Authorization
Mon Jan 19, 2015 06:51 pm
· క్యు సిరీస్ సౌండ్బార్లు ప్రత్యేకమైన క్యు–సింఫనీ సాంకేతికతతో వస్తున్నాయి. ఇవి అత్యంత సౌకర్యవంతంగా ఆడియోను శాంసంగ్ క్యుఎల్‌ఈడీ టీవీతో మిళితం కావడంతో పాటుగా 3డీ సౌండ్‌ను అందిస్తుంది
· స్పేస్ ఫిట్ సౌండ్‌ను పరిచయం చేస్తున్నారు. ఇది మీ టీవీ యొక్క భౌతిక వాతావరణం విశ్లేషించడంతో పాటుగా లీనమయ్యే శబ్ద అనుభవాలను మీ ప్రాంగణానికి ప్రత్యేకంగా తీర్చిదిద్దిన రీతిలో అందిస్తుంది.
· మెరుగైన శబ్ద అనుభవాల కోసం వృద్ధి చేయబడిన డాల్బీ అట్మాస్ సాంకేతికత శ్రేణి
ఢిల్లీ: భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన మరియు ఎక్కువ మంది అభిమానించే కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ బ్రాండ్ శాంసంగ్, తమ 2021 సౌండ్‌బార్ శ్రేణిని విడుదల చేసింది. ఈ శ్రేణిలో ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా 11.1.4 ఛానెల్ సౌండ్‌బార్ సైతం ఉంది. గతంలో ఎన్నడూ చూడనటువంటి లీనమయ్యే సరౌండ్ సౌండ్ శబ్ద అనుభవాలను ఇది అందిస్తుంది. 2021 సౌండ్‌బార్ శ్రేణి శాసంగ్ అధికారిక ఆన్లైన్ స్టోర్ శాంసంగ్ షాప్ మరియు ఎంపిక చేసిన శాంసంగ్ స్మార్ట్ ప్లాజాల వద్ద జూలై 07,2021 నుంచి లభ్యమవుతాయి. క్యు సిరీస్ సౌండ్‌బార్ మోడల్స్– క్యు 950ఏ , క్యు 900ఏ, క్యు800ఏ, క్యు600ఏ వరుసగా 1,47,990 రూపాయలు; 111,990 రూపాయలు ; 61,990 రూపాయలు మరియు 43,990 రూపాయల ధరలో లభిస్తాయి. ఏ సిరీస్ సౌండ్‌బార్ మోడల్స్ ఏ670, ఏ550 మరియు ఏ450లు వరుసగా 47,990 రూపాయలు, 33,990రూపాయలు మరియు 27,990 రూపాయలలోలభిస్తున్నాయి. ఎస్ సిరీస్ సౌండ్‌బార్ మోడల్ ఎస్ 61ఏ ఇప్పుడు 47,990 రూపాయల ధరలో లభిస్తుంది.
ఈ సౌండ్బార్లను కొనుగోలు చేసే వినియోగదారులు 10% అదనపు క్యాష్‌బ్యాక్‌ను 6వేల రూపాయల వరకూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన అన్ని సుప్రసిద్ధ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులపై లభిస్తుంది. అన్ని సౌండ్బార్లు 12 నెలల వారెంటీతో వస్తున్నాయి. నూతన క్యు–సిరీస్, ఏ–సిరీస్ మరియు ఎస్–సిరీస్ సౌండ్బార్లును అత్యంత జాగ్రత్తగా కాలిఫోర్నియాలోని వాలెన్సియా వద్దనున్న శాంసంగ్ ఆడియో ల్యాబ్ వద్ద ట్యూన్ చేశారు. ఇది గృహం లోని ప్రతి ఒక్కరికీ ఖచ్చితమైన వినోద అనుభవాలను అందిస్తుంది. అది మీ అభిమాన షోను బింగీ వాచ్ చేస్తున్నప్పుడు లేదా యాక్షన్ చిత్రం చూస్తున్నప్పుడు లేదా గుండె వేగం పెంచే వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు సైతం ఈ అనుభవాలను పొందవచ్చు. ఈ నూతన సౌండ్ బార్ శ్రేణి అన్ని సుప్రసిద్ధ కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్ స్టోర్లు మరియు ఆన్లైన్ వేదికలు, శాంసంగ్ అధికారిక ఆన్లైన్ స్టోర్ శాంసంగ్ షాప్ వద్ద జూలై 07,2021 నుంచి లభ్యమవుతాయి.
