Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆర్థిక సంవత్సరం (2020-21)లో 24 లక్షల చదరపు అడుగుల గిడ్డంగి లీజింగ్ (అద్దె) కార్యకలాపాలను నమోదు చేసిందని ఇంటర్నేషనల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ తెలిపింది. 'ఇండియా వేర్‌హౌసింగ్ మార్కెట్ రిపోర్ట్ 2021' ప్రకారం.. ఇంతకు ముందు ఏడాదిలో పోల్చితే 30 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. ఈ పతనానికి కరోనా సంక్షోభం, ఆర్థిక మందగమనం ప్రధాన కారణమని తెలిపింది. మొత్తం గిడ్డంగుల లీజు వ్యాపారంలో ఈ కామర్స్ రంగం 54 శాతం వాటాను కలిగి ఉందని తెలిపింది. ''గిడ్డంగిలో హైదరాబాద్ లావాదేవీల పరిమాణాలు గత సంవత్సరం నుండి తగ్గాయి. మార్కెట్లపై కోవిడ్ -19 ప్రభావం డిమాండ్‌కు అంతరాయం కలిగించింది'' అని నైట్ ఫ్రాంక్ ఇండియా హైదరాబాద్ బ్రాంచ్ డైరెక్టర్ సామ్సన్ అర్థూర్ పేర్కొన్నారు.