Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: Flipkart యొక్క పే ఆన్ డెలివరీ ఆర్డర్ల కోసం కాంటాక్ట్ లెస్ స్కాన్ అండ్ పేను ఆవిష్కరించడం కోసం భారతదేశంలో స్వదేశంగా ఎదిగిన ఇమార్కెట్ సంస్థ అయిన Flipkartతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని భారతదేశంలోని అతిపెద్ద డిజిటల్ పేమెంట్స్ వేదిక PhonePe నేడు ప్రకటించింది. డెలివరీ సమయంలో ఏదైనా UPI యాప్ ద్వారా డిజిటల్ మార్గంలో పే చేసేందుకు క్యాష్ ఆన్ డెలివరీ ఎంచుకున్న వినియోగదారులకు PhonePe యొక్క డైనమిక్ QR కోడ్ సొల్యూషన్ వీలు కల్పిస్తుంది. ఇది భద్రతకు భరోసా ఇస్తూనే, వ్యక్తిగతంగా తాకాల్సిన పరిస్థితిని తగ్గించడంలో సహాయపడుతుంది.
ఈ భాగస్వామ్యంపై PhonePe డైరెక్టర్ ఆఫ్ బిజినెస్ అంకిత్ గౌర్ మాట్లాడుతూ, “UPI కారణంగా గత కొన్నేళ్లుగా డిజిటల్ పేమెంట్ల స్వీకరణ అనేది విస్తృతంగా వ్యాపిస్తోంది. అయినప్పటికీ, డెలివరీ సమయంలో కొంతమంది వినియోగదారులు క్యాష్ ఆన్ డెలివరీని ఎంచుకోవడం కొనసాగుతోంది. ఈ నగదు ఆధారిత పేమెంట్లను డిజిటల్ మయం చేయడం కేవలం ఇ-కామర్స్ మార్కెట్ కు ఊతం ఇవ్వడమే కాక, డిజిటల్ భారతదేశం అనే భారీ లక్ష్యాన్ని సాధించడంలో పాత్ర పోషిస్తోంది. Our partnership with Flipkart యొక్క పే ఆన్ డెలివరీ కస్టమర్లకోసం కాంటాక్ట్ లెస్ మరియు సురక్షితమైన పేమెంట్లకు వీలు కల్పించడం కోసం ఆ సంస్థతో మేము కుదుర్చుకున్న భాగస్వామ్యం ఈ దిశగా పెద్ద ముందడుగు అని చెప్పవచ్చు. మా సొల్యూషన్ వినియోగదారులకు నిరంతరాయమైన మరియు కాంటాక్ట్ లెస్ పేమెంట్ అనుభవాన్ని అందించడంతో పాటు ఇకామర్స్ మరియు లాజిస్టిక్ కంపెనీలకు నగదు తీసుకెళ్లే ఖర్చులను తగ్గించడంలోనూ సహాయపడుతుంది.” అని అన్నారు.
Flipkart ఫిన్ టెక్ మరియు పేమెంట్స్ గ్రూప్ హెడ్ రంజిత్ బోయనపల్లి మాట్లాడుతూ, “ఇకామర్స్ మార్కెట్ ప్లేస్ మరియు జిడిటల్ పేమెంట్లు ఒకే దిశలో పయనిస్తుండడం కొనసాగుతుండడంతో వినియోగదారుల యొక్క పరిణామక్రమ అవసరాలు, వారి స్వభావాలను సంతృప్తి పరచడం అనివార్యమవుతోంది. మహమ్మారి కారణంగా పలువురు వినియోగదారులు ఆన్ లైన్ షాపింగ్ వైపు మళ్లే పరిస్థితులు కల్పించడంతో చెక్ అవుట్ సందర్భంగా సరైన నమ్మకం కొరవడుతోంది. పే ఆన్ డెలివరీ టెక్నాలజీ ద్వారా, వినియోగదారులు పేమెంట్ల విషయంలో ప్రశాంతంగా ఉండేలా చూడాలనుకుంటున్నాము. అదే సమయంలో ఇంటినుంచే వారు షాపంగ్ చేసే వీలు కల్పించాలనుకుంటున్నాము.” అని అన్నారు.
