Authorization
Mon Jan 19, 2015 06:51 pm
· ఆండ్రాయిడ్ టీవీ మోడల్‌లు 4 విభిన్న వేరియంట్లు-32-అంగుళాలు, 42-అంగుళాలు, 43-అంగుళాలు, 55-అంగుళాల్లో
· ఈ ఉత్పత్తులు జులై 10 అనంతరం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో
హైదరాబాద్: జర్మనీకి చెందిన వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ జెయింట్ బ్లావ్‌పంక్ట్ నాలుగు ‘మేడ్-ఇన్-ఇండియా’ ఆండ్రాయిడ్ టీవీ మోడళ్లను భారతదేశంలో నేడు విడుదల చేసింది. ఈ బ్రాండ్ భారతదేశపు కాంట్రాక్ట్ ఉత్పత్తిదారుడు సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (SPPL)తో ప్రత్యేక లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. లైసెన్సింగ్ ఒప్పందం ప్రకారం బ్లావ్‌పంక్ట్ ఉత్పత్తి, బ్రాండింగ్, డిజైనింగ్, ప్యాకేజింగ్ మరియు రిటైలింగ్ పంపిణీ శ్రేణిని 30 ఏళ్ల నుంచి స్థానికంగా వృద్ధి చెందిన బ్రాండ్ల ఉత్పత్తిదారుడు SPPL నిర్వహించనుంది. ఈ ఉత్పత్తులు వినియోగదారులకు జులై 10 తరువాత భారతదేశంలో స్థానికంగా వృద్ధి చెందిన ఇ-కామర్స్ మార్కెట్‌ప్లేస్ ఫ్లిప్‌కార్ట్‌లో లభించనున్నాయి.
రూ.14,999 నుంచి ప్రారంభమయ్యే నాలుగు ఆండ్రాయిడ్ టీవీ మోడళ్లలో 32-అంగుళాల హెచ్.డి. రెడీ సైబర్ సౌండ్ ఆండ్రాయిడ్ టీవీ., 42-అంగుళాల ఎఫ్.హెచ్.డి. ఆండ్రాయిడ్ టీవీ, 43-అంగుళాల సైబర్ సౌండ్ 4కె ఆండ్రాయిడ్ టీవీ మరియు 55-అంగుళాల 4కె ఆండ్రాయిడ్ టీవీ ఉన్నాయి. అలాగే రూ.14,999 ధరలో లభించే 32-అంగుళాల ఎడిషన్ ఆండ్రాయిడ్ 9ను కలిగి ఉండగా, ఇది బెజెల్-లెస్‌గా 40W స్పీకర్ ఔట్పుట్, ఎడ్జ్-ఫీ సౌండ్ టెక్నాలజీ, 2 స్పీకర్లు మరియు 1జిబి ర్యామ్ మరియు 8జిబి రోమ్ లలితమైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. దీనిలో రూ.21,999 ధరలో లభించే 42-అంగుళాల ఎఫ్‌హెచ్‌డి ఆండ్రాయిడ్ టీవీ ఆండ్రాయిడ్ 9ను కలిగి ఉంది. దీనిలో అల్ట్రా-థిన్ బెజెల్, 40W స్పీకర్ ఔట్పుట్, ఎడ్జ్-ఫ్రీ సౌండ్ సాంకేతిక, 2 స్పీకర్లు, 1జిబి ర్యామ్, 8జిబి రోమ్ కలిగి ఉంది. ఈ బ్రాండ్ రూ.30,999 ధరలో లభించే 43-అంగుళాల 4కె టీవీకి 50W స్పీకర్ ఔట్‌పుట్‌ను అలవర్చగా అది బెజెల్-లెస్‌గా ఉంటుంది. దీనిలో డాల్బి డిజిటల్ ప్లస్, డిటిఎస్ ట్రూ సరౌండ్ ప్రమాణీకృతమైన ఆడియో 4 అద్భుత స్పీకర్లతో, డాల్బి ఎంఎస్ 12 సాంకేతికతను వినియోగించగా, అది డాల్బి అట్మాస్ డీకోడ్ చేస్తుంది మరియు మరింత మెరుగైన డాల్బి అట్మాస్, డాల్బీ డిజిటల్ పవర్డ్ సౌండ్ సాంకేతికతను అందిస్తుంది. ఈ మోడల్లో ఆండ్రాయిడ్ 10తో మరియు ఇన్‌బిల్ట్‌గా 2జిబి ర్యామ్ మరియు 8జిబి రోమ్ను కలిగి ఉంది. రూ.40,999 ధరలో అందుబాటులోకి వచ్చిన ప్రత్యేకమైన 55-అంగుళాల మోడల్ బెజెల్-లెస్‌గా, 60W స్పీకర్ ఔట్‌పుట్‌ను డాల్బి డిజిటల్ ప్లస్‌తో తయారుగా ఉండే శబ్దపు సాంకేతికతలు, డిటిఎస్ ట్రూసరౌండ్ సర్టిఫైడ్ ఆడియో, డాల్బి ఎంఎస్ 12 సాంకేతికతను వినియోగించగా, అది డాల్బి అట్మాస్ డీకోడ్ చేస్తుంది మరియు మరింత మెరుగైన డాల్బి అట్మాస్, డాల్బీ డిజిటల్ పవర్డ్ సౌండ్ సాంకేతికతను అందిస్తుంది. ఈ మోడల్లో ఆండ్రాయిడ్ 10తో మరియు ఇన్‌బిల్ట్‌గా 2జిబి ర్యామ్ మరియు 8జిబి రోమ్ను 43-అంగుళాల ఎడిషన్ తరహాలో 4 స్పీకర్లను కలిగి ఉంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, అన్ని మోడళ్లూ 5.0 బ్లూటూత్, 2యుఎస్బి పోర్ట్‌లు, 3 హెచ్డిఎంఐ పోర్టులు వాయిస్ ఎనేబుల్డ్ రిమోట్ మరియు ఎంఆర్ఎం కార్టెక్స్ ప్రాసెసర్లను కలిగి ఉంటాయి.
