Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ప్రమోట్ చేస్తున్న ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (IndiaFirst Life), కమ్యూనిటీ సంస్థగా ఉన్న రాష్ట్రీయ మన్సూరి సంఘ్, ఎ2వి ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్‌గా ఉన్న సేఫ్ ట్రీతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుని దేశవ్యాప్తంగా RMS సభ్యులకు అందుబాటులోకి వెళ్లి బీమా సదుపాయాలను ఎక్కువ మందికి సమగ్రంగా తీసుకు వెళ్లే లక్ష్యాన్ని పెట్టుకుంది.
ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఆర్ఆర్బి, స్ట్రాటజిక్ అలయన్స్, డైరెక్ట్ & మైక్రో, కంట్రీ హెడ్ మునిష్ భరద్వాజ్ మాట్లాడుతూ ‘‘ఇండియాఫస్ట్ లైఫ్ రిస్క్ ప్రొటెక్షన్‌ను అందించే సరసమైన ఉత్పత్తులతో ‘ప్రతి ఒక్కరికీ బీమా’ ఇచ్చేందుకు కట్టుబడి ఉంది. జీవితంలో ప్రశాంతత కోసం ఆర్ఎంఎస్ సముదాయాన్ని శక్తవంతం చేసేందుకు రాష్ట్రీయ మన్సూరి సంఘ్ మరియు సేఫ్ ట్రీలతో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడం మాకు సంతోషంగా ఉంది. ఆర్ఎంఎస్ సభ్యులు వారి తమ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మా సరసమైన ధర మరియు సమర్థవంతంగా సేవలను అందించే ఉత్పత్తుల నుంచి ఎంపిక చేసుకోవచ్చు. వ్యూహాత్మక పొత్తులతో కూడిన ఈ భాగస్వామ్యం ఇండియాఫస్ట్ లైఫ్ భారతదేశంలో మరింత బలోపేతం అయ్యేందుకు దోహదపడుతుందని’’ వివరించారు.
రాష్ట్రీయ మన్సూరి (RMS) సమాజ్ జాతీయ అధ్యక్షుడు యూనస్ మన్సూరి మాట్లాడుతూ “జీవిత బీమా ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్కరిలో కోవిడ్ అవగాహనను పెంచింది. ఇండియాఫస్ట్ లైఫ్‌తో మా భాగస్వామ్యం ద్వారా, మేము మా సంఘం సభ్యులలు మరియు వారికి అత్యంత ప్రియమైన వారి జీవితాలను ఆర్థికంగా సురక్షితంగా ఉంచుతాము. బీమా తీసుకున్నప్పటి నుంచి క్లెయిమ్‌ల పరిష్కారం వరకు సరళీకృత డిజిటల్ విధానం ద్వారా ద్వారా మా సభ్యులు తమకు అందుబాటు ధరలో బీమా ఉత్పత్తులను ఉత్పత్తులను పొందుతారని ఇండియాఫస్ట్ లైఫ్ నిర్ధారించిందని’’ పేర్కొన్నారు.
సేఫ్ ట్రీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వికాస్ ఆనంద్ మాట్లాడుతూ “ఆర్ఎంఎస్ సభ్యులకు సమగ్ర బీమా పరిష్కారాలను అందించేందుకు ఇండియాఫస్ట్ లైఫ్ మరియు రాష్ట్రీయ మన్సూరి సంఘ్ (RMS) మధ్య అర్ధవంతమైన భాగస్వామ్యాన్ని సులభతరం చేయడంలో సేఫ్ ట్రీ కీలక పాత్రను పోషించింది. నగదు ప్రవాహం అనూహ్యంగా ఉన్న సామూహిక మార్కెట్లలోకి ప్రవేశించేందుకు ఇటువంటి వినూత్న సంఘాలు ఉత్తమ మార్గమని మేము విశ్వసిస్తున్నామని’’ పేర్కొన్నారు. ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ టర్మ్ లైఫ్, యాక్సిడెంటల్ టోటల్ & పర్మినెంట్ డిసేబిలిటీ, గ్రూప్ హోస్పికేర్ వ్యాప్తంగా సరసమైన, సమగ్రమైన బీమా పరిష్కారాలను అందింస్తుండగా, వీటిని ఆర్ఎంఎస్ సభ్యులు డిజిటల్ విధానంలో పొందవచ్చు. బీమా రక్షణ ఎంచుకున్న వారి కుటుంబ సభ్యులకు, చివరిలో బీమా మొత్తాన్ని ఇస్తారు. అనారోగ్యం లేదా ప్రమాదంతో ఆసుపత్రిలో చేరితే, సభ్యులు స్థిర నగదు ప్రయోజనాన్ని పొందుతారు. ఇండియాఫస్ట్ లైఫ్ దేశవ్యాప్తంగా ఆయా వినియోగదారుల విభాగాలకు ఉపయోగపడే 44 అవసర-ఆధారిత ఆఫరింగ్ (ఉత్పత్తులు & రైడర్స్)లతో విభిన్న సూట్‌ను అందిస్తుంది. ‘ప్రతి ఒక్కరికీ బీమా’ అనే అంశాన్ని వాస్తవ రూపానికి తీసుకు వచ్చేందుకు ఈ సంస్థ తన వైవిధ్యభరితమైన పంపిణీ నెట్వర్క్ ద్వారా దేశంలోని 98% పిన్-కోడ్‌లలోని వినియోగదారులకు సేవలు అందిస్తోంది.