నూతన ప్రీమియం క్యు సిరీస్ సౌండ్‌బార్, ఆడియో సాంకేతిక ఆవిష్కరణలకు ప్రతిరూపంగా ఉండటంతో పాటుగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 11.1.4 ఛానెల్‌తో వస్తుంది. ఇది వినియోగదారులకు అత్యంత వాస్తవిక త్రి కోణ ఆడియోను ఆస్వాదించే అవకాశం అందిస్తుంది. వినియోగదారుల అనుభవాలను ఖచ్చితంగా మార్చేందుకు సహాయపడుతూ, క్యు–సిరీస్ సౌండ్బార్లు శాంసంగ్ యొక్క సిగ్నేచర్ క్యు –సింఫనీ సాంకేతికతతో వస్తాయి. ఇవి టీవీ నుంచి సరౌండ్ సౌండ్‌ను మరియు సౌండ్ బార్‌ను ఒకేసారి ప్లే చేస్తాయి. తద్వారా అద్భుతమైన ఆడియో సినర్జీని సృష్టిస్తుంది.
అసలైన సినిమాటిక్ అనుభవాల కోసం, క్యు సిరీస్‌లోని అన్ని మోడల్స్, డాల్బీ అట్మాస్/డీటీఎస్–ఎక్స్‌కు మద్దతునందిస్తాయి. శాంసంగ్ స్పేస్ ఫిట్ సౌండ్ టెక్నాలజీతో ఆడియో అనుభవాలు పూర్తి ఉన్నతంగా మారతాయి. ఈ స్పేస్‌ఫిట్ సౌండ్ టెక్నాలజీ, చుట్టుపక్కల వాతావరణాన్ని స్వయం చాలకంగా విశ్లేషించడంతో పాటుగా ఆప్టిమైజ్డ్ సరౌండ్ అనుభవాలనూ అందిస్తుంది. అంతేనా, మీ టీవీకి ఓ గేమ్ ఉపకరణం జోడించినప్పుడు, ఈ సౌండ్ బార్ స్వయం చాలకంగా గేమ్మోడ్కు మారుతుంది. దీనివల్ల, మీరు కేవలం గేమ్ ఆస్వాదనపై మాత్రమే దృష్టి సారించగలరు. ఈ నూతన శ్రేణి లో అమెజాన్ అలెక్సాను అంతర్గతంగా కలిగి ఉంది. ఇది మీ వినికిడి అనుభవాలను పూర్తిగా నియంత్రిస్తుంది.
హై వాటేజ్ సౌండ్బార్ల కోసం భారతీయ వినియోగదారుల డిమాండ్‌ను తీర్చేందుకు,నూతన ఏ –సిరీస్ సౌండ్బార్లు మెరుగైన వాటేజ్‌తో వస్తాయి. ఈ సిరీస్ , డాల్బీ ఆడియో/డీటీఎస్ వర్ట్యువల్ ఎక్స్‌తో వస్తుంది. శాంసంగ్ యొక్క ప్రత్యేకమైన ఆడియో ప్రాసెసింగ్ సాంకేతికతతో ఈ 3డీ సౌండ్ తీర్చిదిద్దారు. ఇది లీనమయ్యే శబ్ద అనుభవాలను అందిస్తుంది. దీనిలోని నూతన బాస్ బూస్ట్ ఫీచర్, వినియోగదారులు మరింతగా బూమ్‌ను అతి సరళమైన క్లిక్‌తో జోడించేందుకు అందిస్తుంది. అదే సమయంలో అడాప్టివ్ సౌండ్ లైట్ సాంకేతికత, స్వయం చాలకంగా వాయిస్ స్పష్టతను వృద్ధి చేయడంతో పాటుగా టీవీ సిరీస్, స్పోర్ట్స్, న్యూస్ కోసం సౌండ్‌ను కంటెంట్ ఆధారంగా ఆప్టిమైజ్ చేస్తుంది.
