Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్, శాంసంగ్ నేడు తమ గెలాక్సీ ఎఫ్ 22ను ఫ్లిప్‌కార్ట్‌పై ఆవిష్కరించినట్లు వెల్లడించింది. ఈ ఫుల్ ఆన్ బ్లాక్‌బస్టర్ స్మార్ట్‌ఫోన్, మా యువ జెన్ జెడ్ మిల్లీనియల్ వినియోగదారులకు సంపూర్ణమైన పనితీరును అందిస్తుంది. గెలాక్సీ ఎఫ్22 స్మార్ట్ఫోన్లు ఈ విభాగంలో అత్యుత్తమమైన రీతిలో 6.4 అంగుళాల హెచ్డీ+ ఎస్ అమోలెడ్ డిస్ప్లేను 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. దీని ధరల వద్ద గెలాక్సీ ఎఫ్22, అత్యంత అందుబాటుధరలోని ఎస్‌అమోలెడ్ 90 హెర్ట్జ్ డిస్ప్లే స్మార్ట్‌ఫోన్‌గా ఫ్లిప్‌కార్ట్‌పై లభ్యమవుతుంది. గెలాక్సీ ఎఫ్22లో భారీ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ మరియు అసలైన 48 మెగా పిక్సెల్ క్వాడ్ కెమెరా ఉన్నాయి. గెలాక్సీ ఎఫ్22 ను రెండు మెమరీ వేరియంట్లు – 4జీబీ+64జీబీ మరియు 6జీబీ+128 జీబీలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా 12,499 రూపాయలు మరియు 14,499రూపాయలు. గెలాక్సీ ఎఫ్22 స్మార్ట్‌ఫోన్ రెండు ఆకర్షణీయమైన రంగులు–డెనిమ్ బ్లూ మరియు డెనిమ్ బ్లాక్‌లో లభిస్తుంది.గెలాక్సీ ఎఫ్22 స్మార్ట్‌ఫోన్., శాంసంగ్ ఆన్లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్ డాట్ కామ్ మరియు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్ల వద్ద జూలై 13, మధ్యాహ్నం 12 గంటల నుంచి లభ్యమవుతుంది.పరిచయ ఆఫర్‌గా వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్‌పై ప్రీపెయిడ్ లావాదేవీలను జరిపిన ఎడల 1000 రూపాయల తగ్గింపును పొందవచ్చు. ‘‘గెలాక్సీ ఎఫ్22ను భారతదేశంలో యువ జెన్ జెడ్ మరియు మిల్లీనియల్ వినియోగదారుల కోసం రూపకల్పన చేశారు. ఈ తరం సమగ్రమైన స్మార్ట్‌ఫోన్‌ను కోరుకుంటున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ తమ ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే జీవనశైలికి అనుగుణంగా ఉండాలనుకుంటున్నారు. గెలాక్సీ ఎఫ్ సిరీస్ స్మార్ట్ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత విజయవంతమైన స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లలో ఒకటి. ఫుల్ ఆన్ బ్లాక్‌బస్టర్ గెలాక్సీ ఎఫ్22తో , మేము గెలాక్సీ ఎఫ్ శ్రేణిని మరింతగా విస్తరించడంతో పాటుగా మా ‘ఫుల్ ఆన్’ వారసత్వాన్ని మరిన్ని నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నాం. గెలాక్సీ ఎఫ్22స్మార్ట్ఫోన్లు తమ విభాగంలో అత్యుత్తమ ప్రమాణాలు – అత్యద్భుతమైన 6.4 అంగుళాల హెచ్డీ+ ఎస్ అమోలెడ్ డిస్ప్లేను 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉండటంతో పాటుగా భారీ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ మరియు అసలైన 48 మెగా పిక్సెల్ క్వాడ్ కెమెరాతో వస్తుంది’’అని ఆదిత్య బబ్బర్, సీనియర్ డైరెక్టర్ అండ్ హెడ్– మొబైల్ మార్కెటింగ్, శాంసంగ్ ఇండియా అన్నారు. అరీఫ్ మొహమ్మద్, సీనియర్ డైరెక్టర్– మొబైల్స్, ఫ్లిప్‌కార్ట్ మాట్లాడుతూ ‘‘ ఇటీవలికాలంలో వినియోగదారులు తమ స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్న తీరులో గణనీయమైన మార్పులను మేము చూస్తున్నాం. వీడియో వినియోగం పరంగా గణనీయంగా వృద్ధి కనిపిస్తుంది. ఎస్‌అమోలెడ్ డిస్ప్లేతో, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 22 ఇప్పుడు వినియోగదారుల అనుభవాలను మరింతగా వృద్ధి చేయనుంది. మరీ ముఖ్యంగా తమ స్మార్ట్ఫోన్లను ప్రొఫెషనల్, అభ్యాస కారణాల కోసం వినియోగిస్తున్న పరిస్ధితిలలో మరింత మెరుగైన అనుభవాలను అందించనుంది. ఈ ఆవిష్కరణ, దేశ వ్యాప్తంగా వినియోగదారులకు అత్యుత్తమ సాంకేతికతను అందించాలనే మా లక్ష్యంకు అనుగుణంగా ఉంది’’ అని అన్నారు.
