Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రపంచంలో అతిపెద్ద లాక్ స్ర్కీన్ ఆధారిత కంటెంట్ ప్రదాత మరియు వీడియో వేదిక రొపోసో యజమాని అయిన గ్లాన్స్ నేడు తాము భారతదేశంలో అతిపెద్ద టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ మరియు పాప్ కల్చర్ మార్కెట్ ప్లేస్ కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్‌వర్క్‌తో భాగస్వామ్యం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఉమ్మడి భాగస్వామ్య కంపెనీ ‘గ్లాన్స్ కలెక్టివ్’ ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద డిజిటల్ క్రియేటర్లతో భాగస్వామ్యం చేసుకుని పలు విభిన్నమైన బ్రాండ్లను నిర్వహించడంతో పాటుగా సహసృష్టించనుంది. దీనిలో టాప్ సెలబ్రిటీలు మరియు సోషల్‌మీడియా ఇన్ల్ఫూయెన్సర్లు సైతం భాగంగా ఉంటారు. భారతదేశంలో ఈ తరహా వ్యూహాత్మక భాగస్వామ్యం తొలిసారి. దీనిలో అంతర్జాతీయ కంటెంట్, క్రియేటర్ మరియు వాణిజ్య వేదిక ఇప్పుడు సుప్రసిద్ధ టాలెంట్ మేనేజ్మెంట్ నెట్‌వర్క్‌తో భాగస్వామ్యం చేసుకుంది. ఈ ఉమ్మడి సంస్థ గ్లాన్స్ మరియు రొపోసో సాంకేతికత మరియు అంతర్జాతీయ చేరికపై ఆధారపడటంతో పాటుగా సెలబ్రిటీ మరియు ప్రభావిత ప్రపంచాన్ని లోతుగా అర్థం చేసుకోవడంలో కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్వర్క్ యొక్క నైపుణ్యంపై ఆధారపడుతుంది. ఈ నూతన సంస్థ, ఆదాయ సంపాదన పరంగా క్రియేటర్లకు భారీ అవకాశాలను బ్రాండ్ల యొక్క పాక్షిక యాజమాన్యం ద్వారా అందిస్తుంది. అదే సమయంలో గ్లాన్స్ మరియు రొపోసో యొక్క సమ్మిళిత ప్రపంచ వ్యాప్త వినియోగదారులో అంతర్జాతీయ మార్కెట్లను చేరుకునే అవకాశం అందిస్తుంది. ‘‘సమ్మిళిత బలాల సమాహారం గ్లాన్స్ కలెక్టివ్. ఇది విజయవంతమైన వినియోగదారు బ్రాండ్లను ఉత్పత్తి చేయడంలో సృష్టికర్తలకు పెద్ద ఎత్తున వ్యవస్ధాపక అవకాశాలను భారీ స్థాయిలో అందిస్తుంది. క్రియేటర్ ఆధారిత, డిస్కవరీ ఆధారిత ప్రత్యక్ష వాణిజ్యం కోసం వినూత్నమైన పర్యావరణ వ్యవస్థను మేము సృష్టిస్తున్నాం మరియు కలెక్టివ్ తో మా భాగస్వామ్యం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లో మమ్మల్ని అగ్రగాములుగా నిలుపనుంది అని నమ్ముతున్నాం’’ అని పియూష్ షా, కో–ఫౌండర్, ఇన్‌మొబి మరియు అధ్యక్షులు–సీఓఓ–గ్లాన్స్ అన్నారు.
