Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తరచుగా ఇటాలియన్ వంటకాలైనటువంటి పాస్తా లేదా తియ్యందనాలను ఇష్టపడుతూ సేమియా ఖీర్ లేదా సేమియా ఉప్మా తినడానికి ఇష్టపడుతూనే, ఆరోగ్యం పట్ల ఆప్రమప్తంగానూ ఉంటారా? అయితే ఇప్పుడు మీరు మీ రోటీ, అన్నంకు భిన్నంగా 24 మంత్ర ఆర్గానిక్ పాస్తా, వెర్మిసెల్లీ (సేమియా) ఉత్పత్తులతోనూ సరికొత్త రుచుల ఆస్వాదన చేస్తూనే ఆరోగ్యమూ పొందవచ్చు. పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో మరియు ఎలాంటి రసాయనాలు లేదా ఎరువులు, పురుగుమందులు వాడకుండా తీర్చిదిద్దిన ఈ నూతన ఉత్పత్తులు మీకు సంపూర్ణమైన స్వచ్ఛత మరియు భద్రతకు భరోసా అందిస్తాయి. ఈ రెండు ఆరోగ్య వంతమైన ఉత్పత్తులతో పాటుగా ప్రొటీన్ పట్ల అమితాసక్తి కనబరుస్తూనే శాండ్విచ్లను అమితంగా ఇష్టపడే వారి కోసం పీనట్ బటర్ ను సైతం విడుదల చేసింది.
24 మంత్ర ఆర్గానిక్ యొక్క పాస్తా రెండు రకాలు మకరోనీ, ఫుసిల్లిగా లభ్యమవుతుంటే, వెర్మిసెల్లీ మాత్రం రోస్టెడ్, ప్లెయిన్ రకాలుగా లభ్యమవుతుంది. ఈ రెండు ఉత్పత్తులూ 400 గ్రాముల ప్యాక్ పరిమాణాలలో లభ్యమవుతాయి. వెర్మిసెల్లీ ధర 60 రూపాయలు కాగా, పాస్తాను 80 రూపాయల ధరలో అందిస్తున్నారు. 24 మంత్ర ఆర్గానిక్ యొక్క పాస్తా, వెర్మిసెల్లీలను పూర్తి స్వచ్ఛమైన గోధుమ పిండితో తయారుచేస్తున్నారు. అత్యధిక ఫైబర్, పోషకాలు ఉండటం వల్ల అన్ని వయసుల వారికీ ఇది తగినట్లుగా ఉంటాయి.
మరో వైపు పీనట్ బటర్లో సాధారణ వెన్న, మార్గరిన్తో పోల్చినప్పుడు అతి తక్కువ కొవ్వు శాతం ఉంటుంది. డ్రై రోస్టెడ్ వేరుశెనగను గ్రైండింగ్ చేయడం ద్వారా పీనట్ బటర్ తయారుచేశారు. చక్కటి పరిమాణంలో ప్రొటీన్, ఫ్యాట్‌ను ఇది కలిగి ఉంటుంది. 24 మంత్ర ఆర్గానిక్ పీనట్ బటర్లో పొటాషియం, రాగి, మెగ్నీషియం, జింక్, సెలీనియంతో పాటుగా అవసరమైన అమినో యాసిడ్లు అయిన లిసైన్, థ్రియోనైన్ వంటివి ఉంటాయి. విటమిన్ బీ,ఈ లో దీనిని సమృద్ధి చేశారు. ఈ పీనట్ బటర్ 800 గ్రాముల ప్యాక్ 400 రూపాయలలో, 450 గ్రాముల ప్యాక్ 225 రూపాయలలో లభ్యమవుతుంది. అన్ని ఇతర ఉత్పత్తుల్లాగానే 24 మంత్ర ఆర్గానిక్ నూతనంగా ఆవిష్కరించిన ఉత్పత్తులన్నీ కూడా భారతదేశవ్యాప్తంగా 10వేలకు పైగా రిటైల్ఔట్లెట్లుతో పాటుగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో తమ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లలోనూ లభ్యమవుతుంది. వీటిని అన్ని సుప్రసిద్ధ ఈఉకామర్స్ స్టోర్స్, హైపర్మార్కెట్లలో కూడా కొనుగోలు చేయవచ్చు.