దేశ వ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు అత్యాధునిక ‘మేడ్ ఇన్ ఇండియా’ టీవీలను వారి ఇంటి వాకిలి వద్ద ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటు ధరలో, సురక్షితంగా, ఆరోగ్యకరమైన విధానాల్లో పొందవచ్చు. భారతదేశంలో బ్లావ్‌పంక్ట్ ప్రత్యేక బ్రాండ్ లైసెన్సీ కావడం గురించి ఉత్సుకతతో ఉన్న సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (SPPL) సీఈఓ అవ్నీత్ సింగ్ మార్వా మాట్లాడుతూ ‘‘జర్మనీకి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన అలానే చక్కగా గుర్తించబడిన వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ జెయింట్ బ్లావ్పంక్ట్ను భారతదేశంలో అందుబాటులోకి తీసుకురావడం సంతోషాన్ని కలిగిస్తుంది. బ్లావ్‌పంక్ట్ అడుగు జాడలు మరియు భారతదేశంలో ఆండ్రాయిడ్ టీవీల విడుదలతో మేము మా ‘ఆత్మనిర్భర భారత్’ లేదా స్వావలంబి భారతదేశపు ఆ వేగాన్ని అనుసరించేందుకు కట్టుబడి ఉండడాన్ని మేము కొనసాగిస్తాము. ఫ్లిప్‌కార్ట్‌తో మేము ప్రస్తుత భాగస్వామ్యం నూతన తరపు స్మార్ట్ టీవీలను దేశవ్యాప్తంగా తన లక్షలాది మంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు వెళడంలో కీలక పాత్రను పోషించనుంది. వీటి విడుదలతో మేము 15% మార్కెట్ వాటాను రానున్న 3 ఏళ్లలో అందుకుంటామని’’ ధీమా వ్యక్తం చేశారు.
వీటి విడుదల, SPPL భాగస్వామ్యం గురించి జిఐపి డెవలప్మెంట్స్/బ్లావ్‌పంక్ట్ బ్రాండ్ లైసెన్సింగ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆండ్రెజ్ సెబ్రాట్ మాట్లాడుతూ ‘‘బ్లావ్‌పంక్ట్ ఔన్నత్యం మరియు ఇన్ఫినిటీ మా సంపద. మా బ్రాండ్ పునాదులు 1924 నుంచి ఉన్నాయి. అప్పటి నుంచి బ్లావ్‌పంక్ట్ అందుబాటు ధరల్లో జీవితానికి చేరువైన వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలను అందుబాటులోకి తీసుకు వస్తోంది. నేడు చాలా పురాతనమైన ఉత్పాదన కంపెనీ SPPLతో మా ప్రత్యేక భాగస్వామ్యం ద్వారా మేము మా బెస్ట్-ఇన్ –క్లాస్ ఆండ్రాయిడ్ టెలివిజన్ మోడళ్లు, అగ్రగామి సినిమాటిక్ అనుభవపు భరోసాను ఇస్తాయని’’ వివరించారు.
ఫ్లిఫ్‌కార్ట్ లార్జ్ అప్లయెన్సెస్ ఉపాధ్యక్షుడు హరి జి.కుమార్ మాట్లాడుతూ ‘‘వినియోగదారులకు టీవీ వీక్షణ అనుభం పలు సంవత్సరాల నుంచి మార్పులను సంతరించుకుంటూ వస్తుండగా, భారతదేశంలోని ఇళ్లలో స్మార్ట్ టీవీలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. వినియోగదారుల్లో వికసన చెందుతున్న ఈ అవసరాలను భర్తీ చేసేందుకు ఫ్లిప్‌కార్ట్ ముందంజలో ఉండగా, బ్రాండ్ భాగస్వాములతో ఈ వర్గంలోని అత్యుత్తమ సాంకేతికత పరిష్కరణలను అందిస్తోంది. మాకు SPPLతో సుదీర్ఘ బాంధవ్యం ఉంది మరియు ఫ్లిప్‌కార్ట్‌తో భారతదేశానికి బ్లావ్‌పంక్ట్ టీవీల విడుదలతో దాన్ని మరింత ముందుకు తోడ్కొని వెళ్లేందుకు ఉత్సుకతతో ఉన్నామని’’ వివరించారు.