భారతదేశంలో ఇది ఇంకా ఆరంభ దశలోనే ఉన్నప్పటికీ, క్రియేటర్ ఆధారిత, ఇంటరాక్టివ్ మరియు లైవ్ కామర్స్ అనేది 2025 నాటికి 40 బిలియన్ డాలర్ల అవకాశంగా నిలువనుందని అంచనా. ఈ నమూనా ఇప్పటికే అసాధారణ విజయాన్ని చైనాలో చూసింది. అక్కడ దేశపు మొత్తం ఈ–వాణిజ్యం మార్కెట్లో దాదాపు 20% వాటాను పొందింది. గ్లాన్స్ కలెక్టివ్ ఈ అభివృద్ధి చెందుతున్న షాపింగ్ విధానంపై ఆధారపడటంతో పాటుగా తమ బ్రాండ్ల అమ్మకాలను వృద్ధి చేస్తుంది. మరీ ముఖ్యంగా గ్లాన్స్ లాక్ స్ర్కీన్, రొపోసో యాప్‌పై ఇది చేస్తుంది. ఈ ఉత్పత్తులు లైఫ్‌స్టైల్, హోమ్, ఫ్యాషన్, అప్పెరల్, బ్యూటీ, ఫిట్నెస్ వంటి విభాగాలలో లభిస్తున్నాయి. గ్లాన్స్ కలెక్టివ్‌లో వినూత్నంగా నిలిచే అంశమేమిటంటే, క్రియేటర్లు తమ సొంత వ్యక్తిత్వం ప్రతిబింబించేలా ఉత్పత్తులను ఆవిష్కరించడం, వ్యాప్తి చెందడం మరియు బ్రాండ్లను సహ సొంతం చేసుకోవడం. ‘‘గ్లాన్స్ కలెక్టివ్ ను ఇన్ఫ్లూయెన్సర్ల కోసం అంకితం చేయడం జరుగుతుంది. ఇన్ఫ్లూయెన్సర్ బ్రాండ్లకు అత్యుత్తమ నిలయంగా ఇది నిలువనుంది. ఇన్ఫ్లూయెన్సర్ ఆర్ధిక వ్యవస్థ మరియు పాప్కల్చర్ను వాణిజ్యం ద్వారా ప్రభావితం చేస్తుంది’’ అని విజయ్ సుబ్రమణియం, గ్రూప్ సీఈఓ అండ్ కో–ఫౌండర్, కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్వర్క్ అన్నారు. ‘‘మా ఉమ్మడి విలువ ప్రతిపాదన ప్రభావవంతంగా వినియోగదారులకు మరియు నిరంతరం వృద్ధి చెందుతున్న ఇన్ఫ్లూయెన్సర్స్ కమ్యూనిటీకి ప్రయోజనం కలిగించనుంది’’ అని సుబ్రమణియం జోడించారు. ఈ నెలారంభంలో గ్లాన్స్, తాము ఫుల్ స్టాక్ ఈ–కామర్స్ సంస్ధ షాప్ 101ను ఇన్ఫ్లూయెన్సర్ మరియు సెలబ్రిటీ ఆధారిత మొబైల్ వాణిజ్య రంగంలో ప్రవేశం కోసం సొంతం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ విస్తృత స్థాయి సమగ్రమైన సరఫరా చైన్ మరియు సాంకేతికాధారిత వేదిక ఈ ఎక్వైజేషన్ ద్వారా ప్రయోజనం పొందడంతో పాటుగా గ్లాన్స్ కలెక్టివ్‌కు నిర్వహణ మద్దతును సైతం అందిస్తుంది.
మాన్సిజైన్, జనరల్ మేనేజర్, రొపోసో అండ్ కామర్స్ –గ్లాన్స్ మాట్లాడుతూ ‘‘భారీ సంఖ్యలో అభిమానులు కలిగిన వందలాది మంది క్రియేటర్లు ఉన్నారు కానీ తమ సొంత బ్రాండ్లను ఆవిష్కరించుకునేందుకు వారికి తగిన వనరులు లేవు. గ్లాన్స్ కలెక్టివ్ ఇప్పుడు ఆ తరహా క్రియేటర్లు తమ సొంత లేబుల్స్ సృష్టించుకోవడం ద్వారా తమ గుర్తింపును నిర్మించుకునేందుకు తోడ్పడనుంది. ప్రస్తుతం దేశంలో ఈ తరహాలో భారీ స్దాయిలో చేసే వేదికలేవీ లేవు’’ అని అన్నారు. కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్‌వర్క్‌కు టాలెంట్ మేనేజ్మెంట్ మార్కెట్లో 70%కు పైగా వాటా ఉంది. దీని క్లయింట్స్ జాబితాలో ఏ–లిస్ట్ సెలబ్రిటీలు పాప్ సంస్కృతి వ్యాప్తంగా ఉన్నారు. వీరిలో బాలీవుడ్, దక్షిణ భారత వినోద పరిశ్రమ తో పాటుగా అగ్రశ్రేణి సోషల్/డిజిటల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు సైతం ఉన్నారు. గ్లాన్స్‌కు 125 మిలియన్ డెయిలీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. భారతదేశంతో పాటుగా ఆగ్నేయాసియాలో 8కు పైగా భాషలలో వీరు తమ కంటెంట్‌ను అందిస్తున్నారు. అగ్రశ్రేణి లఘు వీడియో ప్రతిభా వేదిక రొపొసో. ఇప్పటికే 100 మిలియన్లకు పైగా డౌన్లోడ్స్ దీనికి జరిగాయి. ఇది 12 భాషలలో కంటెంట్‌ను అందిస్తుంది.