బ్లాక్‌బస్టర్ డిస్ప్లే
గెలాక్సీ ఎఫ్22 స్మార్ట్ఫోన్లు, డిస్ప్లే పరంగా భారీ ఆధునీకరణలతో వస్తుంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మరియు 6.4 అంగుళాల హెచ్డీ+ సూపర్ అమోలెడ్ ఇన్ఫిరిటీ యు స్ర్కీన్ ఉన్నాయి. గెలాక్సీ ఎఫ్22 ఇప్పుడు సామాజిక మాధ్యమాలపై అమితాసక్తిని కనబరిచే జెన్ జెడ్ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఇది అత్యంత మృదువుగా తమ సోషల్ మీడియా ఫీడ్‌ను వినియోగించుకునేందుకు అనుమతించడంతో పాటుగా బింగీ వాచర్స్ తమ అభిమాన కంటెంట్‌ను ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రయాణ సమయాలలో సైతం చూసేందుకు అనుమతిస్తుంది. గెలాక్సీ ఎఫ్22పై 600 నిట్స్ హై బ్రైట్నెస్ మోడ్ లీనమయ్యే వీక్షణ అనుభవాలను అత్యంత ప్రకాశవంతమైన సూర్యకాంతిలో సైతం అందిస్తుంది. ఈ డిస్ప్లేను కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షిస్తుంది. ఇది గీతలు, పగుళ్లను సైతం నివారిస్తుంది. గెలాక్సీ ఎఫ్22లో డాల్బీ అట్మాస్ ఫీచర్ ఉంది. ఇది అత్యద్భుతమైన ఆడియో మరియు సినిమాటిక్ వీక్షణ అనుభవాలకు మద్దతునందిస్తుంది.
బ్లాక్‌బస్టర్ బ్యాటరీ పనితీరు
గెలాక్సీ ఎఫ్22 స్మార్ట్ఫోన్లు భారీ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ మరియు ఇన్ బాక్స్ 15 వాట్ యుఎస్బీ–సీ చార్జర్త వస్తుంది. ఇది 25 వాట్ల చార్జింగ్కు కూడా మద్దతునందిస్తుంది. ఈ ఫోన్ 130 గంటల మ్యూజిక్ ప్లే బ్యాక్, 40 గంటల టాక్ టైమ్, 25 గంటల వీడియో ప్లే బ్యాక్ మరియు 24 గంటల ఇంటర్నెట్ వినియోగ సమయానికి మద్దతునందిస్తుంది.
అత్యాధునిక ఆక్టాకోర్ మీడియా టెక్ హెలియో జీ80 ప్రాసెసర్‌తో శక్తివంతమైన గెలాక్సీ ఎఫ్22 గరిష్ట పనితీరుకు మద్దతునందించడంతో పాటుగా మృదువైన మల్టీ టాస్కింగ్ మరియు తగ్గించిన ఇంధన వినియోగానికి మద్దతునందిస్తుంది. అదే సమయంలో బహుళ యాప్స్ బ్రౌజింగ్, వినియోగానికీ తోడ్పాటునందిస్తుంది.
