Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: విశ్వసనీయ అంతర్జాతీయ వ్యాపార పరిష్కారాల ప్రదాత మౌరి టెక్ తాము సీఎంఎంఐ ఇనిస్టిట్యూట్ యొక్క క్యాపబిలిటీ మెచ్యూరిటీ మోడల్ ఇంటిగ్రేషన్ (సీఎంఎంఐ) లెవల్ 5 ప్రశంసలను తమ ఐటీ అభివృద్ధి, సేవా సామర్థ్యం పరంగా పొందినట్లు వెల్లడించింది. డెలివరీ ఎక్స్‌లెన్స్‌లో వాంఛనీయ మెచ్యూరిటీ మోడల్‌ను ప్రదర్శించడానికి ఇది అత్యున్నత స్థాయి ధృవీకరణగా నిలుస్తుంది. వినూత్నమైన ప్రక్రియలు, సాంకేతికంగా అత్యాధునిక ఆవిష్కరణల ద్వారా ఉత్పత్తులు మరియు సేవల అభివృద్ధి అమలు చేయడాన్ని క్యాపబిలిటీ మెచ్యూరిటీ మోడల్ ఇంటిగ్రేషన్ (సీఎంఎంఐ) కార్యాచరణ అనుమతిస్తుంది. ఈ స్థాయి వద్ద, సంస్ధలు నిత్యం తమ ప్రక్రియలను తమ వ్యాపార లక్ష్యాలు, పనితీరు అవసరాలకనుగుణంగా అర్ధం చేసుకోవడంతో పాటుగా మెరుగుపరుచుకుంటాయి. ఈ అభివృద్ధిపై మౌరిటెక్ గ్లోబల్ సీఈవో శ్రీ అనిల్ యెర్రంరెడ్డి మాట్లాడుతూ ‘‘సీఎంఎంఐ లెవల్ 5 వద్ద మేము ప్రశంసలు పొందడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. మా వైవిధ్యమైన సేవల వ్యాప్తంగా నిరంతర అభివృద్ధి, డెలివరీ సామర్ధ్యంకు ప్రతీకగా ఇది నిలుస్తుంది. ఈ గుర్తింపు, మా అంతర్జాతీయ ఖాతాదారులందరికీ ఉన్నతమైన పరిష్కారాలను అందించడం మరియు ఆధారపడతగ్గ వాతావరణం సృష్టించాలనే మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది’’ అని అన్నారు.
తమ వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించేందుకు కట్టుబడిన సర్వోన్నత సంస్ధ మౌరి టెక్. సీఎంఎంఐ లెవల్ 5 గుర్తింపుతో పాటుగా మౌరిటెక్ ఇప్పటికే ఏఐసీపీఏ ఎస్ఓసీ 1 మరియు ఎస్ఓసీ 2, పీసీఐ డీఎస్స్, ఐఎస్ఓ 270001-2013, ఐఎస్ఓ 9001-2015 మరియు హిప్పా ధృవీకరణలను సైతం పొందింది.