ఎస్ –సిరీస్ సౌండ్బార్లు ఆకర్షణీయమైన డిజైన్‌ను ప్రీమియం ఫ్యాబ్రిక్‌తో చుట్టుబడి వస్తాయి. ఇవి మృదువైన వినియోగం మరియు అత్యద్భుతమైన సౌండ్ అనుభవాలను అందిస్తాయి. ఇవి మీ లివింగ్ రూమ్‌కు ఖచ్చితమైన జోడింపుగా నిలుస్తాయి. సెంట్రల్ స్పీకర్ లేకుండానే, గదిలో మూలన కూర్చున్న వారికి సైతం తమ దగ్గరలో ఉన్న శబ్దాలను మాత్రమే వినేలా చేస్తాయి. ఈ సిరీస్‌లో సెంట్రల్ స్పీకర్ ఉంది. ఇది గదిలో పూర్తిగా పూరించిన సినిమా శైలి వాతావరణం అందిస్తుంది. తమ మొబైల్ ఉపకరణాల ద్వారా సంగీతం వినేవారి కోసం, టాప్ సౌండ్ ఫీచర్ సౌండ్‌బార్‌తో అతి సులభంగా ఉపకరణాన్ని అనుసంధానించడంతో పాటుగా సంగీతం ఆస్వాదించే అవకాశం అందిస్తుంది.
‘‘ ఇంటి లోపల వినోదం అనేది పని,ఆటలు నడుమ హద్దులు చెరిగిపోయిన ఎడల నేడు అతి ముఖ్యమైన స్ట్రెస్‌బస్టర్‌గా నిలుస్తుంది. మా 2021 సౌండ్‌బార్ శ్రేణిని ప్రీమియం సౌండ్‌బార్ అనుభవాలను ఆకర్షణీయమైన లుక్స్‌తో అందించేలా తీర్చిదిద్దారు. సృజనాత్మక ఫీచర్లు మరియు పరిశ్రమలో మొట్టమొదటిసారి అనతగ్గ సాంకేతికత వంటివి ఈ నూతన శ్రేణికి గేమ్ ఛేంజర్స్‌గా నిలువడంతో పాటుగా ఖచ్చితమైన శబ్ద అనుభవాలను వెదికే వారికి తగినట్లుగా ఉంటాయి. అపరిమిత కంటెంట్ వినియోగదారులకు అందుబాటులో ఉన్న వేళ,సౌండ్బార్లు ఆడియో–విజువల్ వినోద అనుభవాలను మరింతగా పొందడంలో సహాయపడతాయి’’ అని రాజు పల్లన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ బిజినెస్, శాంసంగ్ ఇండియా అన్నారు.
ధరలు, ఆఫర్లు, ఎక్కడ కొనుగోలు చేయాలి
2021 సౌండ్‌బార్ శ్రేణి శాసంగ్ అధికారిక ఆన్లైన్ స్టోర్ శాంసంగ్ షాప్ మరియు ఎంపిక చేసిన శాంసంగ్ స్మార్ట్ ప్లాజాల వద్ద జూలై 07,2021 నుంచి లభ్యమవుతాయి. క్యు సిరీస్ సౌండ్‌బార్ మోడల్స్– క్యు 950ఏ , క్యు 900ఏ, క్యు800ఏ, క్యు600ఏ వరుసగా 1,47,990 రూపాయలు; 111,990 రూపాయలు ; 61,990 రూపాయలు మరియు 43,990 రూపాయల ధరలో లభిస్తాయి. ఏ సిరీస్ సౌండ్‌బార్ మోడల్స్ ఏ670, ఏ550 మరియు ఏ450లు వరుసగా 47,990 రూపాయలు, 33,990రూపాయలు మరియు 27,990 రూపాయలలోలభిస్తున్నాయి. ఎస్ సిరీస్ సౌండ్‌బార్ మోడల్ ఎస్ 61ఏ ఇప్పుడు 47,990 రూపాయల ధరలో లభిస్తుంది.
ఈ సౌండ్బార్లను కొనుగోలు చేసే వినియోగదారులు 10% అదనపు క్యాష్‌బ్యాక్‌ను 6వేల రూపాయల వరకూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన అన్ని సుప్రసిద్ధ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులపై లభిస్తుంది.
