తి రిఫ్రిజిరేటర్ అయితే, వినియోగదారులు దాని తలుపులు తెరువడంతో పాటుగా ఫ్రిజ్ లోపల ఎలా ఉందో సమగ్రమైన అనుభవాలనూ పొందవచ్చు.
ఈ వర్ట్యువల్ అనుభవాల తరువాత వినియోగదారులు కాల్ బ్యాక్ చేయాల్సిందిగా అభ్యర్ధించడంతో పాటుగా తమ దగ్గరలోని శాంసంగ్ రిటైలర్నూ కనెక్ట్ కావొచ్చు. తద్వారా అడుగు బయటపెట్టకుండానే శాంసంగ్ ఉత్పత్తులను కొనుగోలు చేయగలమనే భరోసానూ పొందవచ్చు. గత కొద్ది వారాలుగా, శాంసంగ్ పలు కాంటాక్ట్‌లెస్ ఆఫరింగ్స్‌ను వినియోగదారుల కోసం ప్రారంభించింది. ఇవి వారు కోరుకున్న ఉత్పత్తులను సురక్షిత వాతావరణంలో, అత్యంత సౌకర్యవంతంగా అనుభవాలను సొంతం చేసుకుంటూనే, కొనుగోలు చేసే అవకాశం అందిస్తాయి.
అపాయింట్మెంట్ ద్వారా కొనుగోళ్లు
వినియోగదారులు ఇప్పుడు తమ దగ్గరలోని రిటైలర్ వద్ద అపాయింట్మెంట్స్ ఏర్పరుచుకోవడం చేయవచ్చు. దీనికోసం అతి సులభమైన రీతిలో ఆన్లైన్ ఫార్మ్‌ను https://www.samsungindiamarketing.com/Promotions/promo-of-the-month/. వద్ద పూరించాల్సి ఉంటుంది. ఒకసారి ఫార్మ్ పూరించిన తరువాత, శాంసంగ్ ఎక్స్పీరియన్స్ కన్సల్టెంట్, వినియోగదారులను సంప్రదించడంతో పాటుగా స్టోర్ విజిట్ కోసం అపాయింట్మెంట్ను సైతం ఏర్పాటుచేసుకోవడంలో సహాయపడతారు.
ఇంటి వద్దనే ప్రత్యక్ష వీడియో డెమో
శాంసంగ్ ఎక్స్పీరియన్స్ కన్సల్టెంట్లు , వినియోగదారుల కోసం ఏ ఉత్పత్తిని అయినా వీడియో కాల్ ద్వారా డెమో చూపడంతో పాటుగా వినియోగదారులు సౌకర్యవంతంగా తమ ఇళ్ల నుంచి ఉత్పత్తులను ఎంచుకోవచ్చు. ఎంపిక తరువాత, వినియోగదారులు ఆన్లైన్ చెల్లింపులు చేయడంతో పాటుగా తమ ఇంటి వద్దనే ఉత్పత్తులను కాలు బయట పెట్టకుండానే డెలివరీ సైతం పొందవచ్చు.
దగ్గరలోని రిటైల్ స్టోర్ల నుంచి ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేయండి
అతి సులభంగా గుగూల్ సెర్చ్ చేయడం ద్వారా వినియోగదారులు ఇప్పుడు తమ దగ్గరలోని శాంసంగ్ ఉత్పత్తులను విక్రయించే రిటైల్ స్టోర్లను కనుగొనవచ్చు. ఈ స్టోర్ల వెబ్సైట్లపై తమకు కావాల్సిన ఉత్పత్తులకు సంబంధించిన చెల్లింపులను డిజిటల్ చెల్లింపుల వేదిక బీనౌ ద్వారా చేయవచ్చు.