PhonePe పరిచయం:
భారతదేశంలోని అగ్రగామి డిజిటల్ పేమెంట్ల వేదిక PhonePeలో 30 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్న వినియోగదారులు ఉన్నారు. PhonePe ద్వారా వినియోగదారులు డబ్బు పంపవచ్చు, స్వీకరించవచ్చు. మొబైల్, DTH, డేటా కార్డులను రీఛార్జ్ చేసుకోవచ్చు. దుకాణాల్లో డబ్బులు చెల్లించవచ్చు. వినియోగ బిల్లులు లాంటివి కట్టవచ్చు. బంగారం కొనుగోలు చేయవచ్చు, పెట్టుబడులు పెట్టవచ్చు. 2017లో డిజిటల్ గోల్డ్‌ను ప్రారంభించడం ద్వారా PhonePe ఆర్థిక సేవల రంగంలో అడుగుపెట్టింది. డిజిటల్ గోల్డ్ ద్వారా వినియోగదారులు 24 క్యారెట్ల బంగారాన్ని సురక్షితంగా తమకు నచ్చిన విధంగా కొనుగోలు చేసే అవకాశాన్ని PhonePe తన వేదికలో అందిస్తోంది. ఆ తరువాత మ్యూచువల్ ఫండ్స్‌ను, బీమా ఉత్పత్తులను ప్రారంభించింది. ఇందులో పన్ను ఆదా ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, అంతర్జాతీయ ప్రయాణ బీమా, COVID-19 మహమ్మారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన కరోనా కేర్ లాంటి బీమా ఉత్పత్తులను కూడా PhonePe ఆవిష్కరించింది. 2018లో PhonePe తన స్విచ్ వేదికను కూడా ప్రారంభించింది. నేడు PhonePe మొబైల్ యాప్ ద్వారా వినియోగదారులు నేరుగా Ola, Myntra, IRCTC, Goibibo, RedBus, Oyo లాంటి 300లకు పైగా యాప్ లలో ఆర్డర్లు చేయవచ్చు. జాతీయ స్థాయిలో 500 నగరాల్లోని ఒక కోటి 60 లక్షలకు పైగా వ్యాపార దుకాణాల్లో PhonePe ద్వారా పేమెంట్లను అంగీకరిస్తున్నారు. 2018లో PhonePe తన స్విచ్ వేదికను కూడా ప్రారంభించింది. నేడు PhonePe మొబైల్ యాప్ ద్వారా వినియోగదారులు నేరుగా Ola, Swiggy, Myntra, IRCTC, Goibibo, RedBus లాంటి 600లకు పైగా యాప్ లలో ఆర్డర్లు చేయవచ్చు. జాతీయ స్థాయిలో 12 వేల పట్టణాలు, 4వేల తాలుకాలలోని 2 కోట్లకు పైగా వ్యాపార దుకాణాల్లో PhonePe ద్వారా పేమెంట్లను అంగీకరిస్తున్నారు.
Flipkart గ్రూప్ పరిచయం
Flipkart గ్రూప్ భారతదేశంలోని ప్రముఖ డిజిటల్ కామర్స్ కంపెనీలలో ఒకటిగా నిలుస్తోంది. Flipkart, Myntra, మరియు Flipkart Wholesale ఈ గ్రూప్ కంపెనీలలో ఒకటిగా ఉన్నాయి. 2017లో ప్రారంభమైన Flipkart కోట్లాది మంది వినియోగదారులు, వ్యాపారులు విక్రేతలు, చిన్న వ్యాపార సంస్థలు భారతదేశపు ఇ-కామర్స్ విప్లవంలో భాగమయ్యేలా చేసింది. 30కోట్లకు పైగా రిజిస్టర్ చేసుకున్న వినియోగదారులను కలిగి, 80కు పైగా విభాగాల్లో 15 కోట్ల ఉత్పత్తులను అందిస్తోంది. భారతదేశంలో ఇ-కామర్స్ ను ప్రజాస్వామ్యబద్ధంగా చేయడం, అందుబాటును మరింత ముందుకు తీసుకువెళ్లడం, చౌకధరకు అందించి, వినియోగదారులను సంతోష పరచడం, ఈ వ్యవస్థలో లక్షలాది ఉద్యోగాలు సృష్టించడం, ఔత్సాహక వేత్తల తరాలను బలోపేతం చేయడం, చేసే దిశగా మేము చేస్తున్న ప్రయత్నాలు పలు పరిశ్రమ రంగాల్లో వినూత్న విషయాలను వెలుగులోకి తీసుకువచ్చేలా మాకు స్ఫూర్తినిచ్చాయి. ఇటీవల మేము ఆవిష్కరించిన మా కొత్త డిజిటల్ మార్కెట్ ప్లేస్ Flipkart Wholesale భారతదేశంలో కిరాణా దుకాణాలు, MSMEల వృద్ధిని వేగవంతం చేయడంలో మా చిత్తశుద్ధికి సాక్ష్యంగా నిలుస్తోంది. క్యాష్ ఆన్ డెలివరీ, ఖర్చులేని EMI, సులభతర రిటర్న్ లు లాంటి కొంగొత్త సేవలకు మాత్రమే కాక కోట్లాది మంది భారతీయులకు ఆన్ లైన్ షాపింగ్ సౌకర్యాన్ని సులభంగా, చౌకగా అందుబాటులోకి తీసుకువచ్చేరీతిలో ప్రవేశపెట్టిన అనేక వినియోగదారు కేంద్రీకృత నవ్యావిష్కరణలకు Flipkart ఖ్యాతి గడించింది. ఆన్ లైన్ ఫ్యాషన్ విపణిలో విఖ్యాత స్థానం సంపాదించుకున్న Myntra, అలాగే తాజాగా Flipkart Wholesaleతో కలిసి, Flipkart గ్రూప్ టెక్నాలజీ ద్వారా భారతదేశంలో వాణిజ్యాన్ని రూపాంతరం చేసే పనిని కొనసాగిస్తోంది.