క్యు సిరీస్
డాల్బీ అట్మాస్/డీటీఎస్ 'ఎక్స్' సినిమాటిక్ అనుభవాలను అత్యుత్తమ 3డీ సౌండ్‌తో ఇంటిలోని అన్ని మూలల నుంచి ఆస్వాదించండి. క్యు 950ఏ మరియు క్యు900ఏలు డాల్బీ అట్మాస్‌కు వేవ్ గైడ్‌తో తమ పూర్తి శ్రేణి డ్రైవర్‌తో మద్దతునందిస్తుంది. క్యు సిరీస్ మోడల్స్ క్యు800ఏ మరియు క్యు 600ఏలు అసలైన డాల్బీ అట్మాస్‌ను శాంసంగ్ పేటెంట్ టెక్నాలజీతో మద్దతునందిస్తుంది. ఎకౌస్టికర్ బీమ్, అప్వార్డ్ ఫైరింగ్ స్పీకర్‌గా పనిచేయడంతో పాటుగా లీనమయ్యే ఓవర్‌హెడ్ శబ్దాన్నీ అందిస్తుంది.
అసలైన 11.1.4 ఛానెల్ సౌండ్‌బార్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 11.1.4 ఛానెల్, సవివరమైన భావోద్వేగాలను 11 దిశలలో అందిస్తుంది. అసాధారణ స్టీరియోస్కోపిక్ శబ్ద అనుభవాలను వినియోగదారులు ఆస్వాదించవచ్చు. శాంసంగ్ నుంచి ఎదురులేనట్టి నూతన శబ్ద సాంకేతికత ఇది. ప్రపంచంలో అన్ని కదలికలనూ ఇది ఖచ్చితంగా పునరుత్పత్తి చేస్తుంది.
అప్–ఫైరింగ్ రియర్ స్పీకర్స్: శాంసంగ్ ఆడియో ల్యాబ్ తీర్చిదిద్దిన వేవ్ గైడ్ సాంకేతికత , అప్–ఫైరింగ్ స్పీకర్ల ప్రాజెక్ట్ ఆడియోను మీ పైన ఉండేందుకు తోడ్పడటంతో పాటుగా ఓవర్‌హెడ్ మరియు సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్‌ను గరిష్టంగా ఉంచుతుంది.
క్యు–సింఫనీ: అత్యుత్తమ సీఈఎస్ ఆవిష్కరణగా అవార్డు అందుకున్న క్యు–సింఫనీ, మీ సౌండ్ బార్ మీ శాంసంగ్ టీవీతో అద్భుతంగా మిళితమయ్యేందుకు తోడ్పడుతుంది. ఈ రెండూ కలిసి లీనమయ్యే శబ్దాన్ని అందిస్తాయి. ఇది సౌండ్‌బార్ యొక్క ముందు, పక్క మరియు అప్ ఫైరింగ్ స్పీకర్లు అలాగే టీవీ యొక్క స్పీకర్ల ద్వారా శబ్ద అనుభవాలను వృద్ధి చేస్తుంది. ఇది మీకు నూతన స్ధాయి ఎకౌస్టిక్ను అందిస్తుంది. అందువల్ల మీరు గతంలో ఎన్నడూ చూడనట్టి రీతిలో కంటెంట్ అనుభవాలను పొందవచ్చు.
స్పేస్ ఫిట్ సౌండ్: స్పేస్‌ఫిట్ సౌండ్ స్వయంచాలకంగా, చుట్టుపక్కల వాతావరణాన్ని మీ లివింగ్ రూమ్‌లో విశ్లేషించడంతో పాటుగా మీకు అత్యుత్తమ సౌండ్‌ను అందిస్తుంది.
గేమ్ మోడ్ ప్రో: శక్తివంతమైనఅప్ ఫైరింగ్ స్పీకర్లు, ఎకౌస్టిక్బీమ్ మరియు శక్తివంతమైన వూఫర్లతో కూడిన సౌండ్‌బార్, మీకు మల్టీ డైమన్షనల్ 3డీ డైనమిక్ సౌండ్‌ను గేమింగ్ కోసం అత్యుత్తమంగా అందిస్తుంది. ఈ సౌండ్‌బార్ స్వయం చాలకంగా గేమ్ మోడ్‌కు మీ శాంసంగ్ టీవీని కనెక్ట్ చేసినప్పుడు మారుతుంది. అందువల్ల మీరు ఆటపై దృష్టి సారించవచ్చు.
