Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఎప్సిలాన్ కార్బన్ ప్రైవేట్ లిమిటెడ్ (ECPL), ఇండియా యొక్క ప్రముఖ కోల్ తార్ డిరైవేట్స్ కంపెనీ, బళ్లారి, కర్ణాటక లో ఇండియా లోని మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ కార్బన్ బ్లాక్ కాంప్లెక్స్ ని స్థాపించింది. సంవత్సరానికి 115,000 టన్నుల సామర్థ్యం (TPA) తో, ఈ కార్బన్ బ్లాక్ యూనిట్ తన కార్యకలాపాలను విజయవంతంగా ప్రారంభించి. ఇప్పటికే తన పూర్తి సామర్థ్యానికి సమీపంగా పని చేస్తూ ఉంది. ఈ ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ గ్లోబల్ స్థాయిలో టైర్లు, నాన్-టైర్ రబ్బర్ మరియు ప్లాస్టిక్ మాస్టర్ బ్యాచ్ పార్టనర్లు కొరకు ట్రెడ్ మరియు ASTM కార్బన్ బ్లాక్స్ యొక్క కార్కాస్ గ్రేడ్స్ రెండూ ప్రొడ్యూస్ చేస్తున్నది. కొత్తగా ప్రారంభించబడిన ఈ కాంప్లెక్స్, ముడి పదార్థాల సోర్సింగ్ పూర్తి బ్యాక్ వార్డ్ ఇంటిగ్రేషన్ సపోర్ట్ అందించుట ద్వారా సహజసిద్ధమైన కాంపిటీటివ్ ప్రయోజనం కలిగి ఉంది. కోల్ తార్ డిస్టిలేషన్ ప్రోసెస్ ఉత్పత్తి జరిగిన యాంథ్రాసిన్ ఆయిల్ ని కార్బన్ బ్లాక్ యూనిట్ లో క్లీన్ ఫీడ్ స్టాక్ గా ఉపయోగించ బడుతుంది. ముడి పదార్థాల సెక్యూరిటీ మరియు మరియు ఫీడ్ స్టాక్ నాణ్యత లోని ఈ సానుకూలత, ECPL కు టైర్ మరియు మెకానికల్ రబ్బర్ గూడ్స్ అప్లికేషన్ కొరకు డిజైన్ చేయబడిన కన్సిస్టంట్ క్వాలిటీ కార్బన్ బ్లాక్ ప్రొడ్యూస్ చేయటానికి సహాయపడుతున్నవి. ఈ ఇంటిగ్రేటెడ్ కార్బన్ కాంప్లెక్స్ ఇండియా లో ఈ రకం మొట్టమొదటి నిర్మాణ ఫెసిలిటీ. ఇది స్టీల్ ప్లాంట్ నుండి వేస్ట్ కోక్ వోవెన్ గ్యాస్ ను ఫ్యూయెల్ రూపంలో మరియు కార్బన్ బ్లాక్ యూనిట్ నుండి వచ్చే టైల్-గ్యాస్ ను స్టీల్ కాంప్లెక్స్ కు ప్రీ-హీటింగ్ ఆపరేషన్స్ కొరకు తిరిగి ఫీడ్ బ్యాక్ చేయుట జరుగుతుంది. హై సల్ఫర్ ఫీడ్ స్టాక్ (3% సల్ఫర్) ఉపయోగించే ఇతర ప్లాంట్స్ తో పోల్చి చూసినప్పుడు, ఈ యూనిట్ క్యాప్టివ్ లో-సల్ఫర్ ఫీడ్ స్టాక్ (0.3-0.5% సల్ఫర్) ఉపయోగిస్తుంది. ఈ ప్రమాణాలు అన్నిటి ద్వారా, ఈ కార్బన్ ప్లాంట్ తక్కువ SOx/NOx మరియు CO2 ఎమిషన్స్ లో కొత్త బెంచ్ మార్క్ ప్రమాణాలు స్థాపించి,. దీనిని అత్యున్నత పర్యావరణ ప్రధానమైన మరియు అత్యుత్తమ శ్రేణి గా గుర్తింపు పొందింది. ఫేజ్ 2 ప్లాన్స్ లో భాగంగా, ఎప్సిలాన్ రూ. 350 కోట్ల అదనపు పెట్టుబడితో మరో 65,000TPA కు తన సామర్థ్యాన్ని విస్తరించుకో బోతున్నది, దీని ద్వారా మొత్తం పెట్టుబడిని రూ. 900 కోట్లకు చేరుతుంది. ఎప్సిలాన్ కార్బన్ బ్లాక్ యొక్క సామర్థ్యాన్ని అనంతరం మొత్తం 300,000 TPA కు విస్తరించాలని ప్లాన్ చేసింది, ఇలా ఇండియా లో పూర్తి సామర్థ్యం కలిగిన ఒక అతిపెద్ద సింగిల్ లొకేషన్ కార్బన్ బ్లాక్ ప్లాంట్ గా రూపొంది, కస్టమర్లకు ధర సామర్థ్యం మరియు సానుకూలమైన నాణ్యత అందిస్తున్నది. కార్బన్ బ్లాక్ బిజినెస్ ప్రాస్పెక్ట్స్ గురించి మాట్లాడుతూ. శ్రీ విక్రమ్ హాండా, ఎప్సిలాన్ కార్బన్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఇలా అన్నారు, “ ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు స్థిరంగా పెరుగుతున్నవి, రాబోయే కొన్ని సంవత్సరాలలో టైర్, మెకానికల్ రబ్బర్ గూడ్స్ మరియు ఇండస్ట్రియల్ ప్లాస్టిక్ రెండు రంగాలలో మన అనేక సదవకాశాలు చూడబోతున్నాం. నేటి ప్రపంచ వ్యాప్త సప్లై చైన్ లో, కస్టమర్లు లోకలైజేషన్ కొరకు చూస్తున్నారు మరియు ఎప్సిలాన్ కార్బన్ ఉత్తమ నాణ్యత కలిగిన ఉత్పాదనలను పెరుగుతున్న డిమాండ్ కు అనుకూలంగా అదించుటకు చక్కని పొజిషన్ లో ఉన్నది. ఎప్సిలాన్ కార్బన్ ఇప్పుడు REACH లో ఒక రిజిస్టర్డ్ బాడీ అని, ఇది మా ఉత్పాదనలు సురక్షితమైనవాటిలో ఒకటి అని సర్టిఫై చేస్తూ, మా క్వాలిటీ ఉత్పాదనలు అందుకొనుటకు మా యూరోపియన్ పార్టనర్లకతు యాక్సెస్ అందిస్తున్నదని చెప్పటానికి మేము ఆనందిస్తున్నాము. మా కస్టమర్లు నిరంతరమైన ఉత్పాదన నాణ్యత, వివిధ వినియోగాలలో శ్రేష్ఠమైన కార్యదక్షత మరియు ఇతర ప్రయోజనాలు అందుతాయని సునిశ్చిత పర్చుటకు, మా కంపెనీ వివిధ సర్టిఫికేట్లుతో ప్రమాణితం చేయబడినది. ఈ కంపెనీ గ్లోబల్ మార్కెట్లుకు సేవలు అందించుట మీద కేంద్రీకృతం అయినది మరియు ముప్పైకి పైగా భాగస్వాములతో చేతులు కలిపింది, కాబట్టి వారి ద్వారా స్థానిక సర్వీస్, వేర్ హౌసింగ్ మరియు లాజిస్టిక్ సపోర్ట్ అందుకుని, మా కస్టమర్లకు సకాలంలో డెలివరీ అందజేయగలం.