Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: శాంసంగ్ ఇప్పుడు అత్యద్భుతమైన గెలాక్సీ ఏ 22ను ఆకర్షణీయమైన 6.4 అంగుళాల హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే తో ఆవిష్కరించింది. ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వైవిధ్యమైన 48 మెగా పిక్సెల్ క్వాడ్ కెమెరాను ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో మరియు శక్తివంతమైన 5000ఎంఏహెచ్ బ్యాటరీతో భారతదేశంలో లభిస్తుంది. గెలాక్సీ ఏ22లో డాల్బీ అట్మాస్ మద్దతు వైర్డ్ మరియు బ్లూ టూత్ హెడ్‌సెట్స్‌లో లభించడంతో పాటుగా అత్యద్భుతమైన ఆడియో మరియు సినిమాటిక్ వీక్షణ అనుభవాలను సైతం అందిస్తుంది.
గెలాక్సీ ఏ22 స్మార్ట్ఫోన్లు బ్లాక్,వైట్, మింట్, వయెలెట్ రంగులలో 6జీబీ+128జీబీ వేరియంట్ 18,499 రూపాయలలో లభిస్తుంది. గెలాక్సీ 22 ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ స్టోర్లు, శాంసంగ్ డాట్ కామ్ మరియు సుప్రసిద్ధ ఆన్లైన్ పోర్టల్స్ వద్ద లభ్యమవుతుంది. పరిచయ ఆఫర్‌గా, వినియోగదారులు 1500 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసిన ఎడల పొందవచ్చు. గెలాక్సీ ఏ22 యొక్క 48 మెగా పిక్సెల్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో వస్తుంది. ఇది వినియోగదారులు ఉపయుక్తమైన అలా్ట్ర వైడ్ మరియు స్పష్టమైన చిత్రాలను రోజంతా ఒడిసిపట్టడంలో తోడ్పడుతుంది. దీనిలో 8 మెగా పిక్సెల్ అలా్ట్ర వైడ్ లెన్స్, 123 డిగ్రీ వీక్షణ క్షేత్రం కలిగి ఉంటుంది. ఇది ఫోటోగ్రాఫ్స్‌కు అదనపు దృష్టికోణం అందిస్తుంది. ఈస్మార్ట్ఫోన్లోని 2 మెగా పిక్సెల్ మ్యాక్రోలెన్స్ స్పష్టంగా క్లోజప్ షాట్స్ తీసుకోవడంలో సహాయపడుతాయి. అలాగే 2 మెగా పిక్సెల్ డెప్త్ కెమెరా, ఆకట్టుకునే రీతిలో పోట్రెయిట్ షాట్స్‌ను లైవ్ ఫోకస్ మోడ్‌లో అందిస్తుంది.
గెలాక్సీ ఏ22 స్మార్ట్‌ఫోన్ 13 మెగా పిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది పూర్తి స్పష్టతను అందించడంతో పాటుగా చూడగానే ఆకట్టుకునే సెల్ఫీలను సైతం అందిస్తుంది. గెలాక్సీ ఏ22లో అత్యాధునిక ఏఐ ను వినియోగించుకోవడం వల్ల స్వయంచాలకంగా సీన్ ఆప్టిమైజర్తో కలర్, బ్రైట్నెస్, షార్ప్‌నెస్‌ను వృద్ధిచేస్తుంది. అత్యాధునిక ఆక్టా కోర్ మీడియా టెక్ హెలియో జీ80 ప్రాసెసర్‌తో శక్తివంతమైన గెలాక్సీ ఏ22, గరిష్ట పనితీరుకు భరోసా అందించడంతో పాటుగా బ్రౌజింగ్ మరియు బహుళ యాప్‌లను వినియోగించుకునే సమయంలో సైతం మృదువుగా బహుళ అంశాలను చేయడం మరియు ఇంధన వినియోగం తగ్గించడంను చేస్తుంది. గెలాక్సీ ఏ 22 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11తో పాటుగా ఒన్ యుఐ 3.1కు మద్దతునందిస్తుంది. గెలాక్సీ ఏ22 స్మార్ట్ఫోన్లు బ్లాక్,వైట్, మింట్, వయెలెట్ రంగులలో 6జీబీ+128జీబీ వేరియంట్ 18,499 రూపాయలలో లభిస్తుంది. గెలాక్సీ 22 ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ స్టోర్లు, శాంసంగ్ డాట్ కామ్ మరియు సుప్రసిద్ధ ఆన్లైన్ పోర్టల్స్ వద్ద లభ్యమవుతుంది.
పరిచయ ఆఫర్లు: పరిచయ ఆఫర్‌గా, వినియోగదారులు 1500 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసిన ఎడల పొందవచ్చు.