ఒన్ రిమోట్: శాంసంగ్ టీవీ లాగానే శాంసంగ్ సౌండ్‌బార్ సైతం ఇంటర్ఫేజ్ కలిగి ఉంది. అందువల్ల తమ శాంసంగ్ టీవీ రిమోట్‌తో తమ శాంసంగ్ సౌండ్బార్లను సైతం వినియోగదారులు నియంత్రించవచ్చు. ఒకరు తమ సౌండ్‌బార్‌ను ఆన్ చేయడం లేదా ఆఫ్ చేయడం మరియు విభిన్నమైన ఫీచర్లు అయినటువంటి మ్యూట్, సౌండ్ ఎఫెక్ట్స్ మరియు ఈక్యు సెట్టింగ్స్‌ను శాంసంగ్ టీవీ రిమోట్ కంట్రోల్‌తో నియంత్రించవచ్చు
బిల్ట్ ఇన్ అమెజాన్ అలెక్సా: మీ వినికిడి అనుభవాలను అంతర్గతంగా నిర్మించిన అమెజాన్ అలెక్సాతో పూర్తిగా నియంత్రించవచ్చు.
మ్యూజిక్ స్ట్రీమింగ్ మరింత సులభతరం: ఎయిర్‌ప్లే 2 అనేది ఓటీఎన్ ద్వారా నూతనంగా మద్దతునందిచడంతో పాటుగా ఐ ఫోన్లు మరియు ఇతర యాపిల్ ఎకోసిస్టమ్ ఉపకరణాల ద్వారా స్ట్రీమ్ చేసుకునేందుకు సైతం తోడ్పడుతుంది. మొబైల్ సౌండ్ ను శక్తివంతమైన సౌండ్ బార్ శబ్దంగాసింగిల్ ట్యాప్‌తో మార్చేందుకు తోడ్పడేది టాప్ సౌండ్. మీరు మీ మొబైల్ స్ర్కీన్‌ను టీవీపై ఆస్వాదించడంతో పాటుగా మొబైల్ సౌండ్‌ను సైతం సౌండ్‌బార్ ద్వారా పూర్తిగా లీనమయ్యే మార్గంలో ఒకేసారి ఆస్వాదించవచ్చు.
ఏ సిరీస్:
డాల్బీ ఆడియో/ డీటీఎస్ వర్ట్యువల్ 'ఎక్స్' ఇది గదిని పూర్తిగా నింపే సాంకేతికత. ఇది మీ గదిని వర్ట్యువల్ సరౌండ్ సౌండ్స్‌తో పూరిస్తుంది. ఇది బిగ్ డాటా ఆధారంగా సీన్స్‌ను విశ్లేషించడంతో పాటుగా శబ్దాన్ని సరైన ప్రదేశానికి పంపుతుంది. తద్వారా ఖచ్చితమైన శబ్ద అనుభవాలను స్పీకర్లు ఉన్న ప్రాంతాలతో సంబంధం లేకుండా అందిస్తుంది. ఒకవేళ మీరు మహోన్నత శబ్దాలను ఆస్వాదించాలనుకుంటే, ఆప్షనల్ రియర్ స్పీకర్ ఎస్‌డబ్ల్యుఏ–9100ఎస్ దీనిని అందిస్తుంది.
బాస్ బూస్ట్: ఈ ఫీచర్ మరింత శక్తిని అందించడంతో పాటుగా వినియోగదారులు మరింత బూమ్‌ను అతి సులభమైన క్లిక్‌తో పొందేందుకు తోడ్పడుతుంది. విని యోగదారులు ఓ బీట్‌లో మంచి బూమ్ ఉందనుకున్న ప్రతిసారీ దీనిని వినియోగించుకోవచ్చు.
అడాప్టివ్ సౌండ్ లైట్: అడాప్టివ్ సౌండ్ లైట్ , టీవీ సిరీస్, స్పోర్ట్స్, న్యూస్ కోసం శబ్దాన్ని ఆప్టిమైజ్ చేయడంతో పాటుగా ప్రతి కంటెంట్‌కు తగినట్లుగా ఆడియో ట్రాక్‌ను స్వయంచాలకంగా విశ్లేషిస్తుంది.
ఇన్‌బిల్ట్ సబ్‌ఊఫర్: అంతర్గతంగా నిర్మించిన వైర్లెస్ సబ్‌ఊఫర్ మీ జీవితానికి వినోదాన్ని మరింత స్పష్టంగా తీసుకువస్తుంది.
