Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రెండు మిలియన్ ల ‘అమేజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్’ క్రెడిట్ కార్డ్స్ ని జారీ మైలురాయిని బ్యాంక్ అధిగమించిందని ఐసీఐసీఐ బ్యాంక్ మరియు అమేజాన్ పేలు నేడు ప్రకటించాయి. ఈ ప్రక్రియలో, కార్డ్ దేశంలో ఈ విలక్షణమైన మైలురాయిని అధిగమించడంలో అతి వేగవంతమైనది సహ -బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ గా ఆవిర్భవించింది. అమేజాన్ పే మరియు ఐసీఐసీఐ బ్యాంక్ లు వీసా మద్దతుతో 2018 అక్టోబర్ లో కార్డ్ ని పరిచయం చేసాయి. గత ఏడాది అక్టోబర్ లో ఒక మిలియన్ ముంజురైన మైలురాయిని భారతదేశంలో అధిగమించిన అతి వేగవంతమైన సహ-బ్రాండెడ్ క్రెడి కార్డ్ రికార్డ్ ని కూడా సాధించింది. తదుపరి, గత తొమ్మిది నెలలుగా ఇది మరొక మిలియన్ కస్టమర్లని కూడా సభ్యులుగా చేసింది, 80%కి పైగా కొత్త కస్టమర్లు కార్డ్ ని పూర్తిగా డిజిటల్ గా, ఎలాంటి భౌతికమైన పరస్పర చర్య లేకుండా పొందుతున్నారు. కార్డ్ హోల్డర్స్ కి అందించే విలక్షణమైన ప్రయోజనాలకు మైలురాయి నిరూపణగా నిలిచింది. ప్రయోజనాలు యొక్క జాబితాలో ఎల్లప్పుడూ (ఆల్వేజ్ ఆన్) - ఆన్, అపరిమితమైన బహుమతుల కార్యక్రమం, 60 సెకనులు లోగా ఎంపిక చేయబడిన కస్టమర్లకు తక్షణమే కార్డ్ జారీ చేయడం, బహుమతి పాయింట్లను నేరుగా అమేజాన్ పే బ్యాలెన్స్ కి క్రెడిట్ చేయడం మరియు కస్టమర్లు సురక్షితంగా చెల్లించడంలో సహాయపడటానికి కాంటాక్ట్ లెస్ చెల్లింపు ఫీచర్ ఇందులో ఉన్నాయి.
అదనంగా, ఐసీఐసీఐ బ్యాంక్ మరియు అమేజాన్ పేలు కస్టమర్ సౌకర్యాన్ని పెంచడానికి నిరంతరంగా కార్డ్ కి ఫీచర్లని చేరుస్తున్నారు. ఉదాహరణకు, Amazon.in యొక్క ఎవరైనా రిజిస్టర్డ్ కస్టమర్, ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు కాని వారు సహా కార్డ్ కోసం డిజిటల్ గా, దేశంలో ఎక్కడ నుండైనా దరఖాస్తు చేయవచ్చు. కొత్త కస్టమర్లను 'వీడియో కేవైసీ' సదుపాయం ద్వారా సురక్షితమైన మరియు కాంటాక్ట్ లెస్ విధానంలో ఐసీఐసీఐ బ్యాంక్ సభ్యులుగా చేస్తుంది. 2020 జూన్ లో కస్టమర్లు కోసం భారతదేశంలో వీడియో కేవైసీని ప్రవేశపెట్టిన క్రెడిట్ కార్డ్స్ లలో ఇది మొదటిది. అప్పటి నుండి, దేశవ్యాప్తంగా, ప్రధానంగా ఢిల్లీ ఎన్సీఆర్, ముంబయి, పూణె, బెంగళూరు మరియు హైదరాబాద్ లు నుండి కార్డ్ ని ఆమోదించేవారు ఎక్కువయ్యారు. మిల్లీనియల్స్ ప్రజలు విస్త్రతంగా దీనిని ఆదరిస్తున్నారు మరియు ఆన్ లైన్ మార్కెట్ ప్రదేశాలు, డిపార్ట్ మెంటల్ స్టోర్స్ మరియు బీమా ప్రీమియం చెల్లింపులలో దీనిని వినియోగించి అత్యధికంగా ఖర్చు చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ సుదీప్త రాయ్, ప్రధాన అధికారి- అన్ సెక్యూర్డ్ అస్సెట్స్, ఐసీఐసీఐ బ్యాంక్ ఇలా అన్నారు, “అమేజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ కు దేశవ్యాప్తంగా కస్టమర్లు నుండి అనూహ్యమైన స్పందన వచ్చింది. పరిశ్రమలో ఉత్తమమైన బహుమతులు, క్రెడిట్ నిరంతరంగా పొందడం మరియు క్రెడిట్ కార్డ్ సభ్యులుగా మారడానికి సులభమైన ప్రక్రియలు ఈ విజయానికి కీలకంగా తోడ్పడ్డాయి. జూన్ 2020లో ప్రవేశపెట్టిన వీడియో కేవైసీతో, బ్యాంక్ కి కొత్త కస్టమర్లు చాలామంది దేశంలో పలు ప్రాంతాలు నుండి కార్డ్ కోసం దరఖాస్తు చేసారు. ఇది యూజర్ బేస్ ని గణనీయంగా పెంచింది. రెండు మిలియన్ లు మంజూరు చేయబడిన అతి వేగవంతమైన సహ-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ గా ఇది ఇప్పుడు మారింది, చివరి ఒక మిలియన్ కార్డ్స్ ఒక ఏడాది లోగా జారీ చేయబడ్డాయి. 80%కి పైగా కొత్త కస్టమర్లు కార్డ్ ని పూర్తిగా డిజిటల్ గా, ఎలాంటి భౌతికమైన పరస్పర చర్య లేకుండా పొందారు దేశంలో అతి పెద్ద సహ-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ గా మారడానికి కార్డ్ ఖచ్చితమైన గ్యారంటీని కలిగి ఉందని మేము విశ్వసిస్తాము. “అమేజాన్ పేలో, కస్టమర్లు చేసే డిటిటల్ చెల్లింపుల విధానాన్ని మేము మారుస్తున్నాము. అమేజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ దేశంలో అత్యంత విజయవంతమైన, సౌకర్యవంతమైన మరియు నమ్మకమైన చెల్లింపు అనుభవాల్లో ఒకటి. 2 మిలియన్ లకు పైగా కస్టమర్లు మమ్మల్ని విశ్వసించారు మరియు వారు అనుభవానికి ఏ విధంగా విలువ ఇస్తారో చూపించారు. తమ పూర్తి షాపింగ్ కు మరియు చెల్లింపుల అవసరాలకు ఈ కార్డ్ మా కస్టమర్లకు అమేజాన్ పేని ఎంచుకోవడానికి మరొక కారణంగా నిలిచింది” అని వికాస్ బన్సల్, డైరక్టర్ -అమేజాన్ పే ఇండియా అన్నారు. “వీసా మద్దతుతో అమేజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ 2 మిలియన్ కార్డ్స్ ని దాటినందుకు మేము ఆనందిస్తున్నాము, దీనిలో చివరి 1 మిలియన్ కార్డ్స్ మహమ్మారి కొనసాగుతున్నా కూడా ఒక ఏడాది లోగా జారీ చేయబడ్డాయి. తమకు గొప్ప బహుమతులు మరియు చెల్లింపుల సౌలభ్యాన్ని ఇచ్చే కార్డ్స్ ని కస్టమర్లు ప్రాధాన్యత ఇస్తారని నమ్మకాన్ని ఇది శక్తివంతం చేసింది. కార్డ్ వివిధ తరగతుల శ్రేణిలో వినియోగించబడుతోంది, తమ అన్ని ఖర్చులు కోసం దానిని వినియోగించడంలో వినియోగదారులు విలువని గుర్తించారని ఇది తెలియచేస్తోందని” శైలేష్ పాల్, ప్రధాన అధికారి, మర్చెంట్ సేల్స్ & అక్వైరింగ్ మరియు సైబర్ సోర్స్, ఇండియా మరియు దక్షిణాసియా, వీసా అన్నారు