Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కోవిడ్ వచ్చినప్పటినుంచి అన్ని సహాయక చర్యల్లో పాలుపంచుకుంటూ అన్ని సంస్థలకు ఆదర్శంగా నిలుస్తోంది ఉబర్. ఇప్పటికే ఎన్నో కోవిడ్ సేవా కార్యక్రమాలను చేపట్టిన ఉబర్… తాజాగా కోవిడ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటున్న అల్పాదాయ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. కోవిడ్‌తో చాలా కుటుంబాల తమ ఆదాయాన్ని కోల్పోయాయి. దీంతో.. గివ్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఉబర్… కోవిడ్ వల్ల ఆదాయం కోల్పోయిన అల్పాదాయ కుటుంబాలకు రూ.30,000ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. సెకండ్ వేవ్ తర్వాత కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కునేందుకు గ్లోబల్ ఎంప్లాయి కంట్రిబ్యూషన్స్ ద్వారా ఉబర్… ఇప్పటివరకు రూ.49 లక్షలను సేకరించింది. ఇప్పుడు ఈ మొత్తానికి మరో రూ. 37 లక్షల అదనంగా చేర్చడం ద్వారా రూ.86 లక్షలను కోవిడ్‌తో ఆర్థిక వనరుల్ని కోల్పోయిన అల్పాదాయ కుటుంబాలకు అందించనుంది ఉబర్. ఉబర్ … ఎన్టీవో అయినటువంటి గివ్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ గివ్ ఇండియా సంస్థ… సెకండ్ వేవ్‌లో ఆదాయాల్ని కోల్పోయిన కుటుంబాలను గుర్తిస్తుంది. అంతేకాకుండా సదరు కుటుంబాలకు డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఉబర్ నుంచి వచ్చిన విరాళాలు ఇప్పుడు వేలాది కుటుంబాల అవసరాలను తీర్చడానికి సహాయపడతాయి. అంతేకాకుండా పిల్లలకు విద్యా ఖర్చులు, తద్వారా జీవితాలను పునరుద్ధరించడానికి మరియు పునర్నిర్మించడానికి ఉపయోగపడతాయి. ఈ సందర్భంగా ఉబర్ ఇండియా మరియు సౌత్ ఆసియా అధ్యక్షుడు ప్రభ్‌జీత్ సింగ్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ఉబర్‌లో విరాళం అనేది ప్రతీ ఇంటి నుంచి మొదలువుతుంది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఒక్కటే... సెకండ్ వేవ్‌లో విరాళం ద్వారా సాయం అందించిన ప్రతీ ఉద్యోగికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. వారి వల్లే ఇదంతా సాధ్యమైంది. ప్రతీ కోవిడ్ మరణం.. ప్రతీ కుటుంబానికి విషాదాంతమే. ఈ మహమ్మారి నుంచి ప్రతీ కుటుంబం కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. అదే సమయంలో ఇలాంటి సమయంలో వారిని ఆర్థిక కష్టాలు కూడా చుట్టుముడతాయి. ఇప్పుడు గివ్ ఇండియా ద్వారా మేము అందిస్తున్న విరాళాలు ఆదాయం కోల్పోయిన కుటుంబాలకు ఎంతో కొంత ఉపయోగపడతాయి. రాబోయే రోజుల్లో కూడా వనరులను సమీకరించడంలో మా నెట్వర్క్ కృషి చేస్తుంది మరియు భారతదేశాన్ని తిరిగి పునర్ నిర్మించడానికి ఉబర్ సహాయపడుతుంది అని అన్నారు ఆయన. ఈ సందర్భంగా గివ్ఇండియా సీఈఓ అతుల్ సటిజ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ… ఈ మహమ్మారి భారీ నష్టాన్ని కలిగించింది. ఇది ఏ ప్రభుత్వం లేదా సంస్థ పరిష్కరించలేనిది. ఈ సమస్య పరిష్కారానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి. కోవిడ్‌తో ఇంట్లో సంపాదన మార్గాలను కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఉబర్ మరియు దాని ఉద్యోగులు కలిసి అందించిన ఈ విరాళం ఎంతో ప్రత్యేకమైనది. ఇందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇది వేలాది మంది జీవితాలను ప్రభావితం చేస్తుంది అని అన్నారు. ఏప్రిల్ 2021లో, గివ్ ఇండియా.. ఇండియా కోవిడ్ రెస్పాన్స్ ఫండ్-2ని ఏర్పాటు చేసింది. ఈ ఫండ్ ద్వారా వనరులను సమీకరిస్తుంది. ఈ వనరుల ద్వారా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వడం, మహమ్మారి బారిన పడిన అల్పాదాయ కుటుంబాలకు ఆహారం మరియు నగదు రూపంలో మానవతా సహకారాన్ని అందించడం చేస్తున్నారు. అంతేకాకుండా కోవిడ్ రెండో వేవ్ నుంచి కమ్యూనిటీలు కోలుకోవడంలో ఉబర్ నిబద్ధతగా పనిచేస్తోంది. ఇందుకోసం... ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లు మరియు ఇతర క్లిష్టమైన రవాణాను సులభతరం చేసింది. వీటితోపాటు COVID సహాయక చర్యలలో పాల్గొన్న ఎన్టీఓలకు మద్దతుగా రూ.3.65 కోట్ల ఉచిత రైడ్స్‌ను అందించింది