ఒన్ రిమోట్: శాంసంగ్ టీవీ లాగానే శాంసంగ్ సౌండ్‌బార్ సైతం ఇంటర్ఫేజ్ కలిగి ఉంది. అందువల్ల తమ శాంసంగ్ టీవీ రిమోట్‌తో సౌండ్‌బార్‌ను సైతం నియంత్రించవచ్చు. ఒకరు తమ సౌండ్‌బార్‌ను ఆన్ మరియుఆఫ్ చేయడంతో పాటుగా విభిన్నమైన ఫీచర్లు అయినటువంటి మ్యూట్, సౌండ్ ఎఫెక్ట్స్ మరియు ఈక్యు సెట్టింగ్స్‌ను శాంసంగ్ టీవీ రిమోట్ కంట్రోల్‌తో నియంత్రించవచ్చు.
ఎకౌస్టిక్ బీమ్‌తో సైడ్ హార్న్ స్పీకర్: ఈ సాంకేతికత పూర్తిగా లీనమయ్యే శబ్ద అనుభవాలను అందిస్తుంది. ఇది పూర్తిగా ప్రాంగణాలపై ఆధిపత్యం వహిస్తుంది. ఎకౌస్టిక్ బీమ్‌లో బహుళ అప్ ఫైరింగ్ హోల్స్ ఉన్నాయి. ఈ హోల్స్ అన్నీ కూడా సింగిల్ స్పీకర్‌గా పనిచేయడంతో పాటుగా మరింత శక్తివంతమైన, ఆహ్లాదకరమైన శబ్ద అనుభవాలను అందిస్తుంది. సైడ్ హార్న్ స్పీకర్‌ను సౌండ్బార్కు రెండు వైపులా అమర్చడం వల్ల మెగాఫోన్లా పనిచేస్తూనే శబ్ద అనుభవాలనూ మెరుగుపరుస్తుంది. ఎకౌస్టిక్ బీమ్‌తో సైడ్ హార్న్ స్పీకర్లు, సౌండ్ సరౌండింగ్ను పూర్తి సమగ్రమైన ఫార్మ్ ఫ్యాక్టర్‌తో శబ్దాన్ని వ్యాప్తి చేస్తాయి.
ప్రీమియం ఫ్యాబ్రిక్ డిజైన్: ప్రీమియం ఫ్యాబ్రిక్‌తో చుట్టబడిన ఈ స్పీకర్లు, ఎలాంటి ఇంటీరియర్‌తో అయినా అందంగా మిళితమవుతుంది. మీ ఇంటిలో భాగమయ్యేందుకు డిజైన్ చేయబడిన శబ్ద వ్యవస్థ ఇది. ఈ సౌండ్‌బార్ యొక్క కాలాతీత లుక్, సహజసిద్ధమైన భావొద్వేగాలను సైతం అందిస్తుంది.
అమెజాన్ అలెక్సా అంతర్గతంగా నిర్మించబడింది. అంతర్గతంగా నిర్మించిన అమెజాన్ అలెక్సాతో మీ వినికిడి అనుభవాలపై పూర్తి నియంత్రణను అందిస్తుంది.
మ్యూజిక్ స్ట్రీమింగ్ మరింత సులభతరం: ఎయిర్‌ప్లే 2 అనేది ఓటీఎన్ ద్వారా నూతనంగా మద్దతునందిచడంతో పాటుగా ఐ ఫోన్లు మరియు ఇతర యాపిల్ ఎకోసిస్టమ్ ఉపకరణాల ద్వారా స్ట్రీమ్ చేసుకునేందుకు సైతం తోడ్పడుతుంది. మొబైల్ సౌండ్ ను శక్తివంతమైన సౌండ్ బార్ శబ్దంగాసింగిల్ ట్యాప్‌తో మార్చేందుకు తోడ్పడేది టాప్ సౌండ్. మీరు మీ మొబైల్ స్ర్కీన్‌ను టీవీపై ఆస్వాదించడంతో పాటుగా మొబైల్ సౌండ్‌ను సైతం సౌండ్‌బార్ ద్వారా పూర్తిగా లీనమయ్యే మార్గంలో ఒకేసారి ఆస్వాదించవచ్చు.