బ్లాక్‌బస్టర్ 48 మెగా పిక్సెల్ క్వాడ్ కెమెరా
గెలాక్సీ ఎఫ్22 లో అత్యున్నత శ్రేణి 48 మెగా పిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇది జెన్ జెడ్ మరియు మిల్లీనియల్ వినియోగదారుల అవసరాలను తీరుస్తుంది. ఇది ప్రయాణ సమయంలో కూడా మరుపురాని క్షణాలను ఒడిసిపట్టుకునేందుకు తోడ్పడుతుంది. వెనుక వైపు గెలాక్సీ ఎఫ్22 స్మార్ట్‌ఫోన్‌లో అసలైన 48 మెగా పిక్సెల్ కెమెరా, ఐసోసెల్ ప్లస్ టెక్నాలజీతో ఉంటుంది మరియు జీఎం2 సెన్సార్ సైతం దీనిలో ఉండటం వల్ల అత్యద్భుతమైన స్పష్టతతో సవివరమైన షాట్స్నూ చిత్రిస్తుంది. దీనిలో 8 మెగా పిక్సెల్ అలా్ట్రవైడ్ లెన్స్ ఉంది. ఇది 123 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూను కలిగి ఉంది. ఇది చిత్రాలకు మరింత దృష్టికోణం అందిస్తే, 2మెగా పిక్సెల్ మ్యాక్రో లెన్స్ సవివరమైన క్లోజప్ షాట్స్‌ను తీసేందుకు మద్దతునందిస్తుంది. దీనిలోని 2 మెగా పిక్సెల్ డెప్త్ కెమెరా, లైవ్ ఫోకస్‌తో రావడంతో పాటుగా అత్యద్భుతమైన పోట్రెయిట్ షాట్స్‌ను సైతం అందిస్తుంది.
గెలాక్సీ ఎఫ్22 స్మార్ట్‌ఫోన్ 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఇది ప్రకాశవంతమైన, స్పష్టమైన సెల్ఫీలను తీసుకోవడంలో సహాయపడుతుంది. గెలాక్సీ ఎఫ్22లో పలు కెమెరా మోడ్స్ అయినటువంటి హైపర్‌లాప్స్, స్లో మోషన్, ఫుడ్ మోడ్, ప్రో మోడ్, ఏఆర్ జోన్ వంటివి ఉన్నాయి. ఇవి వినియోగదారులు గతంలో ఎన్నడూ లేని రీతిలో తమను తాము వ్యక్తీకరించుకునేందుకు తోడ్పడతాయి.
బ్లాక్‌బస్టర్ సాఫ్ట్వేర్
గెలాక్సీ ఎఫ్22 స్మార్ట్ఫోన్లు ఆండ్రాయిడ్ 11 మరియు ఒన్ యుఐ 3.1 ఔట్ ఆఫ్ ద బాక్స్‌కు మద్దతునందిస్తాయి. ఇవి వినియోగదారుల అనుభవాలను మరో దశకు తీసుకువెళ్లేలా ఆకట్టుకునే డిజైన్, వృద్ధి చేయబడిన అనుకూలీకరణ, అసాధారణ నియంత్రణ ఫీచర్లను అందిస్తుంది. ఇవన్నీ కూడా మీరు మరింతగా చేసేందుకు తోడ్పడతాయి. ఈ స్మార్ట్‌ఫోన్ , శాంసంగ్ పే మినీకి సైతం మద్దతునందిస్తుంది.
మెమరీ వేరియంట్స్, ధర, లభ్యత మరియు ఆఫర్లు
గెలాక్సీ ఎఫ్22 ను రెండు మెమరీ వేరియంట్లు – 4జీబీ+64జీబీ మరియు 6జీబీ+128 జీబీలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా 12,499 రూపాయలు మరియు 14,499రూపాయలు. గెలాక్సీ ఎఫ్22 స్మార్ట్‌ఫోన్ రెండు ఆకర్షణీయమైన రంగులు–డెనిమ్ బ్లూ మరియు డెనిమ్ బ్లాక్‌లో లభిస్తుంది.